కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • రోమీయులు 15:26, 27
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 26 ఎందుకంటే యెరూషలేములో ఉన్న పవిత్రుల్లోని పేదవాళ్లతో పంచుకోవడానికి మాసిదోనియ, అకయ ప్రాంతాల్లోని సహోదరులు తమకున్న వాటిని సంతోషంగా విరాళమిచ్చారు.+ 27 నిజమే, వాళ్లు సంతోషంగా విరాళమిచ్చారు. వాస్తవానికి ఆ సహోదరులు ఆ పవిత్రులకు రుణపడివున్నారు; ఎందుకంటే తాము దేవుని నుండి పొందిన మంచి విషయాలన్నిటినీ పవిత్రులు ఆ సహోదరులతో పంచుకున్నారు; కాబట్టి ఇప్పుడు తమకున్న వాటితో పవిత్రులకు సహాయం* చేయాల్సిన బాధ్యత ఆ సహోదరులకు ఉంది.+

  • గలతీయులు 6:6
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 6 అంతేకాదు, దేవుని వాక్యాన్ని నేర్చుకునేవాళ్లు,* తమకు దాన్ని నేర్పేవాళ్లతో* మంచి వాటన్నిటినీ పంచుకోవాలి.+

  • ఫిలిప్పీయులు 4:15-17
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 15 నిజానికి ఫిలిప్పీయులారా, మీరు మొదటిసారి మంచివార్త తెలుసుకున్న తర్వాత, నేను మాసిదోనియ నుండి బయల్దేరుతున్నప్పుడు, మీరు తప్ప ఒక్క సంఘం కూడా నాకు సహాయం చేయలేదు, నా సహాయం తీసుకోలేదు.+ ఈ విషయం మీకూ తెలుసు. 16 ఎందుకంటే, నేను థెస్సలొనీకలో ఉన్నప్పుడు మీరు నా అవసరాల్లో సహాయం చేశారు, ఒక్కసారి కాదు, రెండుసార్లు అలా సహాయం చేశారు. 17 మీ నుండి బహుమతిని ఆశించి నేనిలా చెప్పట్లేదు, బదులుగా దేవుని దగ్గర మీ సంపదను పెంచే మంచిపనుల్ని మీరు ఇంకా ఎక్కువగా చేయాలని కోరుకుంటున్నాను.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి