కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 సమూయేలు 20
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 సమూయేలు విషయసూచిక

      • యోనాతాను దావీదు పట్ల విశ్వసనీయంగా ఉండడం (1-42)

1 సమూయేలు 20:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 24:11; కీర్త 18:20

1 సమూయేలు 20:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 19:6

1 సమూయేలు 20:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 18:1; 19:2
  • +1స 27:1

1 సమూయేలు 20:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 10:10; 2ది 2:4

1 సమూయేలు 20:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 16:4, 18
  • +1స 20:28, 29

1 సమూయేలు 20:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 17:17
  • +1స 18:3; 23:18
  • +1స 20:1

1 సమూయేలు 20:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 19:2

1 సమూయేలు 20:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 10:7; 11:6
  • +1స 16:13; 17:37

1 సమూయేలు 20:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 9:1, 3, 6, 7

1 సమూయేలు 20:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 21:7

1 సమూయేలు 20:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 18:1, 3; 2స 1:26; సామె 18:24

1 సమూయేలు 20:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 20:5

1 సమూయేలు 20:19

అధస్సూచీలు

  • *

    అక్ష., “పని రోజు.”

1 సమూయేలు 20:23

అధస్సూచీలు

  • *

    లేదా “నిబంధన.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 20:13, 14
  • +1స 20:42

1 సమూయేలు 20:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 20:5

1 సమూయేలు 20:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 14:50

1 సమూయేలు 20:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 11:23, 24; 15:4, 5, 16, 18; సం 19:16

1 సమూయేలు 20:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 17:12

1 సమూయేలు 20:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 20:6

1 సమూయేలు 20:30

అధస్సూచీలు

  • *

    లేదా “తిరుగుబాటుచేసేదాని కుమారుడా.”

  • *

    అక్ష., “నీ తల్లి మానానికీ.”

1 సమూయేలు 20:31

అధస్సూచీలు

  • *

    అక్ష., “అతను మరణ పుత్రుడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 18:8
  • +1స 19:6, 10

1 సమూయేలు 20:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 19:5; సామె 17:17; 18:24

1 సమూయేలు 20:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 18:11; 19:10
  • +1స 20:6, 7

1 సమూయేలు 20:34

అధస్సూచీలు

  • *

    లేదా “అమావాస్య తర్వాతి రోజు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 18:1

1 సమూయేలు 20:35

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 20:19-22

1 సమూయేలు 20:42

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 23:18; 2స 9:7
  • +1స 20:17, 23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    వాళ్లలా విశ్వాసం చూపించండి, ఆర్టికల్‌ 3

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 సమూ. 20:11స 24:11; కీర్త 18:20
1 సమూ. 20:21స 19:6
1 సమూ. 20:31స 18:1; 19:2
1 సమూ. 20:31స 27:1
1 సమూ. 20:5సం 10:10; 2ది 2:4
1 సమూ. 20:61స 16:4, 18
1 సమూ. 20:61స 20:28, 29
1 సమూ. 20:8సామె 17:17
1 సమూ. 20:81స 18:3; 23:18
1 సమూ. 20:81స 20:1
1 సమూ. 20:91స 19:2
1 సమూ. 20:131స 10:7; 11:6
1 సమూ. 20:131స 16:13; 17:37
1 సమూ. 20:142స 9:1, 3, 6, 7
1 సమూ. 20:152స 21:7
1 సమూ. 20:171స 18:1, 3; 2స 1:26; సామె 18:24
1 సమూ. 20:181స 20:5
1 సమూ. 20:231స 20:13, 14
1 సమూ. 20:231స 20:42
1 సమూ. 20:241స 20:5
1 సమూ. 20:251స 14:50
1 సమూ. 20:26లేవీ 11:23, 24; 15:4, 5, 16, 18; సం 19:16
1 సమూ. 20:271స 17:12
1 సమూ. 20:281స 20:6
1 సమూ. 20:311స 18:8
1 సమూ. 20:311స 19:6, 10
1 సమూ. 20:321స 19:5; సామె 17:17; 18:24
1 సమూ. 20:331స 18:11; 19:10
1 సమూ. 20:331స 20:6, 7
1 సమూ. 20:341స 18:1
1 సమూ. 20:351స 20:19-22
1 సమూ. 20:421స 23:18; 2స 9:7
1 సమూ. 20:421స 20:17, 23
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
  • 41
  • 42
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 సమూయేలు 20:1-42

సమూయేలు మొదటి గ్రంథం

20 తర్వాత దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయాడు. అయితే, అతను యోనాతాను దగ్గరికి వచ్చి, “నేనేమి చేశాను?+ నా తప్పేంటి? నీ తండ్రి నన్ను చంపాలని చూడడానికి నేను అతని విషయంలో ఏం పాపం చేశాను?” అని అడిగాడు. 2 దానికి యోనాతాను, “అలా జరగనే జరగదు!+ నువ్వు చనిపోవు. ఇదిగో! నా తండ్రి నాకు చెప్పకుండా చిన్నపని గానీ, పెద్దపని గానీ చేయడు. అలాంటిది ఈ విషయం నా దగ్గర ఎందుకు దాస్తాడు? అలా జరగదు” అన్నాడు. 3 కానీ దావీదు ఇలా అన్నాడు: “నేను నీ దయ పొందానని+ నీ తండ్రికి ఖచ్చితంగా తెలుసు కాబట్టి, ‘యోనాతానుకు ఈ విషయం తెలియనివ్వకూడదు, తెలిస్తే బాధపడతాడు’ అని అనుకొని ఉంటాడు. అయితే యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నాకూ మరణానికీ మధ్య ఒక్క అడుగు దూరం మాత్రమే ఉంది!”+

4 అప్పుడు యోనాతాను దావీదుతో, “నువ్వు ఏమి చెప్పినా, అది నీ కోసం చేస్తాను” అన్నాడు. 5 దానికి దావీదు యోనాతానుతో ఇలా అన్నాడు: “రేపు అమావాస్య;+ నేను ఖచ్చితంగా రాజుతో భోజనానికి కూర్చోవాలి; నువ్వు నన్ను పంపించేయి. నేను ఎల్లుండి సాయంత్రం వరకు పొలంలో దాక్కుంటాను. 6 నేను లేనని ఒకవేళ నీ తండ్రి గమనిస్తే, అప్పుడు నువ్వు, ‘దావీదు తన నగరంలో, అంటే బేత్లెహేములో+ తన కుటుంబమంతా అర్పించాల్సిన వార్షిక బలి ఉందని, అందుకే త్వరగా అక్కడికి వెళ్లడానికి అనుమతి ఇవ్వమని నన్ను బ్రతిమాలాడు’+ అని చెప్పు. 7 ఒకవేళ అతను, ‘మంచిది’ అని అంటే, నీ సేవకుడు క్షేమమని అర్థం. కానీ అతను కోప్పడితే, అతను నాకు హాని చేయాలని నిశ్చయించుకున్నాడని అర్థం చేసుకో. 8 నీ సేవకుడినైన నా మీద విశ్వసనీయ ప్రేమ చూపించు;+ ఎందుకంటే యెహోవా ఎదుట నువ్వే నీ సేవకునితో ఒప్పందం చేశావు.+ ఒకవేళ నేను తప్పు చేసివుంటే+ నువ్వే నన్ను చంపు. నన్ను నీ తండ్రికి అప్పగించడం దేనికి?”

9 అందుకు యోనాతాను, “నీ విషయంలో అలా చేయడం నా ఊహకందని విషయం! నీకు హాని చేయాలని నా తండ్రి నిశ్చయించుకున్నాడని నాకు తెలిస్తే, నీకు చెప్పకుండా ఉంటానా?”+ అని అన్నాడు. 10 అప్పుడు దావీదు యోనాతానును, “ఒకవేళ నీ తండ్రి నీతో కఠినంగా మాట్లాడితే ఆ విషయం నాకు ఎవరు చెప్తారు?” అని అడిగాడు. 11 అప్పుడు యోనాతాను దావీదుతో, “పద, మనం పొలంలోకి వెళ్దాం” అన్నాడు. వాళ్లిద్దరూ పొలంలోకి వెళ్లారు. 12 యోనాతాను దావీదుతో ఇలా అన్నాడు: “రేపు లేదా ఎల్లుండి ఈ సమయం లోపు నా తండ్రిని అడుగుతాను. దీనికి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాయే సాక్షి. ఒకవేళ అతను నీ విషయంలో సానుకూలంగా మాట్లాడితే నేను నీకు కబురు పంపి ఆ విషయం తెలియజేస్తాను. 13 కానీ, ఒకవేళ నా తండ్రి నీకు హాని చేయాలని అనుకుంటే, నేను ఆ విషయం నీకు చెప్తాను, నిన్ను క్షేమంగా పంపించేస్తాను. నేను అలా చేయకపోతే, యెహోవా ఆ హాని నా మీదికి రప్పించాలి, ఇంకా ఎక్కువ హాని రప్పించాలి. యెహోవా ఒకప్పుడు నా తండ్రికి తోడుగా ఉన్నట్టే,+ నీకూ తోడుగా ఉండాలి.+ 14 నేను బ్రతికున్నప్పుడు, చివరికి చనిపోయాక కూడా నువ్వు నా మీద యెహోవా చూపించేలాంటి విశ్వసనీయ ప్రేమను చూపించాలి.+ 15 ఒకవేళ యెహోవా దావీదు శత్రువులందర్నీ భూమ్మీద నుండి తుడిచేసినా నువ్వు మాత్రం నా ఇంటివాళ్ల మీద ఎప్పటికీ విశ్వసనీయ ప్రేమను చూపిస్తూ ఉండు.”+ 16 అలా యోనాతాను దావీదు వంశంతో ఒప్పందం చేసుకున్నాడు; అతను ఇంకా ఇలా అన్నాడు: “యెహోవా దావీదు శత్రువుల్ని లెక్క అడుగుతాడు.” 17 అప్పుడు యోనాతాను, తనమీద దావీదుకు ఉన్న ప్రేమనుబట్టి మళ్లీ అతనితో ప్రమాణం చేయించాడు. ఎందుకంటే యోనాతాను దావీదును ప్రాణంగా ప్రేమించాడు.+

18 తర్వాత యోనాతాను దావీదుతో ఇలా అన్నాడు: “రేపు అమావాస్య,+ నువ్వు కూర్చునే చోటు ఖాళీగా ఉంటుంది కాబట్టి నా తండ్రి నీ కోసం చూస్తాడు. 19 మూడో రోజు వచ్చేసరికి అతను నీ గురించి ఖచ్చితంగా అడుగుతాడు; నువ్వు ఆ రోజు* దాక్కున్న ఈ స్థలానికి వచ్చి, ఈ రాయి దగ్గర ఉండాలి. 20 తర్వాత నేను ఒక గురివైపు బాణాలు వేస్తున్నట్టుగా ఆ రాయికి ఒకవైపు మూడు బాణాల్ని వేస్తాను. 21 నేను సేవకుణ్ణి పంపిస్తూ, ‘వెళ్లి, బాణాల్ని వెదుకు’ అంటాను. నేను ఒకవేళ సేవకునితో, ‘ఇదిగో! బాణాలు నీకు ఇటువైపు పడ్డాయి, వెళ్లి తీసుకురా’ అని అంటే, నువ్వు వెనక్కి రావచ్చు. యెహోవా జీవం తోడు, నువ్వు పూర్తిగా క్షేమమని, నీకు ప్రమాదమేమీ లేదని దానర్థం. 22 కానీ, నేను ఆ కుర్రవాడితో, ‘అదిగో! బాణాలు నీ అవతల పడ్డాయి’ అని అంటే, నువ్వు వెళ్లిపో, ఎందుకంటే నువ్వు వెళ్లిపోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. 23 మనం చేసుకున్న ఒప్పందం*+ విషయానికొస్తే, యెహోవాయే ఎల్లప్పుడూ నీకూ నాకూ మధ్య సాక్షిగా ఉండాలి.”+

24 కాబట్టి దావీదు పొలంలో దాక్కున్నాడు. అమావాస్య వచ్చినప్పుడు, రాజు భోజనం చేయడానికి తన స్థానంలో కూర్చున్నాడు.+ 25 రాజు ఎప్పటిలాగే గోడ వైపు ఉన్న తన స్థానంలో కూర్చున్నాడు. అతనికి ఎదురుగా యోనాతాను కూర్చున్నాడు. అబ్నేరు+ సౌలు పక్కన కూర్చున్నాడు, కానీ దావీదు స్థానం ఖాళీగా ఉంది. 26 సౌలు ఆ రోజు ఏమీ మాట్లాడలేదు; ‘ఏదో కారణం వల్ల అతను పవిత్రంగా లేడు.+ అవును, అతను అపవిత్రుడై ఉంటాడు’ అని సౌలు అనుకున్నాడు. 27 అమావాస్య తర్వాతి రోజు, అంటే రెండో రోజు కూడా దావీదు స్థానం ఖాళీగానే ఉంది. అప్పుడు సౌలు, “నిన్నా, ఈ రోజూ యెష్షయి కుమారుడు+ భోజనానికి రాలేదేంటి?” అని తన కుమారుడు యోనాతానును అడిగాడు. 28 దానికి యోనాతాను సౌలుతో ఇలా చెప్పాడు: “బేత్లెహేముకు వెళ్లడానికి అనుమతి ఇవ్వమని దావీదు నన్ను బ్రతిమాలాడు.+ 29 అతను, ‘దయచేసి వెళ్లడానికి నాకు అనుమతిని ఇవ్వు, ఎందుకంటే ఆ నగరంలో మా కుటుంబం బలి అర్పించాల్సి ఉంది, నా సొంత సహోదరుడు నన్ను రమ్మన్నాడు. నీ దయ నామీద ఉంటే, దయచేసి నా సహోదరుల్ని చూడడానికి నన్ను వెళ్లనివ్వు’ అన్నాడు. అందుకే అతను రాజు బల్ల దగ్గరికి రాలేదు.” 30 అప్పుడు సౌలుకు యోనాతాను మీద విపరీతంగా కోపం వచ్చి, అతనితో ఇలా అన్నాడు: “తిరుగుబాటుదారుడా,* నీకూ నీ తల్లికీ* అవమానం కలిగేలా నువ్వు యెష్షయి కుమారుని వైపు ఉండాలనుకుంటున్నావనే విషయం నాకు తెలీదని అనుకుంటున్నావా? 31 యెష్షయి కుమారుడు భూమ్మీద బ్రతికున్నంత కాలం నువ్వూ, నీ రాజరికం నిలవదు.+ కాబట్టి ఇప్పుడు ఎవరినైనా పంపించి, అతన్ని నా దగ్గరికి తీసుకురా, అతను చావాలి.”*+

32 అయితే, యోనాతాను తన తండ్రి సౌలుతో, “అతన్ని ఎందుకు చంపాలి?+ అతను ఏమి చేశాడు?” అన్నాడు. 33 అప్పుడు సౌలు యోనాతానును చంపాలని అతని మీదికి ఈటె విసిరాడు.+ దాంతో తన తండ్రి దావీదును చంపాలని నిశ్చయించుకున్నట్టు యోనాతానుకు అర్థమైంది.+ 34 యోనాతాను వెంటనే బల్ల దగ్గర నుండి చాలా కోపంగా లేచాడు. దావీదు విషయంలో అతను బాధపడ్డాడు, పైగా తన తండ్రి దావీదును అవమానించాడు కాబట్టి అతను ఆ రోజు* ఏమీ తినలేదు.+

35 ఉదయం యోనాతాను దావీదును కలవడానికి పొలానికి వెళ్లాడు. యోనాతానుతోపాటు ఒక యువ సేవకుడు ఉన్నాడు.+ 36 అతను తన సేవకునితో, “దయచేసి పరుగెత్తుకొని వెళ్లి, నేను వేసే బాణాల్ని వెదుకు” అన్నాడు. దాంతో ఆ సేవకుడు పరుగెత్తుకొని వెళ్లాడు. యోనాతాను సేవకుని అవతల బాణం వేశాడు. 37 యోనాతాను బాణం వేసిన చోటుకు ఆ సేవకుడు చేరుకున్నప్పుడు యోనాతాను ఆ సేవకునితో, “⁠బాణం నీ అవతల పడింది కదా?” అని గట్టిగా అన్నాడు. 38 యోనాతాను గట్టిగా తన సేవకునితో, “త్వరగా! త్వరగా వెళ్లు! ఆలస్యం చేయొద్దు!” అన్నాడు. యోనాతాను సేవకుడు ఆ బాణాల్ని తీసుకొని తన యజమాని దగ్గరికి వచ్చాడు. 39 నిజానికి ఏమి జరుగుతుందో ఆ సేవకునికి అర్థంకాలేదు; యోనాతాను, దావీదులకు మాత్రమే దాని గురించి తెలుసు. 40 తర్వాత యోనాతాను తన సేవకునికి ఆయుధాలు ఇస్తూ, “వీటిని నగరానికి తీసుకెళ్లు” అన్నాడు.

41 ఆ సేవకుడు వెళ్లిపోయిన తర్వాత, దావీదు దగ్గర్లో దక్షిణాన ఉన్న ఒక చోటు నుండి లేచి నిలబడ్డాడు. తర్వాత అతను మోకాళ్లూని మూడుసార్లు సాష్టాంగపడ్డాడు. వాళ్లు ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు, ఒకరి గురించి ఒకరు ఏడ్చారు. కానీ దావీదు ఎక్కువగా ఏడ్చాడు. 42 యోనాతాను దావీదుతో ఇలా అన్నాడు: “ ‘యెహోవా నీకూ నాకూ మధ్య, నీ వంశస్థులకూ నా వంశస్థులకూ మధ్య ఎప్పటికీ సాక్షిగా ఉండాలి’+ అంటూ మనిద్దరం యెహోవా పేరున ప్రమాణం చేశాం+ కాబట్టి ప్రశాంతంగా వెళ్లు.”

తర్వాత దావీదు లేచి అక్కడి నుండి వెళ్లిపోయాడు, యోనాతాను నగరానికి తిరిగెళ్లాడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి