10 దేశాల్లారా, యెహోవా చెప్పే ఈ మాట వినండి,
సుదూర ద్వీపాల మధ్య దీన్ని చాటించండి:+
“ఇశ్రాయేలును చెదరగొట్టిన దేవుడే అతన్ని మళ్లీ పోగుచేస్తాడు.
కాపరి తన మందను సంరక్షించినట్టు, అతన్ని సంరక్షిస్తాడు.+
11 ఎందుకంటే, యెహోవా యాకోబును విడిపిస్తాడు,+
అతనికన్నా బలమైనవాడి చేతిలో నుండి అతన్ని కాపాడతాడు.+