25 ఆ సమయంలో యేసు ఇలా అన్నాడు: “తండ్రీ, ఆకాశానికీ భూమికీ ప్రభువా, అందరిముందు నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఎందుకంటే, నువ్వు తెలివిగలవాళ్లకు, మేధావులకు ఈ విషయాలు తెలియకుండా దాచిపెట్టి చిన్నపిల్లలకు వాటిని బయల్పర్చావు.+
46 మూడు రోజుల తర్వాత ఆయన వాళ్లకు ఆలయంలో కనిపించాడు. అక్కడ ఆయన బోధకుల మధ్య కూర్చొని వాళ్లు చెప్పేది వింటూ, వాళ్లను ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. 47 ఆయన మాటలు వింటున్న వాళ్లందరూ ఆయన అవగాహనను, ఆయన చెప్తున్న జవాబుల్ని చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉన్నారు.+