కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • న్యాయాధిపతులు 10
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

న్యాయాధిపతులు విషయసూచిక

      • న్యాయాధిపతులు తోలా, యాయీరు (1-5)

      • ఇశ్రాయేలీయుల తిరుగుబాటు, పశ్చాత్తాపం (6-16)

      • అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల్ని బెదిరించడం (17, 18)

న్యాయాధిపతులు 10:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 2:16

న్యాయాధిపతులు 10:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 3:14

న్యాయాధిపతులు 10:6

అధస్సూచీలు

  • *

    లేదా “సిరియా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 2:19; 4:1; 6:1; నెహె 9:28
  • +సం 25:1, 2
  • +1రా 11:5; 2రా 23:13
  • +న్యా 16:23; 1స 5:4; 2రా 1:2
  • +న్యా 3:7; కీర్త 106:36-38

న్యాయాధిపతులు 10:7

అధస్సూచీలు

  • *

    అక్ష., “అమ్మేశాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 28:15, 48; 31:17; న్యా 2:14; 4:2

న్యాయాధిపతులు 10:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2007, పేజీ 8

న్యాయాధిపతులు 10:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 2:13; 3:7; 1స 12:9, 10
  • +ద్వితీ 4:30

న్యాయాధిపతులు 10:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 14:30
  • +సం 21:23-25
  • +న్యా 3:31

న్యాయాధిపతులు 10:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 2:12
  • +2ది 15:2; మీకా 3:4

న్యాయాధిపతులు 10:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 18:27
  • +యిర్మీ 2:28

న్యాయాధిపతులు 10:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 7:26
  • +2ది 7:14; 33:13, 15; కీర్త 106:44; యెష 63:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీలు 254-255

న్యాయాధిపతులు 10:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 19:36, 38; న్యా 3:13

న్యాయాధిపతులు 10:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 11:1

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

న్యాయా. 10:1న్యా 2:16
న్యాయా. 10:4ద్వితీ 3:14
న్యాయా. 10:6న్యా 2:19; 4:1; 6:1; నెహె 9:28
న్యాయా. 10:6సం 25:1, 2
న్యాయా. 10:61రా 11:5; 2రా 23:13
న్యాయా. 10:6న్యా 16:23; 1స 5:4; 2రా 1:2
న్యాయా. 10:6న్యా 3:7; కీర్త 106:36-38
న్యాయా. 10:7ద్వితీ 28:15, 48; 31:17; న్యా 2:14; 4:2
న్యాయా. 10:10న్యా 2:13; 3:7; 1స 12:9, 10
న్యాయా. 10:10ద్వితీ 4:30
న్యాయా. 10:11నిర్గ 14:30
న్యాయా. 10:11సం 21:23-25
న్యాయా. 10:11న్యా 3:31
న్యాయా. 10:13న్యా 2:12
న్యాయా. 10:132ది 15:2; మీకా 3:4
న్యాయా. 10:141రా 18:27
న్యాయా. 10:14యిర్మీ 2:28
న్యాయా. 10:16ద్వితీ 7:26
న్యాయా. 10:162ది 7:14; 33:13, 15; కీర్త 106:44; యెష 63:9
న్యాయా. 10:17ఆది 19:36, 38; న్యా 3:13
న్యాయా. 10:18న్యా 11:1
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
న్యాయాధిపతులు 10:1-18

న్యాయాధిపతులు

10 అబీమెలెకు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయుల్ని రక్షించడానికి ఇశ్శాఖారు గోత్రానికి చెందిన తోలా బయల్దేరాడు;+ అతను దోదో కుమారుడైన పువ్వా కుమారుడు. అతను ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలోని షామీరులో నివసించాడు. 2 అతను 23 సంవత్సరాలు ఇశ్రాయేలులో న్యాయాధిపతిగా ఉన్నాడు. తర్వాత అతను చనిపోయాడు, అతన్ని షామీరులో పాతిపెట్టారు.

3 అతని తర్వాత గిలాదుకు చెందిన యాయీరు లేచాడు, అతను ఇశ్రాయేలులో 22 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. 4 అతనికి 30 మంది కుమారులు; వాళ్లు 30 గాడిదల మీద తిరిగేవాళ్లు. వాళ్లకు 30 నగరాలు ఉండేవి, వాటిని ఈ రోజు వరకు హవోత్‌-యాయీరు+ అని పిలుస్తున్నారు. అవి గిలాదు ప్రాంతంలో ఉన్నాయి. 5 తర్వాత యాయీరు చనిపోయాడు, అతన్ని కామోనులో పాతిపెట్టారు.

6 ఇశ్రాయేలీయులు మళ్లీ యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించారు;+ వాళ్లు బయలు దేవుళ్లను, అష్తారోతు విగ్రహాల్ని, అరాము* దేవుళ్లను, సీదోను దేవుళ్లను, మోయాబు దేవుళ్లను,+ అమ్మోనీయుల దేవుళ్లను,+ ఫిలిష్తీయుల దేవుళ్లను+ సేవించడం మొదలుపెట్టారు.+ వాళ్లు యెహోవాను విడిచిపెట్టారు, వాళ్లు ఆయన్ని సేవించలేదు. 7 అప్పుడు యెహోవా కోపం ఇశ్రాయేలీయుల మీద రగులుకుంది; ఆయన వాళ్లను ఫిలిష్తీయుల చేతికి, అమ్మోనీయుల చేతికి అప్పగించాడు.*+ 8 వాళ్లు ఆ సంవత్సరం ఇశ్రాయేలీయుల్ని కష్టాలు పెట్టి తీవ్రంగా అణచివేశారు; యొర్దాను అవతల ఉన్న గిలాదులోని ఒకప్పటి అమోరీయుల దేశంలో నివసిస్తున్న ఇశ్రాయేలీయులందర్నీ వాళ్లు 18 సంవత్సరాలు అణగదొక్కారు. 9 అమ్మోనీయులు యూదావాళ్లతో, బెన్యామీనువాళ్లతో, ఎఫ్రాయిము ఇంటివాళ్లతో యుద్ధం చేయడానికి యొర్దాను నది కూడా దాటేవాళ్లు; దాంతో ఇశ్రాయేలీయులకు తీవ్రమైన కష్టాలు వచ్చాయి. 10 అప్పుడు ఇశ్రాయేలీయులు, “మా దేవా, మేము నీకు వ్యతిరేకంగా పాపం చేశాం; మా దేవుడివైన నిన్ను విడిచిపెట్టి బయలు దేవుళ్లను సేవించాం”+ అంటూ సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు.+

11 కానీ యెహోవా ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు: “నేను మిమ్మల్ని ఐగుప్తు నుండి,+ అమోరీయుల నుండి,+ అమ్మోనీయుల నుండి, ఫిలిష్తీయుల నుండి+ రక్షించలేదా? 12 అలాగే సీదోనీయులు, అమాలేకీయులు, మిద్యానీయులు మిమ్మల్ని అణచివేసినప్పుడు నేను మిమ్మల్ని రక్షించలేదా? మీరు నాకు మొరపెట్టినప్పుడు, నేను వాళ్ల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించాను. 13 కానీ మీరు నన్ను విడిచిపెట్టి వేరే దేవుళ్లను సేవించారు.+ అందుకే నేను మిమ్మల్ని మళ్లీ రక్షించను.+ 14 మీరు ఎంచుకున్న దేవుళ్ల దగ్గరికి వెళ్లి సహాయం కోసం వేడుకోండి.+ మీ కష్టకాలంలో వాళ్లనే మిమ్మల్ని రక్షించమనండి.”+ 15 కానీ ఇశ్రాయేలీయులు యెహోవాతో, “మేము పాపం చేశాం. నీ దృష్టికి ఏది మంచిదనిపిస్తే అది మాకు చేయి. దయచేసి ఈ రోజు మాత్రం మమ్మల్ని రక్షించు” అన్నారు. 16 అంతేకాదు, వాళ్లు తమ మధ్య ఉన్న అన్య దేవుళ్లను తీసేసి, యెహోవాను సేవించారు.+ దాంతో ఆయన ఇక ఇశ్రాయేలీయుల కష్టాల్ని ఏమాత్రం సహించలేకపోయాడు.+

17 కొంతకాలానికి అమ్మోనీయులు+ యుద్ధం చేయడానికి సమకూడి, గిలాదులో మకాం వేశారు. ఇశ్రాయేలీయులు సమకూడి మిస్పాలో మకాం వేశారు. 18 అప్పుడు గిలాదు ప్రజలు, అధిపతులు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకున్నారు: “అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి ఎవరైతే నాయకత్వం వహిస్తారో+ అతను గిలాదు ప్రజలందరికీ అధిపతి అవుతాడు.”

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి