-
సంఖ్యాకాండం 11:31-34పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
31 అప్పుడు యెహోవా దగ్గర నుండి గాలి బయల్దేరి, సముద్రం నుండి పూరేడు పిట్టలు వచ్చి పాలెం చుట్టూ పడిపోయేలా చేసింది.+ అవి పాలేనికి అన్నివైపులా ఒకరోజు ప్రయాణమంత దూరం పాటు, దాదాపు రెండు మూరల* ఎత్తు వరకు నేలమీద పడ్డాయి. 32 కాబట్టి ప్రజలు ఆ రోజంతా, రాత్రంతా, అలాగే మరుసటి రోజంతా అక్కడే ఉండి వాటిని ఏరుకున్నారు. ఎవరూ పది హోమర్‌ల* కన్నా తక్కువ ఏరుకోలేదు. వాళ్లు తమ కోసం వాటిని పాలెం అంతటా పరుస్తూ ఉన్నారు.* 33 అయితే ఆ మాంసం ఇంకా వాళ్ల పంటి కింద ఉండగానే, వాళ్లు దాన్ని నమలక ముందే, యెహోవా కోపం వాళ్ల మీద రగులుకుంది; దాంతో యెహోవా పెద్ద ఎత్తున వాళ్లను వధించడం మొదలుపెట్టాడు.+
34 కాబట్టి వాళ్లు ఆ చోటుకు కిబ్రోతు-హత్తావా*+ అని పేరు పెట్టారు; ఎందుకంటే మాంసం కోసం కక్కుర్తిపడిన వాళ్లను+ ప్రజలు అక్కడ పాతిపెట్టారు.
-