-
యిర్మీయా 4:31పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
31 ఎందుకంటే, నొప్పులతో ఉన్న స్త్రీ అరుపు లాంటి శబ్దం నాకు వినిపించింది,
అది తన మొదటి బిడ్డను కంటున్న స్త్రీ వేదన లాంటి శబ్దం,
కష్టంగా ఊపిరి తీసుకుంటున్న సీయోను కూతురి స్వరం.
ఆమె తన చేతులు చాపుతూ+ ఇలా అంది:
“అయ్యో, నాకు శ్రమ, హంతకుల వల్ల నా ప్రాణం అలసిపోయింది!”
-
-
యెహెజ్కేలు 7:16పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
16 ఏదోరకంగా తప్పించుకున్నవాళ్లు పర్వతాలకు వెళ్తారు, లోయల్లో నివసించే పావురాల్లా ప్రతీ వ్యక్తి తన దోషాన్ని బట్టి మూల్గుతాడు.+
-
-
మీకా 1:8, 9పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
నా ఏడ్పు నక్కల ఊలలా ఉంటుంది,
నా మూలుగు నిప్పుకోళ్ల మూలుగులా ఉంటుంది.
ఆ తెగులు నా ప్రజల నగర ద్వారమైన యెరూషలేము వరకు వ్యాపించింది.+
-