24 మోషే ఈ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటినీ ఒక గ్రంథంలో రాయడం+ పూర్తిచేసిన వెంటనే, 25 యెహోవా ఒప్పంద మందసాన్ని మోసే లేవీయులకు మోషే ఇలా ఆజ్ఞాపించాడు: 26 “ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని+ తీసుకొని, దీన్ని మీ దేవుడైన యెహోవా ఒప్పంద మందసం పక్కన పెట్టండి.+ అక్కడ అది మీ మీద సాక్షిగా పనిచేస్తుంది.