2 చిగురులా,+ ఎండిన దేశంలో వేరులా ఆయన అతని ముందు పైకివస్తాడు.
ఆయనకు చూడచక్కని రూపం గానీ, వైభవం గానీ లేవు;+
ఆయన్ని చూసినప్పుడు, ఆయన రూపం మనల్ని ఆకట్టుకోదు.
3 ప్రజలు ఆయన్ని చీదరించుకున్నారు, దూరం పెట్టారు,+
నొప్పులు, రోగాలు అంటే ఏంటో ఆయనకు బాగా తెలుసు.
ఆయన ముఖం మనకు దాచబడినట్టే ఉంది.
ప్రజలు ఆయన్ని నీచంగా చూశారు, మనం ఆయన్ని లెక్కచేయలేదు.+