-
నిర్గమకాండం 14:19, 20పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
19 అప్పుడు ఇశ్రాయేలీయుల ముందు వెళ్తున్న సత్యదేవుని దూత+ వాళ్ల వెనక్కి వెళ్లాడు, వాళ్ల ముందున్న మేఘస్తంభం కూడా వెనక్కి వెళ్లి వాళ్ల వెనక నిలిచింది.+ 20 అది ఆ ఐగుప్తీయులకు, ఇశ్రాయేలీయులకు మధ్య నిలిచింది. అది ఒకవైపేమో చీకటిని కలిగిస్తోంది, ఇంకోవైపేమో రాత్రిపూట వెలుగును ఇస్తోంది. దానివల్ల ఐగుప్తీయులు రాత్రంతా ఇశ్రాయేలీయుల దగ్గరికి రాలేదు.
-