9 నువ్వు ఆరు రోజులు కష్టపడి నీ పనులన్నీ చేసుకోవాలి; 10 అయితే ఏడో రోజు నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి రోజు. ఆ రోజు నువ్వు గానీ, నీ కుమారుడు గానీ, నీ కూతురు గానీ, నీ దాసుడు గానీ, నీ దాసురాలు గానీ, నీ పశువు గానీ, నీ నగరాల్లో నివసించే పరదేశి గానీ ఏ పనీ చేయకూడదు.+