-
దానియేలు 4:31-33పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
31 ఆ మాటలు రాజు నోట ఉండగానే, పరలోకం నుండి ఒక స్వరం వచ్చి ఇలా చెప్పింది: “నెబుకద్నెజరు రాజా, నీకు చెప్పేదేమిటంటే, ‘రాజ్యం నీ దగ్గర నుండి తొలగిపోయింది,+ 32 నువ్వు మనుషులకు దూరంగా వెళ్లగొట్టబడతావు. నువ్వు మైదానంలోని జంతువులతో నివసిస్తూ, ఎద్దులా గడ్డి తింటావు; మనుషుల రాజ్యం మీద సర్వోన్నతుడు పరిపాలకుడనీ, ఆయన దాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్లకు ఇస్తాడనీ నువ్వు తెలుసుకునే వరకు ఏడు కాలాలు నీకు ఇలా జరుగుతుంది.’ ”+
33 ఆ మాట ఆ క్షణంలోనే నెబుకద్నెజరు విషయంలో నెరవేరింది. అతను మనుషుల మధ్య నుండి వెళ్లగొట్టబడ్డాడు, అతను ఎద్దులా గడ్డి తినడం మొదలుపెట్టాడు, అతని శరీరం ఆకాశ మంచుకు తడిసింది, అతని వెంట్రుకలు గద్ద ఈకల్లా పొడుగ్గా పెరిగాయి, అతని గోళ్లు పక్షి గోళ్లలా అయ్యాయి.+
-