20 అప్పుడు యోబు లేచి తన వస్త్రాన్ని చింపుకొని, తలవెంట్రుకలు గొరిగించుకున్నాడు; తర్వాత అతను నేలమీద పడి, వంగి నమస్కారం చేసి 21 ఇలా అన్నాడు:
“నేను నా తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చాను,
దిగంబరిగానే వెళ్లిపోతాను.+
యెహోవాయే ఇచ్చాడు,+ యెహోవాయే తీసేసుకున్నాడు.
యెహోవా పేరు స్తుతించబడుతూ ఉండాలి.”