-
నిర్గమకాండం 20:8-11పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
8 “విశ్రాంతి రోజును ఆచరించడం, దాన్ని పవిత్రంగా ఎంచడం మర్చిపోకు.+ 9 నువ్వు ఆరు రోజులు కష్టపడి నీ పనులన్నీ చేసుకోవాలి; 10 అయితే ఏడో రోజు నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి రోజు. ఆ రోజు నువ్వు గానీ, నీ కుమారుడు గానీ, నీ కూతురు గానీ, నీ దాసుడు గానీ, నీ దాసురాలు గానీ, నీ పశువు గానీ, నీ నగరాల్లో నివసించే పరదేశి గానీ ఏ పనీ చేయకూడదు.+ 11 ఎందుకంటే ఆరు రోజుల్లో యెహోవా ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న వాటన్నిటినీ చేసి, ఏడో రోజున విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాడు.+ అందుకే యెహోవా విశ్రాంతి రోజును దీవించి దాన్ని పవిత్రపర్చాడు.
-
-
ద్వితీయోపదేశకాండం 5:12-14పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
12 “ ‘నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్టే, నువ్వు విశ్రాంతి రోజును* ఆచరించాలి, దాన్ని పవిత్రంగా ఎంచాలి.+ 13 నువ్వు ఆరురోజుల పాటు కష్టపడి నీ పనులన్నీ చేసుకోవాలి, 14 అయితే ఏడో రోజు నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి రోజు.+ ఆ రోజు నువ్వు గానీ, నీ కుమారుడు గానీ, నీ కూతురు గానీ, నీ దాసుడు గానీ, నీ దాసురాలు గానీ, నీ ఎద్దు గానీ, నీ గాడిద గానీ, నీ పశువుల్లో ఏదైనా గానీ, నీ నగరాల్లో నివసించే పరదేశి గానీ ఏ పనీ చేయకూడదు.+ అలా నీ దాసుడు, నీ దాసురాలు కూడా నీలాగే విశ్రాంతి తీసుకోగలుగుతారు.+
-