-
సంఖ్యాకాండం 25:11-13పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
11 “ఎలియాజరు కుమారుడూ, యాజకుడైన అహరోను మనవడూ అయిన ఫీనెహాసు+ ఇశ్రాయేలీయుల మధ్య నా విషయంలో ఎలాంటి నమ్మకద్రోహ ప్రవర్తననూ సహించలేదు; అలా అతను ఇశ్రాయేలీయుల మీది నుండి నా ఉగ్రతను పక్కకు మళ్లించాడు.+ కాబట్టి, నేను సంపూర్ణ భక్తిని కోరుకునే దేవుణ్ణి అయినప్పటికీ వాళ్లను పూర్తిగా తుడిచిపెట్టలేదు.+ 12 అందుకే నువ్వు అతనితో ఇలా చెప్పాలి: ‘నేను అతనితో నా శాంతి ఒప్పందం చేస్తున్నాను. 13 ఈ ఒప్పందం ప్రకారం, యాజకత్వం ఎప్పటికీ అతనికి, అతని తర్వాత అతని సంతానానికి చెందుతుంది.+ ఎందుకంటే, అతను తన దేవుని విషయంలో ఎలాంటి నమ్మకద్రోహ ప్రవర్తననూ సహించలేదు;+ అలాగే ఇశ్రాయేలు ప్రజల కోసం అతను ప్రాయశ్చిత్తం చేశాడు.’ ”
-