2 నా సహోదరులారా, మీకు రకరకాల కష్టాలు ఎదురైనప్పుడు సంతోషించండి.+ 3 ఎందుకంటే, ఈ విధంగా పరీక్షించబడిన మీ విశ్వాసం మీలో సహనాన్ని పుట్టిస్తుందని మీకు తెలుసు.+ 4 అయితే సహనం తన పనిని పూర్తిచేయనివ్వండి. అప్పుడు మీరు అన్ని విషయాల్లో సంపూర్ణులుగా, నిర్దోషులుగా, దేనిలోనూ లోపంలేని వాళ్లుగా ఉండగలుగుతారు.+