21 అప్పుడు యెహోవా ఒక దేవదూతను పంపించి అష్షూరు రాజు శిబిరంలో ఉన్న ప్రతీ బలమైన యోధుణ్ణి, నాయకుణ్ణి, అధిపతిని చంపేశాడు.+ దాంతో అష్షూరు రాజు అవమానంతో తన దేశానికి వెళ్లిపోయాడు. తర్వాత అతను తన దేవుని గుడిలోకి వెళ్లినప్పుడు అతని కుమారుల్లో కొంతమంది అతన్ని కత్తితో చంపారు.+