కీర్తనలు
సంగీత నిర్దేశకునికి సూచన; గిత్తీత్* అనే రాగంలో పాడాలి. కోరహు కుమారుల కీర్తన.+ శ్రావ్యగీతం.
2 యెహోవా ప్రాంగణాల దగ్గరికి వెళ్లాలని
నా ప్రాణం ఎంతో తపిస్తోంది,
అవును, తపించీ తపించీ నేను సొమ్మసిల్లిపోయాను.+
నా హృదయం, నా శరీరం సంతోషంతో కేకలు వేస్తూ జీవంగల దేవుణ్ణి స్తుతిస్తున్నాయి.
3 సైన్యాలకు అధిపతివైన యెహోవా,
నా రాజా, నా దేవా, నీ గొప్ప బలిపీఠం దగ్గర
పక్షికి కూడా నివాసం దొరుకుతుంది,
వానకోకిలకు సైతం గూడు దొరుకుతుంది,
అక్కడ అది తన పిల్లల్ని పెంచుతుంది.
4 నీ మందిరంలో నివసించేవాళ్లు ధన్యులు!*+
వాళ్లు నిన్ను స్తుతిస్తూ ఉంటారు.+ (సెలా)
7 వాళ్లు నడుస్తూ అంతకంతకూ బలం పొందుతారు;+
ప్రతీ ఒక్కరు సీయోనులో దేవుని ముందు కనబడతారు.
8 సైన్యాలకు దేవుడివైన యెహోవా, నా ప్రార్థన విను;
యాకోబు దేవా, ఆలకించు. (సెలా)
10 నీ ప్రాంగణాల్లో ఒక్క రోజు గడపడం, వేరేచోట వెయ్యి రోజులు గడపడం కన్నా మేలు!+
దుష్టుల డేరాల్లో నివసించడం కన్నా,
నా దేవుని మందిర ద్వారం దగ్గర నిలబడడమే నాకు ఇష్టం.
యథార్థంగా నడుచుకునేవాళ్లకు
యెహోవా ఏ మేలూ చేయకుండా ఉండడు.+