23 ఆకాశమా, సంతోషంతో కేకలు వేయి,
ఎందుకంటే యెహోవా చర్య తీసుకున్నాడు!
భూమి అగాధ స్థలాల్లారా, విజయోత్సాహంతో కేకలు వేయండి!
పర్వతాల్లారా, సంతోషంతో కేకలు వేయండి!+
అడవీ! నువ్వూ, నీలోని వృక్షాలన్నీ సంతోషంతో కేకలు వేయాలి!
ఎందుకంటే, యెహోవా యాకోబును తిరిగి కొన్నాడు,
ఇశ్రాయేలు మీద తన వైభవాన్ని కనబరుస్తున్నాడు.”+