కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెహెజ్కేలు 38
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యెహెజ్కేలు విషయసూచిక

      • ఇశ్రాయేలు మీద గోగు దాడి (1-16)

      • గోగు మీద యెహోవా కోపం (17-23)

        • ‘నేను యెహోవానని జనాలు తెలుసుకుంటాయి’ (23)

యెహెజ్కేలు 38:2

అధస్సూచీలు

  • *

    లేదా “ప్రధాన అధిపతికి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 38:15
  • +యెష 66:19; యెహె 32:26

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    5/2020, పేజీ 15

    కావలికోట (అధ్యయన),

    9/2019, పేజీ 11

    కావలికోట,

    8/1/2007, పేజీ 9

    3/1/1997, పేజీ 14

యెహెజ్కేలు 38:3

అధస్సూచీలు

  • *

    లేదా “ప్రధాన అధిపతివైన.”

యెహెజ్కేలు 38:4

అధస్సూచీలు

  • *

    లేదా “కేడెములనూ.” ఎక్కువగా విలుకాండ్రు వీటిని తీసుకెళ్లేవాళ్లు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 19:20, 28; యెహె 29:3, 4
  • +యెహె 38:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/1/1997, పేజీలు 15-17

యెహెజ్కేలు 38:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 1:8

యెహెజ్కేలు 38:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 10:2, 3
  • +యెహె 39:2

యెహెజ్కేలు 38:7

అధస్సూచీలు

  • *

    అక్ష., “కాపలావాడిగా.”

యెహెజ్కేలు 38:8

అధస్సూచీలు

  • *

    లేదా “నిన్ను రప్పిస్తాను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 23:5, 6; యెహె 28:25, 26

యెహెజ్కేలు 38:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 15:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2015, పేజీ 29

    7/1/1995, పేజీ 25

    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!, పేజీ 227

యెహెజ్కేలు 38:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 33:12
  • +జెక 10:8
  • +యెష 60:5; 61:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/1/1993, పేజీలు 22-23

యెహెజ్కేలు 38:13

అధస్సూచీలు

  • *

    లేదా “కొదమ సింహాలన్నీ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 27:22
  • +యెహె 27:15
  • +యెహె 27:25

యెహెజ్కేలు 38:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 38:8

యెహెజ్కేలు 38:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 39:2
  • +జెఫ 3:8

యెహెజ్కేలు 38:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోవే 3:2
  • +నిర్గ 14:4; 2రా 19:17-19; కీర్త 83:17, 18; యెహె 39:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2015, పేజీ 19

    9/15/2012, పేజీలు 5-6

    3/15/2009, పేజీలు 18-19

యెహెజ్కేలు 38:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోవే 3:16; నహూ 1:2; జెక 2:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!, పేజీ 227

యెహెజ్కేలు 38:20

అధస్సూచీలు

  • *

    లేదా “సరీసృపాలన్నీ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నహూ 1:5

యెహెజ్కేలు 38:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 20:23; హగ్గ 2:22; జెక 14:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!, పేజీ 227

యెహెజ్కేలు 38:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +జెక 14:12
  • +నిర్గ 9:22; యెహో 10:11
  • +ఆది 19:24; యెష 30:30
  • +యిర్మీ 25:31

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యెహె. 38:2యెహె 38:15
యెహె. 38:2యెష 66:19; యెహె 32:26
యెహె. 38:42రా 19:20, 28; యెహె 29:3, 4
యెహె. 38:4యెహె 38:15
యెహె. 38:51ది 1:8
యెహె. 38:6ఆది 10:2, 3
యెహె. 38:6యెహె 39:2
యెహె. 38:8యిర్మీ 23:5, 6; యెహె 28:25, 26
యెహె. 38:11నిర్గ 15:9
యెహె. 38:12యిర్మీ 33:12
యెహె. 38:12జెక 10:8
యెహె. 38:12యెష 60:5; 61:6
యెహె. 38:13యెహె 27:22
యెహె. 38:13యెహె 27:15
యెహె. 38:13యెహె 27:25
యెహె. 38:14యెహె 38:8
యెహె. 38:15యెహె 39:2
యెహె. 38:15జెఫ 3:8
యెహె. 38:16యోవే 3:2
యెహె. 38:16నిర్గ 14:4; 2రా 19:17-19; కీర్త 83:17, 18; యెహె 39:21
యెహె. 38:18యోవే 3:16; నహూ 1:2; జెక 2:8
యెహె. 38:20నహూ 1:5
యెహె. 38:212ది 20:23; హగ్గ 2:22; జెక 14:13
యెహె. 38:22జెక 14:12
యెహె. 38:22నిర్గ 9:22; యెహో 10:11
యెహె. 38:22ఆది 19:24; యెష 30:30
యెహె. 38:22యిర్మీ 25:31
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యెహెజ్కేలు 38:1-23

యెహెజ్కేలు

38 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “మానవ కుమారుడా, మాగోగు దేశం వాడైన గోగుకు+ అంటే మెషెకు, తుబాలుల+ ముఖ్య ప్రధానుడికి* వ్యతిరేకంగా నీ ముఖం తిప్పి అతనికి వ్యతిరేకంగా ప్రవచించు. 3 ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “మెషెకు, తుబాలుల ముఖ్య ప్రధానుడివైన* గోగూ, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను. 4 నేను నిన్ను వెనక్కి తిప్పి, నీ దవడలకు కొక్కేలు తగిలించి+ నీ సైన్యమంతటితో పాటు, గుర్రాలతో పాటు, ఘనమైన వస్త్రాలు ధరించిన గుర్రపురౌతులతో పాటు, పెద్ద డాళ్లనూ చిన్న డాళ్లనూ* ఖడ్గాల్నీ పట్టుకొనివున్న పెద్ద సమూహంతో పాటు నిన్ను బయటికి తీసుకొస్తాను;+ 5 వాళ్లలో పారసీక, ఇతియోపియా, పూతు+ సైనికులు ఉన్నారు, వాళ్లంతా చిన్న డాళ్లు, శిరస్త్రాణాలు ధరించి ఉన్నారు; 6 అలాగే గోమెరు, అతని సైన్యాలన్నీ, ఉత్తరాన సుదూర ప్రాంతాల నుండి తోగర్మా+ ఇంటివాళ్లు, వాళ్ల సైన్యాలన్నీ ఉన్నాయి. చాలా జనాలు నీతో ఉన్నాయి.+

7 “ ‘ “సిద్ధంగా ఉండు. నువ్వూ నీతో పాటు సమకూడిన సైన్యాలన్నీ సిద్ధపడి ఉండండి. నువ్వు వాళ్లకు సైన్యాధికారిగా* ఉంటావు.

8 “ ‘ “చాలా రోజుల తర్వాత నేను నీ మీద దృష్టి పెడతాను.* సంవత్సరాల చివర్లో నువ్వు ఖడ్గం నుండి విడిపించబడి తిరిగి తీసుకురాబడిన ప్రజల దేశం మీద దాడి చేస్తావు; వాళ్లు అనేక జనాల నుండి సమకూర్చబడి, ఎంతోకాలంగా పాడుబడివున్న ఇశ్రాయేలు పర్వతాల మీదికి తీసుకురాబడ్డారు. ఈ దేశ ప్రజలు జనాల నుండి తిరిగి తీసుకురాబడి, సురక్షితంగా నివసిస్తున్నారు.+ 9 నువ్వూ, నీ సైన్యాలన్నీ, నీతో ఉన్న అనేక జనాలూ తుఫానులా వాళ్లమీదికి వస్తారు, మేఘాల్లా ఆ దేశాన్ని కమ్ముకుంటారు.” ’

10 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఆ రోజున నీ హృదయంలో కొన్ని ఆలోచనలు పుడతాయి, నువ్వు ఒక దుష్ట పన్నాగం పన్నుతావు. 11 నువ్వు ఇలా అనుకుంటావు: “నేను ప్రాకారాలులేని గ్రామాలుగల దేశం మీద దాడి చేస్తాను.+ ప్రాకారాలు గానీ, అడ్డగడియలు గానీ, ద్వారాలు గానీ లేని గ్రామాల్లో సురక్షితంగా, నిశ్చింతగా నివసిస్తున్న వాళ్లందరి మీదికి వెళ్తాను.” 12 నువ్వు విస్తారమైన దోపుడుసొమ్మును, కొల్లసొమ్మును తీసుకోవాలని; ఇంతకుముందు పాడైపోయి ఇప్పుడు ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల మీద దాడిచేయాలని;+ జనాల్లో నుండి తిరిగి సమకూర్చబడి,+ సంపదనూ వస్తువుల్నీ పోగుచేసుకుంటూ+ భూమి మధ్యలో నివసిస్తున్న జనాంగం మీద దాడిచేయాలని అనుకుంటావు.

13 “ ‘షేబవాళ్లు,+ దెదానువాళ్లు,+ తర్షీషు+ వర్తకులు, దాని యోధులందరూ* నీతో ఇలా అంటారు: “నువ్వు విస్తారమైన దోపుడుసొమ్ము, కొల్లసొమ్ము కోసం దాడి చేస్తున్నావా? వెండిబంగారాల్ని, సంపదను, వస్తువుల్ని తీసుకెళ్లడానికి, చాలా పెద్ద మొత్తంలో దోపుడుసొమ్మును కొల్లగొట్టడానికి నీ సైన్యాల్ని సమకూర్చావా?” ’

14 “కాబట్టి మానవ కుమారుడా, నువ్వు గోగుతో ఇలా ప్రవచించు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “నా ప్రజలైన ఇశ్రాయేలీయులు సురక్షితంగా నివసించే రోజున ఆ విషయం నీకు తెలియకుండా ఉంటుందా?+ 15 అప్పుడు నువ్వూ, నీతో ఉన్న దేశదేశాల ప్రజలంతా నీ స్థలం నుండి, అంటే ఉత్తరాన సుదూర ప్రాంతాల నుండి+ గుర్రాల మీద స్వారీచేస్తూ పెద్ద సమూహంలా, విస్తార సైన్యంలా వస్తారు.+ 16 మేఘాలు దేశాన్ని కప్పేసినట్టు, నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీదికి వస్తావు. గోగూ, చివరి రోజుల్లో నేను నిన్ను నా దేశం మీదికి రప్పిస్తాను;+ నేను జనాల కళ్లముందు నీ ద్వారా నన్ను నేను పవిత్రపర్చుకున్నప్పుడు అవి నన్ను తెలుసుకుంటాయి.” ’+

17 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను నా సేవకులైన ఇశ్రాయేలు ప్రవక్తల ద్వారా గతంలో మాట్లాడింది నీ గురించి కాదా? నువ్వు వాళ్ల మీదికి రప్పించబడతావని వాళ్లు ఎన్నో సంవత్సరాల పాటు ప్రవచించారు.’

18 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఆ రోజున అంటే గోగు ఇశ్రాయేలు దేశం మీద దాడి చేసే ఆ రోజున నా గొప్ప ఉగ్రత రగులుకుంటుంది.+ 19 నేను రోషంతో, మండే కోపంతో మాట్లాడతాను; ఆ రోజున ఇశ్రాయేలు దేశంలో గొప్ప భూకంపం వస్తుంది. 20 నన్ను బట్టి సముద్రంలోని చేపలు, ఆకాశపక్షులు, అడవి జంతువులు, నేలమీద పాకే ప్రాణులన్నీ,* భూమ్మీదున్న మనుషులంతా భయంతో వణుకుతారు, పర్వతాలు కూలిపోతాయి,+ కొండ పేటులు పడిపోతాయి, ప్రతీ గోడ నేలకూలుతుంది.’

21 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను నా పర్వతాలన్నిటి మీద అతనికి వ్యతిరేకంగా ఖడ్గాన్ని రప్పిస్తాను. ప్రతీ వ్యక్తి ఖడ్గం అతని సహోదరుడి మీదికి వస్తుంది.+ 22 నేను తెగులుతో,+ రక్తపాతంతో అతనికి తీర్పు తీరుస్తాను; అతని మీద, అతని సైన్యాల మీద, అతనితో ఉన్న అనేక జనాల మీద ప్రచండ వర్షాన్ని, వడగండ్లను,+ అగ్నిగంధకాల్ని+ కురిపిస్తాను.+ 23 అప్పుడు నేను అనేక జనాల కళ్లముందు ఖచ్చితంగా నన్ను నేను మహిమపర్చుకుంటాను, పవిత్రపర్చుకుంటాను, నన్ను నేను తెలియజేసుకుంటాను; అప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.’

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి