కీర్తనలు
సంగీత నిర్దేశకునికి సూచన. కోరహు కుమారుల కీర్తన.+ మాస్కిల్.*
44 దేవా, మా పూర్వీకుల రోజుల్లో, చాలాకాలం క్రితం
నువ్వు చేసిన కార్యాల్ని మేము చెవులారా విన్నాం,
మా పూర్వీకులు వాటిని మాకు చెప్పారు.+
2 నువ్వు నీ చేతితో దేశాల ప్రజల్ని వెళ్లగొట్టి,+
మా పూర్వీకుల్ని అక్కడ స్థిరపడేలా చేశావు.+
దేశాల ప్రజల్ని నలగ్గొట్టి తరిమేశావు.+
బదులుగా నీ కుడిచెయ్యి, నీ బాహువు,+ నీ ముఖకాంతి విజయాన్ని ఇచ్చాయి,
ఎందుకంటే, నువ్వు వాళ్లను చూసి సంతోషించావు.+
6 నేను నా విల్లు మీద నమ్మకం పెట్టుకోను,
నా కత్తి నన్ను కాపాడలేదు.+
7 మా శత్రువుల నుండి మమ్మల్ని కాపాడింది నువ్వే,+
మమ్మల్ని ద్వేషించేవాళ్లను అవమానించింది నువ్వే.
8 రోజంతా మేము దేవునికి స్తుతులు చెల్లిస్తాం,
నీ పేరుకు ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్తాం. (సెలా)
9 కానీ ఇప్పుడు నువ్వు మమ్మల్ని త్రోసివేసి, అవమానాలపాలు చేశావు,
నువ్వు మా సైన్యాలతో పాటు బయల్దేరడం లేదు.
10 మేము మా శత్రువుల నుండి పారిపోయేలా చేస్తున్నావు;+
మమ్మల్ని ద్వేషించేవాళ్లు ఏది కావాలనుకుంటే అది తీసుకెళ్తున్నారు.
11 గొర్రెల్లా మింగేయబడాలని మమ్మల్ని వాళ్లకు అప్పగించావు;
మమ్మల్ని దేశాల మధ్యకు చెదరగొట్టావు.+
12 నీ ప్రజల్ని అతి తక్కువ ధరకు అమ్మేశావు;+
అలా అమ్మడంవల్ల నీకు లాభమేమీ రాలేదు.
13 మా పొరుగువాళ్ల మధ్య నువ్వు మమ్మల్ని నిందలపాలు చేశావు,
మా చుట్టూ ఉన్నవాళ్లు మమ్మల్ని ఎగతాళి చేసేలా, వెక్కిరించేలా చేశావు.
15 రోజంతా నాకు అవమానంగా అనిపిస్తోంది,
సిగ్గుతో నేను తల ఎత్తుకోలేకపోతున్నాను,
16 నన్ను హేళన చేసే, దూషించే వాళ్ల స్వరం వల్ల,
పగ తీర్చుకుంటున్న మా శత్రువు వల్ల నాకు అలా అనిపిస్తుంది.
17 ఇవన్నీ మా మీదికి వచ్చాయి, అయినా మేము నిన్ను మర్చిపోలేదు,
నీ ఒప్పందాన్ని మీరలేదు.+
18 మా హృదయం పక్కకు మళ్లలేదు;
మా పాదాలు నీ మార్గం నుండి తొలగలేదు.
19 కానీ నక్కలు నివసించే చోట నువ్వు మమ్మల్ని నలగ్గొట్టావు;
గాఢాంధకారంతో మమ్మల్ని కప్పేశావు.
20 మేము మా దేవుని పేరును మర్చిపోయివుంటే,
పరాయి దేవునికి ప్రార్థించడానికి మా చేతులు చాపివుంటే,
21 దేవుడు దాన్ని పసిగట్టలేడా?
ఆయనకు హృదయ రహస్యాలు తెలుసు.+
22 నీ కోసం మేము రోజంతా మరణాన్ని ఎదుర్కొంటున్నాం;
వధించబోయే గొర్రెల్లా ఎంచబడ్డాం.+
23 యెహోవా, లే. ఎందుకు నిద్రపోతూ ఉన్నావు?+
మేలుకో! మమ్మల్ని ఎప్పటికీ త్రోసివేస్తూ ఉండకు.+
24 ఎందుకు నీ ముఖాన్ని దాచుకున్నావు?
మా కష్టాల్ని, అణచివేతను ఎందుకు మర్చిపోయావు?
25 మా ప్రాణం నేలకు కృంగిపోయింది;
మా శరీరాలు నేలకు అంటుకున్నాయి.+
26 లేచి మాకు సహాయం చేయి!+