9 మేము దాసులమే+ అయినా, మా దేవుడివైన నువ్వు మమ్మల్ని మా దాసత్వంలో విడిచిపెట్టేయలేదు; మేము తేరుకుని మా దేవుని మందిరాన్ని తిరిగి కట్టేలా,+ దాని శిథిలాల్ని బాగుచేసేలా, అలాగే యూదా, యెరూషలేములో మాకు రక్షణ గోడ ఉండేలా నువ్వు పారసీక రాజుల ముందు మామీద నీ విశ్వసనీయ ప్రేమ చూపించావు.+