-
2 రాజులు 22:3-6పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
3 యోషీయా రాజు తన పరిపాలనలోని 18వ సంవత్సరంలో మెషుల్లాము మనవడూ, అజల్యా కుమారుడూ, కార్యదర్శీ అయిన షాఫానును యెహోవా మందిరానికి పంపిస్తూ+ ఇలా చెప్పాడు: 4 “నువ్వు ప్రధానయాజకుడైన హిల్కీయా+ దగ్గరికి వెళ్లు; యెహోవా మందిరంలోకి వచ్చే డబ్బంతటినీ,+ అంటే ద్వారపాలకులు ప్రజల దగ్గర సేకరించిన డబ్బంతటినీ పోగుచేయమని చెప్పు.+ 5 వాళ్లు ఆ డబ్బును యెహోవా మందిరంలో జరుగుతున్న పనిని పర్యవేక్షిస్తున్నవాళ్లకు ఇవ్వాలి; వాళ్లు ఆ డబ్బును యెహోవా మందిరాన్ని* బాగుచేసే పనివాళ్లకు ఇస్తారు,+ 6 అంటే నైపుణ్యంగల పనివాళ్లకు, నిర్మాణకులకు, తాపీ పనివాళ్లకు ఇస్తారు; అంతేకాదు ఆ డబ్బుతో మందిరాన్ని బాగుచేయడానికి కావాల్సిన మ్రానుల్ని, చెక్కిన రాళ్లను కొంటారు.+
-