4 “ఎందుకంటే, ఇదిగో! ఆ రోజు కొలిమిలా మండుతూ వస్తోంది.+ అప్పుడు గర్విష్ఠులందరు, చెడుగా నడుచుకునే వాళ్లందరు కొయ్యకాలులా అవుతారు. రాబోయే ఆ రోజు వాళ్లను తప్పకుండా మింగేస్తుంది” అని సైన్యాలకు అధిపతైన యెహోవా అంటున్నాడు. “అది వాళ్లకు వేరును గానీ, కొమ్మను గానీ మిగల్చదు.