కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 సమూయేలు 18
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

2 సమూయేలు విషయసూచిక

      • అబ్షాలోము ఓటమి, మరణం (1-18)

      • అబ్షాలోము మరణం గురించి దావీదుకు చెప్పడం (19-33)

2 సమూయేలు 18:1

అధస్సూచీలు

  • *

    అంటే, 1,000 మంది మీద అధిపతులు.

  • *

    అంటే, 100 మంది మీద అధిపతులు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 20:18

2 సమూయేలు 18:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 8:16; 10:7
  • +1ది 2:15, 16
  • +2స 23:18, 19
  • +2స 15:19, 21

2 సమూయేలు 18:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 21:17
  • +2స 17:1-3; విలా 4:20

2 సమూయేలు 18:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 18:12

2 సమూయేలు 18:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 17:26

2 సమూయేలు 18:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 16:15
  • +కీర్త 3:7; సామె 24:21, 22

2 సమూయేలు 18:9

అధస్సూచీలు

  • *

    అక్ష., “ఆకాశానికి, భూమికి మధ్యలో.”

2 సమూయేలు 18:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 8:16; 18:2

2 సమూయేలు 18:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 18:5

2 సమూయేలు 18:14

అధస్సూచీలు

  • *

    లేదా “చిన్న బాణాల్ని; ఈటెల్ని” అయ్యుంటుంది.

2 సమూయేలు 18:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 12:10; సామె 2:22; 20:20; 30:17

2 సమూయేలు 18:16

అధస్సూచీలు

  • *

    అక్ష., “కొమ్ము.”

2 సమూయేలు 18:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 7:24, 26; 8:29; 10:23, 27

2 సమూయేలు 18:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 14:27
  • +ఆది 14:17

2 సమూయేలు 18:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 15:35, 36; 17:17
  • +కీర్త 9:4

2 సమూయేలు 18:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 18:5

2 సమూయేలు 18:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 10:6

2 సమూయేలు 18:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 18:4
  • +2రా 9:17

2 సమూయేలు 18:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 18:19

2 సమూయేలు 18:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 22:47; కీర్త 144:1

2 సమూయేలు 18:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 18:22

2 సమూయేలు 18:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 18:21
  • +2స 22:49; కీర్త 55:18; 94:1; 124:2, 3

2 సమూయేలు 18:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 27:2

2 సమూయేలు 18:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 12:10; 17:14; 19:1; సామె 19:13

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

2 సమూ. 18:1సామె 20:18
2 సమూ. 18:22స 8:16; 10:7
2 సమూ. 18:21ది 2:15, 16
2 సమూ. 18:22స 23:18, 19
2 సమూ. 18:22స 15:19, 21
2 సమూ. 18:32స 21:17
2 సమూ. 18:32స 17:1-3; విలా 4:20
2 సమూ. 18:52స 18:12
2 సమూ. 18:62స 17:26
2 సమూ. 18:72స 16:15
2 సమూ. 18:7కీర్త 3:7; సామె 24:21, 22
2 సమూ. 18:102స 8:16; 18:2
2 సమూ. 18:122స 18:5
2 సమూ. 18:152స 12:10; సామె 2:22; 20:20; 30:17
2 సమూ. 18:17యెహో 7:24, 26; 8:29; 10:23, 27
2 సమూ. 18:182స 14:27
2 సమూ. 18:18ఆది 14:17
2 సమూ. 18:192స 15:35, 36; 17:17
2 సమూ. 18:19కీర్త 9:4
2 సమూ. 18:202స 18:5
2 సమూ. 18:21ఆది 10:6
2 సమూ. 18:242స 18:4
2 సమూ. 18:242రా 9:17
2 సమూ. 18:272స 18:19
2 సమూ. 18:282స 22:47; కీర్త 144:1
2 సమూ. 18:292స 18:22
2 సమూ. 18:312స 18:21
2 సమూ. 18:312స 22:49; కీర్త 55:18; 94:1; 124:2, 3
2 సమూ. 18:32కీర్త 27:2
2 సమూ. 18:332స 12:10; 17:14; 19:1; సామె 19:13
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
2 సమూయేలు 18:1-33

సమూయేలు రెండో గ్రంథం

18 అప్పుడు దావీదు తనతో ఉన్న మనుషుల్ని లెక్కపెట్టి సహస్రాధిపతుల్ని,* శతాధిపతుల్ని* నియమించాడు.+ 2 దావీదు వాళ్లను మూడు గుంపులు చేసి పంపించాడు; ఒక గుంపు మీద యోవాబును,+ మరో గుంపు మీద యోవాబు సహోదరుడూ సెరూయా కుమారుడూ+ అయిన అబీషైను,+ ఇంకో గుంపు మీద గిత్తీయుడైన ఇత్తయిని+ నియమించాడు. అప్పుడు రాజు వాళ్లతో, “నేను కూడా మీతో వస్తాను” అన్నాడు. 3 కానీ వాళ్లు, “నువ్వు మాతో రాకూడదు,+ మేము ఒకవేళ పారిపోయినా, మాలో సగంమంది చనిపోయినా వాళ్లు దాన్ని పట్టించుకోరు. నువ్వు మాలో 10,000 మందితో సమానం.+ అందుకని, నువ్వు నగరం నుండే మాకు సహాయాన్ని పంపిస్తే బాగుంటుంది” అన్నారు. 4 అప్పుడు రాజు వాళ్లతో, “మీకు ఏది మంచిదనిపిస్తే అదే చేస్తాను” అన్నాడు. కాబట్టి రాజు నగర ద్వారం పక్కన నిలబడ్డాడు. వాళ్లందరూ వందలమంది చొప్పున, వేలమంది చొప్పున బయటికి వెళ్లారు. 5 తర్వాత రాజు యోవాబుకు, అబీషైకి, ఇత్తయికి ఈ ఆజ్ఞ ఇచ్చాడు: “నా కోసం యువకుడైన అబ్షాలోముతో సున్నితంగా వ్యవహరించండి.”+ రాజు అబ్షాలోము గురించి అధిపతులందరికీ ఆ ఆజ్ఞ ఇచ్చినప్పుడు ప్రజలందరూ విన్నారు.

6 వాళ్లు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయడానికి మైదానంలోకి వెళ్లారు. ఎఫ్రాయిము అడవిలో యుద్ధం జరిగింది.+ 7 అక్కడ ఇశ్రాయేలు ప్రజలు+ దావీదు సేవకుల చేతుల్లో ఓడిపోయారు,+ ఆ రోజు పెద్ద ఎత్తున వధ జరిగింది. 20,000 మంది చనిపోయారు. 8 యుద్ధం ఆ ప్రాంతమంతా వ్యాపించింది. అంతేకాదు, ఆ రోజు కత్తి వల్ల చనిపోయిన వాళ్లకన్నా అడవిలో అపాయాల వల్ల చనిపోయినవాళ్లే ఎక్కువ.

9 చివరికి, అబ్షాలోము దావీదు సేవకులకు ఎదురయ్యాడు. అప్పుడు అతను కంచర గాడిద మీద వెళ్తున్నాడు, అది ఒక పెద్ద చెట్టుకున్న దట్టమైన కొమ్మల కిందికి వెళ్లినప్పుడు అతని జుట్టు ఆ పెద్ద చెట్టులో చిక్కుకుపోయింది. అతని గాడిద ముందుకు వెళ్లిపోయింది, దాంతో అతను గాలిలో* వేలాడుతూ ఉన్నాడు. 10 ఒకతను అది చూసి యోవాబుతో,+ “ఇదిగో! అబ్షాలోము ఒక పెద్ద చెట్టుకు వేలాడుతుండడం నేను చూశాను” అని చెప్పాడు. 11 యోవాబు ఆ వ్యక్తితో, “నువ్వు అది చూసివుంటే అక్కడికక్కడే అతన్ని ఎందుకు చంపలేదు? అప్పుడు నేను సంతోషంగా నీకు పది వెండి రూకలు, ఒక తోలు దట్టీ ఇచ్చేవాణ్ణి కదా” అన్నాడు. 12 కానీ అతను యోవాబుతో ఇలా అన్నాడు: “నాకు 1,000 వెండి రూకలు ఇచ్చినా, రాజు కుమారుని మీద నా చెయ్యి ఎత్తలేను. ఎందుకంటే, ‘మీరు ఎవరైనా సరే, యువకుడైన అబ్షాలోము విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి’+ అని రాజు నీకు, అబీషైకి, ఇత్తయికి ఆజ్ఞ ఇవ్వడం మేము విన్నాం. 13 నేను ఆ మాటకు లోబడకుండా అతని ప్రాణం తీసివుంటే, ఆ విషయం రాజుకు తెలియకుండా పోదు, అప్పుడు నువ్వు కూడా నన్ను కాపాడేవాడివి కాదు.” 14 అప్పుడు యోవాబు, “నీతో నేను ఇక సమయం వృథా చేయను!” అని చెప్పి మొనదేలిన మూడు కడ్డీల్ని* చేతితో పట్టుకుని, చెట్టుకు వేలాడుతూ ఇంకా బ్రతికే ఉన్న అబ్షాలోము గుండెలోకి దించాడు. 15 తర్వాత యోవాబు ఆయుధాలు మోసిన పదిమంది సేవకులు వచ్చి అబ్షాలోము చనిపోయేంత వరకు అతన్ని కొట్టారు.+ 16 అప్పుడు యోవాబు బూర* ఊదాడు. దాంతో దావీదు మనుషులు ఇశ్రాయేలు ప్రజల్ని తరమడం ఆపేసి వెనక్కి వచ్చారు; అలా యోవాబు ప్రజల్ని ఆపాడు. 17 వాళ్లు అబ్షాలోమును తీసుకెళ్లి అడవిలో ఉన్న ఒక పెద్ద గుంటలో పడేసి, అతని మీద పెద్ద రాళ్లకుప్ప పోశారు.+ ఇశ్రాయేలీయులందరూ తమ ఇళ్లకు పారిపోయారు.

18 అబ్షాలోము బ్రతికున్నప్పుడు, “నా పేరు నిలపడానికి నాకు కుమారులు లేరు”+ అని అనుకొని అతను ఒక స్తంభాన్ని తీసుకెళ్లి రాజు లోయలో+ నిలబెట్టించాడు. అతను ఆ స్తంభానికి తన పేరు పెట్టాడు. ఈ రోజు వరకు అది ‘అబ్షాలోము స్మారక చిహ్నం’ అని పిలవబడుతోంది.

19 సాదోకు కుమారుడైన అహిమయస్సు+ ఇలా అన్నాడు: “దయచేసి నన్ను పరుగెత్తుకొని వెళ్లి రాజుకు ఈ వార్త చెప్పనివ్వు. ఎందుకంటే యెహోవా అతన్ని తన శత్రువుల నుండి విడిపించి అతనికి న్యాయం చేశాడు.”+ 20 కానీ యోవాబు అతనితో, “ఈ రోజు వార్త చెప్పడానికి నువ్వు వెళ్లడం లేదు. నువ్వు ఇంకో రోజు వార్త చెప్పవచ్చు. స్వయంగా రాజు కుమారుడే చనిపోయాడు+ కాబట్టి ఈ రోజు వార్తను నువ్వు చెప్పడం లేదు” అన్నాడు. 21 తర్వాత యోవాబు ఒక కూషీయుడితో,+ “నువ్వు వెళ్లి, చూసింది రాజుకు చెప్పు” అన్నాడు. దాంతో ఆ కూషీయుడు యోవాబుకు సాష్టాంగపడి అక్కడి నుండి పరుగెత్తుకొని వెళ్లాడు. 22 సాదోకు కుమారుడైన అహిమయస్సు మళ్లీ యోవాబుతో, “ఏమైనా సరే, దయచేసి నన్ను కూడా కూషీయుని వెనక పరుగెత్తుకొని వెళ్లనివ్వు” అన్నాడు. అయితే యోవాబు, “నా కుమారుడా, నువ్వు చెప్పడానికి ఏ వార్తా లేనప్పుడు నువ్వు ఎందుకు పరుగెత్తుకొని వెళ్లాలి?” అన్నాడు. 23 అయినా అతను, “ఏమైనా సరే, నన్ను పరుగెత్తుకొని వెళ్లనివ్వు” అన్నాడు. దాంతో యోవాబు, “సరే, పరుగెత్తు!” అన్నాడు. అప్పుడు అహిమయస్సు యొర్దాను ప్రాంతం దారిలో పరుగెత్తుకుంటూ వెళ్లి చివరికి కూషీయుణ్ణి దాటేశాడు.

24 అప్పుడు దావీదు, నగరం రెండు ద్వారాల+ మధ్య కూర్చొని ఉన్నాడు, కావలివాడు+ గోడమీదుగా ద్వారం పైభాగం మీదికి వెళ్లాడు. అతను తలెత్తి చూసినప్పుడు, ఒక వ్యక్తి ఒంటరిగా పరుగెత్తుకుంటూ వస్తున్నాడు. 25 దాంతో ఆ కావలివాడు కేకవేసి రాజుకు ఆ విషయం చెప్పాడు. అప్పుడు రాజు, “అతను ఒంటరిగా వస్తుంటే గనుక, అతని దగ్గర ఏదో వార్త ఉంది” అన్నాడు. అతను అంతకంతకూ దగ్గరికి వస్తున్నప్పుడు, 26 కావలివానికి ఇంకో వ్యక్తి పరుగెత్తుకుంటూ రావడం కనిపించింది. అప్పుడు ఆ కావలివాడు కేకవేసి ద్వారపాలకునికి ఇలా చెప్పాడు: “ఇదిగో! మరో వ్యక్తి ఒంటరిగా పరుగెత్తుకుంటూ వస్తున్నాడు!” దానికి రాజు ఇలా అన్నాడు: “ఇతను కూడా ఏదో వార్త తెస్తున్నాడు.” 27 కావలివాడు, “మొదట వ్యక్తి పరుగెత్తడం చూస్తుంటే అతను సాదోకు కుమారుడైన అహిమయస్సు+ అనిపిస్తుంది” అని చెప్పాడు. దానికి రాజు, “అతను మంచివాడు. అతను మంచివార్తతో వస్తాడు” అన్నాడు. 28 అప్పుడు అహిమయస్సు, “అంతా క్షేమమే!” అని బిగ్గరగా రాజుతో అని అతనికి సాష్టాంగపడ్డాడు. తర్వాత అతను ఇలా చెప్పాడు: “నీ దేవుడైన యెహోవా స్తుతించబడాలి, ఆయన నా ప్రభువైన రాజు మీద తిరుగుబాటు చేసినవాళ్లను నీకు అప్పగించాడు!”+

29 అయితే రాజు, “యువకుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?” అని అడిగాడు. దానికి అహిమయస్సు, “యోవాబు నీ సేవకుడినైన నన్నూ, రాజు సేవకుణ్ణీ పంపించినప్పుడు అంతా కోలాహలంగా ఉండడం గమనించాను, కానీ అదేమిటో నాకు తెలియలేదు”+ అని చెప్పాడు. 30 దానికి రాజు, “వచ్చి పక్కన నిలబడు” అన్నాడు. అతను వెళ్లి పక్కన నిలబడ్డాడు.

31 తర్వాత కూషీయుడు వచ్చి,+ “నా ప్రభువా, రాజా, నీకో వార్త తెచ్చాను. నీ మీద తిరుగుబాటు చేసిన వాళ్లందరి చేతిలో నుండి యెహోవా నిన్ను విడిపించి ఈ రోజు నీకు న్యాయం చేశాడు”+ అని చెప్పాడు. 32 అయితే రాజు, “యువకుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?” అని ఆ కూషీయుణ్ణి అడిగాడు. దానికి అతను, “నా ప్రభువైన రాజు శత్రువులందరూ, నీకు హాని తలపెట్టాలని నీ మీద తిరుగుబాటు చేసినవాళ్లందరూ ఆ యువకుడిలా అవ్వాలి!”+ అన్నాడు.

33 అది విన్నప్పుడు రాజు కలవరపడి, ద్వారం పైనున్న గదిలోకి వెళ్లి ఏడ్చాడు. అతను, “నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా, నా కుమారుడా అబ్షాలోమా! నీకు బదులు నేను చనిపోయుంటే బాగుండేది, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా!” అని ఏడుస్తూ వెళ్లాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి