-
యెహోషువ 4:5-7పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
5 వాళ్లకు ఇలా చెప్పాడు: “మీ దేవుడైన యెహోవా మందసాన్ని దాటి యొర్దాను మధ్యలోకి వెళ్లి, ఇశ్రాయేలీయుల గోత్రాల లెక్క ప్రకారం మీలో ప్రతీ ఒక్కరు తమ భుజాల మీద ఒక రాయిని మోసుకురావాలి. 6 ఆ రాళ్లు మీ మధ్య సూచనగా ఉండాలి. తర్వాత ఎప్పుడైనా మీ పిల్లలు,* ‘ఈ రాళ్లు ఇక్కడ ఎందుకు ఉన్నాయి?’ అని మిమ్మల్ని అడిగితే,+ 7 మీరు వాళ్లకు ఇలా చెప్పాలి: ‘ఎందుకంటే, యెహోవా ఒప్పంద మందసం ముందు యొర్దాను నది నీళ్లు ఆగిపోయాయి.+ ఆ మందసం యొర్దాను నదిని దాటినప్పుడు యొర్దాను నీళ్లు ఆగిపోయాయి. ఈ రాళ్లు ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పటికీ జ్ఞాపకార్థంగా* ఉంటాయి.’ ”+
-