-
హెబ్రీయులు 12:9-11పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
9 అంతేకాదు, మానవ తండ్రులు మనకు క్రమశిక్షణ ఇచ్చేవాళ్లు, మనం వాళ్లను గౌరవించేవాళ్లం. అలాంటిది, జీవం సంపాదించుకోవాలంటే, తన పవిత్రశక్తితో మనల్ని ఎంచుకున్న తండ్రికి మనం ఇంకెంత ఎక్కువగా లోబడాలి?+ 10 మానవ తండ్రులు తమకు మంచిదని అనిపించిన దాని ప్రకారం మనకు క్రమశిక్షణ ఇచ్చారు, అదీ కొంతకాలం వరకే. కానీ దేవుడు మన ప్రయోజనం కోసమే మనకు క్రమశిక్షణ ఇస్తున్నాడు, మనం తనలా పవిత్రులమవ్వాలని+ అలా చేస్తున్నాడు. 11 నిజమే, ప్రస్తుతం ఏ క్రమశిక్షణా సంతోషకరంగా అనిపించదు, బాధాకరంగానే ఉంటుంది; కానీ ఆ క్రమశిక్షణ వల్ల శిక్షణ పొందినవాళ్లకు అది నీతి అనే శాంతికరమైన ఫలాన్ని ఇస్తుంది.
-