37 కాబట్టి పిలాతు యేసును, “అయితే నువ్వు రాజువా?” అని అడిగాడు. దానికి యేసు, “నేను రాజునని నువ్వే స్వయంగా అంటున్నావు. సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికే నేను పుట్టాను, అందుకే ఈ లోకంలోకి వచ్చాను.+ సత్యానికి లోబడే ప్రతీ ఒక్కరు నేను చెప్పేది వింటారు” అన్నాడు.