-
నిర్గమకాండం 1:8-10పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
8 కొంతకాలానికి, యోసేపు గురించి తెలియని ఒక కొత్త రాజు ఐగుప్తును పరిపాలించడం మొదలుపెట్టాడు. 9 అతను తన ప్రజలతో ఇలా అన్నాడు: “ఇదిగో! ఇశ్రాయేలు ప్రజలు మనకన్నా ఎక్కువమంది అయ్యారు, మనకన్నా బలంగా తయారయ్యారు.+ 10 మనం వాళ్ల విషయంలో తెలివిగా* ప్రవర్తించాలి. లేకపోతే వాళ్ల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతుంది. ఒకవేళ యుద్ధం వస్తే, వాళ్లు మన శత్రువులతో చెయ్యి కలిపి మనతో పోరాడి, ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతారు.”
-
-
ఎస్తేరు 3:6పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
6 అయితే మొర్దెకై ఒక్కడినే చంపడం అతని దృష్టికి చాలా చిన్నదిగా కనిపించింది. ఎందుకంటే మొర్దెకై ప్రజల గురించి కూడా వాళ్లు అతనికి చెప్పారు. కాబట్టి అహష్వేరోషు సామ్రాజ్యమంతటా ఉన్న మొర్దెకై ప్రజలైన యూదులందర్నీ సమూలంగా నాశనం చేయడానికి హామాను ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
-