-
ఎజ్రా 9:1, 2పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
9 ఈ విషయాలు జరిగిన వెంటనే అధిపతులు నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పారు: “ఇశ్రాయేలు ప్రజలు, యాజకులు, లేవీయులు చుట్టుపక్కల దేశాల ప్రజల నుండి, అంటే కనానీయుల, హిత్తీయుల, పెరిజ్జీయుల, యెబూసీయుల, అమ్మోనీయుల, మోయాబీయుల, ఐగుప్తీయుల,+ అమోరీయుల+ నుండి, వాళ్ల అసహ్యమైన ఆచారాల నుండి తమను తాము వేరుపర్చుకోలేదు.+ 2 వాళ్లూ, వాళ్ల కుమారులూ ఆ దేశాల స్త్రీలలో కొంతమందిని పెళ్లి చేసుకున్నారు.+ ఇప్పుడు వాళ్లు, అంటే పవిత్రమైన ప్రజలు*+ చుట్టుపక్కల దేశాల ప్రజలతో కలిసిపోయారు.+ ఈ పాపంలో ముఖ్యమైన దోషులు అధిపతులు, ఉప పాలకులే.”
-