-
సంఖ్యాకాండం 28:11-13పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
11 “ ‘ప్రతీనెల ఆరంభంలో వీటిని యెహోవాకు దహనబలిగా అర్పించాలి: రెండు కోడెదూడలు, ఒక పొట్టేలు, ఏ లోపంలేని ఏడు ఏడాది మగ గొర్రెపిల్లలు.+ 12 అంతేకాదు, ధాన్యార్పణగా+ ఒక్కో కోడెదూడకు ఈఫాలో మూడు పదోవంతుల మెత్తని పిండిని నూనె కలిపి తీసుకురావాలి; పొట్టేలుకైతే+ ఈఫాలో రెండు పదోవంతుల మెత్తని పిండిని నూనె కలిపి తీసుకురావాలి; 13 అలాగే ఒక్కో మగ గొర్రెపిల్లకు ఈఫాలో పదోవంతు మెత్తని పిండిని నూనె కలిపి తీసుకురావాలి. వీటిని దహనబలిగా అర్పించాలి. ఇది యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణ, ఇంపైన* సువాసన.+
-