కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యిర్మీయా 3
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యిర్మీయా విషయసూచిక

      • ఇశ్రాయేలు మతభ్రష్టత్వం తీవ్రత (1-5)

      • ఇశ్రాయేలు, యూదాల వ్యభిచారం (6-11)

      • పశ్చాత్తాపపడమని పిలుపు (12-25)

యిర్మీయా 3:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 24:5; యిర్మీ 2:7
  • +యిర్మీ 2:20; యెహె 16:28, 29

యిర్మీయా 3:2

అధస్సూచీలు

  • *

    లేదా “దేశదిమ్మరిలా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 16:16; 20:28

యిర్మీయా 3:3

అధస్సూచీలు

  • *

    కడవరి వానలు దాదాపు ఏప్రిల్‌ మధ్యలో మొదలయ్యేవి. అనుబంధం B15 చూడండి.

  • *

    అక్ష., “భార్య నుదురు నీకు ఉంది.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 26:19; యిర్మీ 14:4; ఆమో 4:7
  • +యిర్మీ 6:15

యిర్మీయా 3:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 2:2

యిర్మీయా 3:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మీకా 2:1; 7:3

యిర్మీయా 3:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 22:1
  • +యెహె 20:28; హోషే 4:13

యిర్మీయా 3:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 17:13; 2ది 30:6; హోషే 14:1
  • +యెహె 16:46; 23:2, 4

యిర్మీయా 3:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 23:4, 5, 9; హోషే 2:2; 9:15
  • +ద్వితీ 24:1
  • +2రా 17:19; యెహె 23:4, 11

యిర్మీయా 3:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 57:5, 6; యిర్మీ 2:27

యిర్మీయా 3:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 16:51; 23:4, 11

యిర్మీయా 3:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 17:6; యిర్మీ 23:8
  • +యిర్మీ 4:1; యెహె 33:11; హోషే 14:1
  • +హోషే 11:8, 9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2007, పేజీ 9

యిర్మీయా 3:13

అధస్సూచీలు

  • *

    లేదా “వేరే దేవుళ్లతో.”

యిర్మీయా 3:14

అధస్సూచీలు

  • *

    అక్ష., “కుమారులారా.”

  • *

    లేదా “భర్తను” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 23:3

యిర్మీయా 3:15

అధస్సూచీలు

  • *

    అక్ష., “హృదయం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 23:4; యెహె 34:23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/1990, పేజీలు 26-27

యిర్మీయా 3:16

అధస్సూచీలు

  • *

    లేదా “నిబంధన.”

  • *

    లేదా “పెద్దపెట్టె.”

  • *

    అక్ష., “అది హృదయంలోకి రాదు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హోషే 1:10

యిర్మీయా 3:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 87:3; యెహె 43:7
  • +యెష 2:2, 3; 56:6, 7; 60:3; మీకా 4:1, 2; జెక 2:11; 8:22, 23

యిర్మీయా 3:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 50:4; యెహె 37:19; హోషే 1:11
  • +2ది 36:23; ఎజ్రా 1:3; ఆమో 9:15

యిర్మీయా 3:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 20:6

యిర్మీయా 3:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 48:8; హోషే 3:1; 5:7

యిర్మీయా 3:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 17:10; హోషే 8:14; 13:6

యిర్మీయా 3:22

అధస్సూచీలు

  • *

    అక్ష., “కుమారులారా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హోషే 14:1, 4
  • +యిర్మీ 31:18; హోషే 3:5

యిర్మీయా 3:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 65:7
  • +యెష 12:2

యిర్మీయా 3:24

అధస్సూచీలు

  • *

    లేదా “అవమానకరమైన.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హోషే 9:10

యిర్మీయా 3:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎజ్రా 9:7; కీర్త 106:7; యిర్మీ 2:19

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యిర్మీ. 3:1యెష 24:5; యిర్మీ 2:7
యిర్మీ. 3:1యిర్మీ 2:20; యెహె 16:28, 29
యిర్మీ. 3:2యెహె 16:16; 20:28
యిర్మీ. 3:3లేవీ 26:19; యిర్మీ 14:4; ఆమో 4:7
యిర్మీ. 3:3యిర్మీ 6:15
యిర్మీ. 3:4యిర్మీ 2:2
యిర్మీ. 3:5మీకా 2:1; 7:3
యిర్మీ. 3:62రా 22:1
యిర్మీ. 3:6యెహె 20:28; హోషే 4:13
యిర్మీ. 3:72రా 17:13; 2ది 30:6; హోషే 14:1
యిర్మీ. 3:7యెహె 16:46; 23:2, 4
యిర్మీ. 3:8యెహె 23:4, 5, 9; హోషే 2:2; 9:15
యిర్మీ. 3:8ద్వితీ 24:1
యిర్మీ. 3:82రా 17:19; యెహె 23:4, 11
యిర్మీ. 3:9యెష 57:5, 6; యిర్మీ 2:27
యిర్మీ. 3:11యెహె 16:51; 23:4, 11
యిర్మీ. 3:12యిర్మీ 4:1; యెహె 33:11; హోషే 14:1
యిర్మీ. 3:12హోషే 11:8, 9
యిర్మీ. 3:122రా 17:6; యిర్మీ 23:8
యిర్మీ. 3:14యిర్మీ 23:3
యిర్మీ. 3:15యిర్మీ 23:4; యెహె 34:23
యిర్మీ. 3:16హోషే 1:10
యిర్మీ. 3:17కీర్త 87:3; యెహె 43:7
యిర్మీ. 3:17యెష 2:2, 3; 56:6, 7; 60:3; మీకా 4:1, 2; జెక 2:11; 8:22, 23
యిర్మీ. 3:18యిర్మీ 50:4; యెహె 37:19; హోషే 1:11
యిర్మీ. 3:182ది 36:23; ఎజ్రా 1:3; ఆమో 9:15
యిర్మీ. 3:19యెహె 20:6
యిర్మీ. 3:20యెష 48:8; హోషే 3:1; 5:7
యిర్మీ. 3:21యెష 17:10; హోషే 8:14; 13:6
యిర్మీ. 3:22హోషే 14:1, 4
యిర్మీ. 3:22యిర్మీ 31:18; హోషే 3:5
యిర్మీ. 3:23యెష 65:7
యిర్మీ. 3:23యెష 12:2
యిర్మీ. 3:24హోషే 9:10
యిర్మీ. 3:25ఎజ్రా 9:7; కీర్త 106:7; యిర్మీ 2:19
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యిర్మీయా 3:1-25

యిర్మీయా

3 ప్రజలు ఇలా అంటారు: “ఒకతను తన భార్యకు విడాకులిచ్చినప్పుడు, ఆమె వెళ్లిపోయి ఇంకొకరి భార్య అయ్యాక అతను మళ్లీ ఆమె దగ్గరికి వెళ్తాడా?”

అలాంటి దేశం పూర్తిగా కలుషితమైపోయింది కదా.+

యెహోవా ఇలా అంటున్నాడు: “నువ్వు చాలామంది సహచరులతో వ్యభిచారం చేశావు,+

ఇప్పుడు మళ్లీ నా దగ్గరికి తిరిగిరావచ్చా?”

 2 “చెట్లులేని కొండల వైపు నీ తల ఎత్తి చూడు.

నువ్వు చెరచబడని స్థలం ఏదైనా ఉందా?

ఎడారిలో అరబీయుడిలా*

నువ్వు వాళ్లకోసం దారుల పక్కన కాచుకొని కూర్చున్నావు.

నీ వ్యభిచారంతో, నీ దుష్టత్వంతో

దేశాన్ని కలుషితం చేస్తూ ఉన్నావు.+

 3 అందుకే వర్షాలు పడట్లేదు,+

కడవరి వాన* కురవట్లేదు.

వ్యభిచారం చేసే భార్యలా నువ్వు సిగ్గులేకుండా ప్రవర్తిస్తున్నావు;*

నీకు కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదు.+

 4 ఇప్పుడేమో నాకు ఇలా మొరపెడుతున్నావు:

‘నా తండ్రీ, చిన్నప్పటి నుండి నువ్వే నా సహచరుడివి!+

 5 నువ్వు ఎప్పుడూ కోపంగా ఉంటావా?

ఎప్పటికీ పగ పెట్టుకుంటావా?’

నువ్వు ఇలా అంటావు కానీ,

నీ చేతనైనంత చెడు చేస్తూనే ఉంటావు.”+

6 రాజైన యోషీయా+ రోజుల్లో యెహోవా నాతో ఇలా అన్నాడు: “ ‘విశ్వాసఘాతకురాలైన ఇశ్రాయేలు నాకు ఏం చేసిందో చూశావా? ఆమె వ్యభిచారం చేయడానికి ఎత్తైన ప్రతీ పర్వతం మీదికి, పచ్చని ప్రతీ చెట్టు కిందికి వెళ్లింది.+ 7 ఆమె ఇవన్నీ చేసినా, నా దగ్గరికి తిరిగిరమ్మని నేను ఆమెతో చెప్తూ వచ్చాను.+ కానీ ఆమె తిరిగిరాలేదు; యూదా, నమ్మకద్రోహియైన తన సహోదరిని గమనిస్తూ ఉంది.+ 8 నేను అది చూసి, విశ్వాసఘాతకురాలైన ఇశ్రాయేలు వ్యభిచారాన్ని బట్టి+ ఆమెకు విడాకుల పత్రాన్ని ఇచ్చి పంపించేశాను.+ అయితే నమ్మకద్రోహియైన ఆమె సహోదరి యూదా దాన్ని చూసి భయపడలేదు; ఆమె కూడా వెళ్లి వ్యభిచారం చేసింది.+ 9 ఆమె తన వ్యభిచారాన్ని తేలిగ్గా తీసుకుంది; ఆమె దేశాన్ని కలుషితం చేస్తూ రాళ్లతో, చెట్లతో వ్యభిచారం చేస్తూ వచ్చింది.+ 10 ఇంత జరిగినా, నమ్మకద్రోహియైన ఆమె సహోదరి యూదా తన నిండు హృదయంతో నా దగ్గరికి తిరిగిరాలేదు, కేవలం వచ్చినట్టు నటించిందంతే’ అని యెహోవా అంటున్నాడు.”

11 తర్వాత యెహోవా నాతో ఇలా అన్నాడు: “నమ్మకద్రోహియైన యూదా కన్నా విశ్వాసఘాతకురాలైన ఇశ్రాయేలు ఎక్కువ నీతిమంతురాలు.+ 12 నువ్వు ఉత్తర దిక్కుకు వెళ్లి ఈ మాటలు ప్రకటించు:+

“ ‘ “భ్రష్టురాలైన ఇశ్రాయేలూ, తిరిగి రా,” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.’+ ‘ “నేను విశ్వసనీయుణ్ణి కాబట్టి నీ మీద కోపం చూపించను”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.’ ‘ “నేను ఎల్లప్పుడూ కోపంగా ఉండను. 13 నువ్వు మాత్రం నీ అపరాధాన్ని గుర్తించు, ఎందుకంటే నువ్వు నీ దేవుడైన యెహోవాకు ఎదురుతిరిగావు. నువ్వు పచ్చని ప్రతీ చెట్టు కింద అపరిచితులతో* సంబంధం పెట్టుకుంటూ ఉన్నావు, నా స్వరానికి లోబడట్లేదు” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.’ ”

14 “భ్రష్టులైన పిల్లలారా,* తిరిగిరండి” అని యెహోవా ప్రకటిస్తున్నాడు. “నేను మీ నిజమైన యజమానిని* అయ్యాను; నేను ప్రతీ నగరం నుండి ఒకర్ని, ప్రతీ కుటుంబం నుండి ఇద్దర్ని తీసుకుంటాను. అలా మిమ్మల్ని సీయోనుకు తీసుకొస్తాను.+ 15 నా ఇష్టం* ప్రకారం నడుచుకునే కాపరుల్ని మీకు ఇస్తాను;+ వాళ్లు జ్ఞానంతో, లోతైన అవగాహనతో మిమ్మల్ని పోషిస్తారు. 16 ఆ రోజుల్లో మీరు దేశంలో వృద్ధి చెంది చాలామంది అవుతారు” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.+ “ ‘యెహోవా ఒప్పంద* మందసం!’* అని మీరు ఇంకెప్పుడూ అనరు. దాని గురించి ఎప్పుడూ ఆలోచించరు,* దాన్ని గుర్తుచేసుకోరు, అది లేదని బాధపడరు, అలాంటిది ఇంకొకటి తయారుచేయరు. 17 అప్పుడు యెరూషలేమును యెహోవా సింహాసనం అని పిలుస్తారు;+ దేశాలన్నీ యెహోవా పేరును స్తుతించడానికి యెరూషలేములో సమకూర్చబడతాయి,+ వాళ్లు ఇంకెప్పుడూ మొండిగా తమ దుష్ట హృదయాన్ని అనుసరించరు.”

18 “ఆ రోజుల్లో యూదా ఇంటివాళ్లు, ఇశ్రాయేలు ఇంటివాళ్లు ఐక్యంగా నడుస్తారు;+ వాళ్లు ఉత్తర దేశం నుండి కలిసి బయల్దేరి, నేను మీ పూర్వీకులకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశానికి వస్తారు.+ 19 నేను, ‘నిన్ను నా కుమారుల్లో ఒకడిగా ఎంచి నీకు రమ్యమైన దేశాన్ని, దేశాల మధ్య ఎంతో అందమైన స్వాస్థ్యాన్ని ఇవ్వాలి’ అనుకున్నాను.+ అంతేకాదు మీరు నన్ను, ‘తండ్రీ!’ అని పిలుస్తారని, నన్ను అనుసరించడం మానేయరని అనుకున్నాను. 20 ‘కానీ, భార్య తన భర్తకు నమ్మకద్రోహం చేసి అతన్ని విడిచిపెట్టినట్టే, ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, మీరు కూడా నాకు నమ్మకద్రోహం చేశారు’+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”

21 చెట్లులేని కొండల మీద ఒక శబ్దం వినిపిస్తోంది,

అది ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తూ, వేడుకుంటున్న శబ్దం.

ఎందుకంటే, వాళ్లు తప్పు దారిలో వెళ్లారు;

తమ దేవుడైన యెహోవాను మర్చిపోయారు.+

22 “భ్రష్టులైన పిల్లలారా,* తిరిగిరండి.

నేను మీ భ్రష్ట హృదయాన్ని బాగుచేస్తాను.”+

“ఇదిగో మేము వచ్చాం! నీ దగ్గరికి వచ్చాం!

ఎందుకంటే యెహోవా, నువ్వే మా దేవుడివి.+

23 కొండల మీద, పర్వతాల మీద చేసే అల్లరి నిజంగా మోసకరమే.+

నిజంగా, మా దేవుడైన యెహోవా నుండే ఇశ్రాయేలుకు రక్షణ వస్తుంది.+

24 కానీ మా చిన్నప్పటి నుండి, ఆ పనికిరాని* దేవుడు మా పూర్వీకుల కష్టాన్ని,

వాళ్ల పశువుల్ని, మందల్ని,

కుమారుల్ని, కూతుళ్లను మింగేశాడు.+

25 రండి, మనం అవమానంతో పడుకుందాం,

మన సిగ్గు మనల్ని కప్పేయాలి,

ఎందుకంటే మనమూ, మన తండ్రులూ చిన్నప్పటి నుండి ఈ రోజు వరకు

మన దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాం,+

మన దేవుడైన యెహోవా స్వరానికి లోబడలేదు.”

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి