31 తెరహు తన కుమారుడు అబ్రామును, హారాను కుమారుడూ తన మనవడూ అయిన లోతును, అబ్రాము భార్యయైన తన కోడలు శారయిని తీసుకొని కల్దీయుల దేశంలోని ఊరు నగరం నుండి బయల్దేరాడు. వాళ్లు అతనితో కలిసి కనాను దేశం+ వైపు ప్రయాణం మొదలుపెట్టారు. కొంతకాలానికి వాళ్లు హారానుకు చేరుకొని,+ అక్కడే నివసించడం మొదలుపెట్టారు.