-
నిర్గమకాండం 23:10, 11పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
10 “ఆరు సంవత్సరాల పాటు నువ్వు నీ భూమిలో విత్తనాలు విత్తి, దాని పంట కూర్చుకోవాలి.+ 11 కానీ ఏడో సంవత్సరం దాన్ని సాగుచేయకుండా బీడుగా వదిలేయాలి. అప్పుడు దానిలో ఏమైనా పండితే, నీ మధ్య ఉన్న పేదవాళ్లు దాన్ని తింటారు, వాళ్లు తినగా మిగిలింది అడవి జంతువులు తింటాయి. నీ ద్రాక్షతోట విషయంలో, నీ ఒలీవ తోట విషయంలో కూడా నువ్వు ఇలాగే చేయాలి.
-
-
లేవీయకాండం 25:4, 5పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
4 కానీ ఏడో సంవత్సరం, విశ్రాంతి గురించి యెహోవా ఇచ్చిన నియమాన్ని పాటిస్తూ మీరు మీ భూమికి పూర్తి విశ్రాంతిని ఇవ్వాలి. మీరు మీ పొలంలో విత్తనాలు విత్తకూడదు, మీ ద్రాక్షతోటలోని తీగల్ని కత్తిరించకూడదు. 5 కోత కోసిన తర్వాత మిగిలిన ధాన్యం వల్ల దానంతటదే పండిన పంటను మీరు కోయకూడదు, కత్తిరించకుండా వదిలేసిన మీ ద్రాక్షతోట నుండి ద్రాక్షల్ని సమకూర్చుకోకూడదు. ఒక సంవత్సరం పాటు భూమికి పూర్తి విశ్రాంతిని ఇవ్వాలి.
-