కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 22:27
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 27 ఎందుకంటే, తన శరీరాన్ని కప్పుకోవడానికి అతని దగ్గర ఉన్న వస్త్రం అదొక్కటే; అది లేకపోతే అతను దేన్ని కప్పుకొని పడుకుంటాడు? అతను నాకు మొరపెట్టినప్పుడు నేను ఖచ్చితంగా వింటాను, ఎందుకంటే నేను కనికరం* గలవాణ్ణి.+

  • 2 దినవృత్తాంతాలు 30:9
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 9 మీరు యెహోవా దగ్గరికి తిరిగొస్తే మీ సహోదరుల్ని, మీ కుమారుల్ని బందీలుగా తీసుకెళ్లినవాళ్లు వాళ్లమీద కరుణ చూపించి,+ వాళ్లను ఈ దేశానికి తిరిగి రానిస్తారు.+ ఎందుకంటే, మీ దేవుడైన యెహోవా కనికరం,* కరుణ గల దేవుడు.+ మీరు ఆయన దగ్గరికి తిరిగొస్తే ఆయన తన ముఖాన్ని పక్కకు తిప్పుకోడు.”+

  • నెహెమ్యా 9:17
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 17 వాళ్లు వినడానికి ఇష్టపడలేదు,+ వాళ్ల మధ్య నువ్వు చేసిన అసాధారణ కార్యాల్ని వాళ్లు గుర్తుంచుకోలేదు; వాళ్లు మొండిగా తయారై, ఐగుప్తు బానిసత్వంలోకి తిరిగెళ్లడానికి తమ మీద ఒక నాయకుణ్ణి నియమించుకున్నారు.+ కానీ నువ్వు క్షమించడానికి సిద్ధంగా ఉండే దేవుడివి, కనికరం,* కరుణ, ఓర్పు గలవాడివి,* ఎంతో విశ్వసనీయ ప్రేమను* చూపించేవాడివి;+ అందుకే నువ్వు వాళ్లను విడిచిపెట్టలేదు.+

  • కీర్తన 86:15
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 15 కానీ యెహోవా, నువ్వు కరుణ, కనికరం* గల దేవుడివి,

      ఓర్పు,* అపారమైన విశ్వసనీయ ప్రేమ, నమ్మకత్వం గల* దేవుడివి.+

  • యోవేలు 2:13
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 13 మీ వస్త్రాల్ని కాదు+ మీ హృదయాల్ని చింపుకొని+

      మీ దేవుడైన యెహోవా దగ్గరికి తిరిగిరండి.

      ఎందుకంటే ఆయన కనికరం,* కరుణ, ఓర్పు,*+ అపారమైన విశ్వసనీయ ప్రేమ గలవాడు,+

      విపత్తు గురించి ఆయన ఇంకోసారి ఆలోచిస్తాడు.*

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి