4 తర్వాత రాజు బయలు కోసం, పూజా కర్ర+ కోసం, ఆకాశ సైన్యమంతటి కోసం చేసిన పాత్రలన్నిటినీ యెహోవా మందిరంలో నుండి బయటికి తీసుకురమ్మని ప్రధానయాజకుడైన హిల్కీయాకు,+ సహాయ యాజకులకు, ద్వారపాలకులకు ఆజ్ఞాపించాడు; వాటిని యెరూషలేము బయట కిద్రోను ఏటవాలు ప్రాంతాల మీద కాల్చేశాడు, వాటి బూడిదను బేతేలుకు+ తీసుకెళ్లాడు.