6 సీనాయి పర్వతం దగ్గర ఆజ్ఞాపించినట్టు, ఈ దహనబలిని మీరు ఎప్పుడూ అర్పించాలి.+ ఇది యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణ, ఇంపైన సువాసన. 7 దానితోపాటు ఒక్కో మగ గొర్రెపిల్ల కోసం పానీయార్పణగా హిన్‌లో నాలుగో వంతు మత్తుపానీయాన్ని తీసుకురావాలి.+ యెహోవాకు పానీయార్పణగా దాన్ని పవిత్ర స్థలంలో పోయాలి.