11 వాళ్లు ఒకరి తర్వాత ఒకరు యెహోవాను స్తుతిస్తూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ వంతులవారీగా ఇలా పాడడం+ మొదలుపెట్టారు: “ఎందుకంటే, ఆయన మంచివాడు; ఇశ్రాయేలు మీద ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.”+ తర్వాత ప్రజలందరూ యెహోవా మందిర పునాది వేయబడినందుకు బిగ్గరగా యెహోవాను స్తుతించారు.