19 ఇక మీదట పగలు సూర్యుడు నీకు వెలుగుగా ఉండడు,
చంద్రుడి కాంతి నీకు వెలుగు ఇవ్వదు,
ఎందుకంటే, యెహోవాయే నీకు నిత్య వెలుగుగా ఉంటాడు,+
నీ దేవుడే నీకు సొగసుగా ఉంటాడు.+
20 ఇక మీదట నీ సూర్యుడు అస్తమించడు,
నీ చంద్రుడు క్షీణించిపోడు,
ఎందుకంటే, యెహోవాయే నీకు నిత్య వెలుగుగా ఉంటాడు,+
నువ్వు దుఃఖించే రోజులు ముగిసిపోతాయి.+