కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • లేవీయకాండం 23
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

లేవీయకాండం విషయసూచిక

      • పవిత్రమైన రోజులు, పండుగలు (1-44)

        • విశ్రాంతి రోజు (3)

        • పస్కా పండుగ (4, 5)

        • పులవని రొట్టెల పండుగ (6-8)

        • ప్రథమఫలాల్ని అర్పించడం (9-14)

        • వారాల పండుగ (15-21)

        • సరైన విధంగా పంట కోయడం (22)

        • బాకా శబ్దపు పండుగ (23-25)

        • ప్రాయశ్చిత్త రోజు (26-32)

        • పర్ణశాలల పండుగ (33-43)

లేవీయకాండం 23:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 23:14; లేవీ 23:37; సం 10:10

లేవీయకాండం 23:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 16:30; 20:10; అపొ 15:21
  • +నెహె 13:22

లేవీయకాండం 23:5

అధస్సూచీలు

  • *

    అక్ష., “రెండు సాయంత్రాల మధ్య.” సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి పడడానికి ముందు ఉండే సమయాన్ని సూచిస్తుందని స్పష్టమౌతోంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 9:2, 3; 28:16
  • +నిర్గ 12:3, 6; ద్వితీ 16:1; 1కొ 5:7

లేవీయకాండం 23:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 28:17; 1కొ 5:8
  • +నిర్గ 12:15; 13:6; 34:18

లేవీయకాండం 23:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 12:16

లేవీయకాండం 23:10

అధస్సూచీలు

  • *

    లేదా “ప్రథమఫలాల్లోని.”

  • *

    లేదా “ధాన్యపు వెన్నుల కట్టను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 15:20, 23
  • +సం 18:8, 12; సామె 3:9; యెహె 44:30

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2007, పేజీ 26

లేవీయకాండం 23:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2007, పేజీ 26

లేవీయకాండం 23:13

అధస్సూచీలు

  • *

    అప్పట్లో ఈఫాలో రెండు పదోవంతులు 4.4 లీటర్లతో (2.6 కిలోలతో) సమానం. అనుబంధం B14 చూడండి.

  • *

    లేదా “శాంతపర్చే.”

  • *

    అప్పట్లో ఒక హిన్‌ 3.67 లీటర్లతో సమానం. అనుబంధం B14 చూడండి.

లేవీయకాండం 23:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 34:22; ద్వితీ 16:9, 10

లేవీయకాండం 23:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 2:1
  • +సం 28:26-31; ద్వితీ 16:16

లేవీయకాండం 23:17

అధస్సూచీలు

  • *

    అప్పట్లో ఈఫాలో రెండు పదోవంతులు 4.4 లీటర్లతో (2.6 కిలోలతో) సమానం. అనుబంధం B14 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 7:11, 13
  • +నిర్గ 23:16; 34:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 1/2021, పేజీ 3

    కావలికోట,

    3/1/1998, పేజీ 13

లేవీయకాండం 23:18

అధస్సూచీలు

  • *

    లేదా “శాంతపర్చే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 28:26, 27

లేవీయకాండం 23:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 4:23
  • +లేవీ 3:1

లేవీయకాండం 23:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 7:34; 10:14; సం 18:9; ద్వితీ 18:4; 1కొ 9:13

లేవీయకాండం 23:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 10:10

లేవీయకాండం 23:22

అధస్సూచీలు

  • *

    లేదా “కష్టాల్లో ఉన్నవాళ్ల.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 19:9; ద్వితీ 24:19; రూతు 2:2, 3
  • +లేవీ 19:33
  • +యెష 58:7

లేవీయకాండం 23:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 10:10

లేవీయకాండం 23:27

అధస్సూచీలు

  • *

    లేదా “మిమ్మల్ని మీరు బాధించుకోవాలి.” సాధారణంగా ఇది ఉపవాసం ఉండడంతో పాటు, కొన్నిటిని త్యాగం చేయడాన్ని సూచిస్తుందని అర్థమౌతోంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 30:10
  • +సం 29:7

లేవీయకాండం 23:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 16:34; హెబ్రీ 9:12, 24-26; 10:10; 1యో 2:1, 2

లేవీయకాండం 23:29

అధస్సూచీలు

  • *

    లేదా “ఉపవాసం ఉండకపోతే” అయ్యుంటుంది.

  • *

    లేదా “చంపబడతాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 9:13; 15:30

లేవీయకాండం 23:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 16:29-31; సం 29:7

లేవీయకాండం 23:34

అధస్సూచీలు

  • *

    లేదా “తాత్కాలిక ఆశ్రయాల.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 23:16; సం 29:12; ద్వితీ 16:13; ఎజ్రా 3:4; నెహె 8:14-18; యోహా 7:2

లేవీయకాండం 23:36

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 8:18

లేవీయకాండం 23:37

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 28:26; 29:7
  • +నిర్గ 23:14; ద్వితీ 16:16
  • +లేవీ 1:3
  • +లేవీ 2:1, 11
  • +సం 15:5; 28:6, 7

లేవీయకాండం 23:38

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 16:23; 31:13
  • +నిర్గ 28:38; సం 18:29
  • +ద్వితీ 12:11
  • +సం 29:39; ద్వితీ 12:6; 1ది 29:9; 2ది 35:8; ఎజ్రా 2:68

లేవీయకాండం 23:39

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 16:13
  • +సం 29:12

లేవీయకాండం 23:40

అధస్సూచీలు

  • *

    లేదా “వాగు దగ్గరి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 8:15; ప్రక 7:9
  • +ద్వితీ 16:15
  • +నెహె 8:10

లేవీయకాండం 23:41

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 29:12

లేవీయకాండం 23:42

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 31:10, 11

లేవీయకాండం 23:43

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 12:37, 38; సం 24:5
  • +ద్వితీ 31:13; కీర్త 78:6

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

లేవీ. 23:2నిర్గ 23:14; లేవీ 23:37; సం 10:10
లేవీ. 23:3నిర్గ 16:30; 20:10; అపొ 15:21
లేవీ. 23:3నెహె 13:22
లేవీ. 23:5సం 9:2, 3; 28:16
లేవీ. 23:5నిర్గ 12:3, 6; ద్వితీ 16:1; 1కొ 5:7
లేవీ. 23:6సం 28:17; 1కొ 5:8
లేవీ. 23:6నిర్గ 12:15; 13:6; 34:18
లేవీ. 23:7నిర్గ 12:16
లేవీ. 23:101కొ 15:20, 23
లేవీ. 23:10సం 18:8, 12; సామె 3:9; యెహె 44:30
లేవీ. 23:15నిర్గ 34:22; ద్వితీ 16:9, 10
లేవీ. 23:16అపొ 2:1
లేవీ. 23:16సం 28:26-31; ద్వితీ 16:16
లేవీ. 23:17లేవీ 7:11, 13
లేవీ. 23:17నిర్గ 23:16; 34:22
లేవీ. 23:18సం 28:26, 27
లేవీ. 23:19లేవీ 4:23
లేవీ. 23:19లేవీ 3:1
లేవీ. 23:20లేవీ 7:34; 10:14; సం 18:9; ద్వితీ 18:4; 1కొ 9:13
లేవీ. 23:21సం 10:10
లేవీ. 23:22లేవీ 19:9; ద్వితీ 24:19; రూతు 2:2, 3
లేవీ. 23:22లేవీ 19:33
లేవీ. 23:22యెష 58:7
లేవీ. 23:24సం 10:10
లేవీ. 23:27నిర్గ 30:10
లేవీ. 23:27సం 29:7
లేవీ. 23:28లేవీ 16:34; హెబ్రీ 9:12, 24-26; 10:10; 1యో 2:1, 2
లేవీ. 23:29సం 9:13; 15:30
లేవీ. 23:32లేవీ 16:29-31; సం 29:7
లేవీ. 23:34నిర్గ 23:16; సం 29:12; ద్వితీ 16:13; ఎజ్రా 3:4; నెహె 8:14-18; యోహా 7:2
లేవీ. 23:36నెహె 8:18
లేవీ. 23:37సం 28:26; 29:7
లేవీ. 23:37నిర్గ 23:14; ద్వితీ 16:16
లేవీ. 23:37లేవీ 1:3
లేవీ. 23:37లేవీ 2:1, 11
లేవీ. 23:37సం 15:5; 28:6, 7
లేవీ. 23:38నిర్గ 16:23; 31:13
లేవీ. 23:38నిర్గ 28:38; సం 18:29
లేవీ. 23:38ద్వితీ 12:11
లేవీ. 23:38సం 29:39; ద్వితీ 12:6; 1ది 29:9; 2ది 35:8; ఎజ్రా 2:68
లేవీ. 23:39ద్వితీ 16:13
లేవీ. 23:39సం 29:12
లేవీ. 23:40నెహె 8:15; ప్రక 7:9
లేవీ. 23:40ద్వితీ 16:15
లేవీ. 23:40నెహె 8:10
లేవీ. 23:41సం 29:12
లేవీ. 23:42ద్వితీ 31:10, 11
లేవీ. 23:43నిర్గ 12:37, 38; సం 24:5
లేవీ. 23:43ద్వితీ 31:13; కీర్త 78:6
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
  • 41
  • 42
  • 43
  • 44
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
లేవీయకాండం 23:1-44

లేవీయకాండం

23 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 2 “నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఆయా కాలాల్లో మీరు చాటించాల్సిన యెహోవా పండుగలు+ పవిత్రమైన సమావేశాలు. ఆయా కాలాల్లో మీరు ఆచరించాల్సిన నా పండుగలు ఇవి:

3 “ ‘మీరు ఆరు రోజులు పనిచేయవచ్చు, కానీ ఏడో రోజు పూర్తి విశ్రాంతి రోజుగా ఉంటుంది,+ అది పవిత్రమైన సమావేశ రోజు. ఆ రోజు మీరు ఎలాంటి పనీ చేయకూడదు. మీరు ఎక్కడ నివసించినా, దాన్ని యెహోవాకు విశ్రాంతి రోజుగా ఆచరించాలి.+

4 “ ‘ఆయా కాలాల్లో యెహోవాకు ఆచరించాల్సిన పండుగలు, అంటే వాటివాటి నియమిత సమయాల్లో మీరు చాటించాల్సిన పవిత్రమైన సమావేశాలు ఇవి: 5 మొదటి నెల, 14వ రోజున,+ సంధ్య వెలుగు సమయంలో* మీరు యెహోవాకు పస్కా పండుగ ఆచరించాలి.+

6 “ ‘ఆ నెల 15వ రోజున మీరు యెహోవాకు పులవని రొట్టెల పండుగ ఆచరించాలి.+ మీరు ఏడురోజుల పాటు పులవని రొట్టెలు తినాలి.+ 7 మొదటి రోజు మీరు పవిత్రమైన సమావేశం జరుపుకుంటారు.+ ఆ రోజు మీరు ఎలాంటి కష్టమైన పనీ చేయకూడదు. 8 ఏడురోజులు మీరు యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణను తీసుకురావాలి. ఏడో రోజు పవిత్రమైన సమావేశం ఉంటుంది. ఆ రోజు మీరు ఎలాంటి కష్టమైన పనీ చేయకూడదు.’ ”

9 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 10 “నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘నేను మీకు ఇస్తున్న దేశానికి మీరు వచ్చి అక్కడ కోత కోసిన తర్వాత, మీరు కోసిన మొదటి పంటలోని* ఒక పనను*+ యాజకుని దగ్గరికి తీసుకురావాలి.+ 11 అతను ఆ పనను యెహోవా ఎదుట ముందుకు, వెనుకకు కదిలిస్తాడు. అప్పుడు మీరు దేవుని ఆమోదం పొందుతారు. యాజకుడు విశ్రాంతి రోజు తర్వాతి రోజున దాన్ని అలా కదిలించాలి. 12 అతను మీ కోసం పనను కదిలించిన రోజు మీరు ఏ లోపంలేని ఏడాది పొట్టేలును యెహోవాకు దహనబలిగా అర్పించాలి. 13 దానితోపాటు ధాన్యార్పణగా ఈఫాలో రెండు పదోవంతుల* మెత్తని పిండిని నూనె కలిపి తీసుకురావాలి, అది యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణ, ఇంపైన* సువాసన. అలాగే హిన్‌లో* నాలుగో వంతు ద్రాక్షారసాన్ని పానీయార్పణగా తీసుకురావాలి. 14 ఆ రోజు వరకు, అంటే మీ దేవుని అర్పణను తీసుకొచ్చే రోజు వరకు మీరు కొత్త ధాన్యాన్ని గానీ, వేయించిన ధాన్యాన్ని గానీ తినకూడదు, లేదా కొత్త ధాన్యంతో రొట్టెలు చేసుకొని తినకూడదు. మీరు ఎక్కడ నివసించినా, తరతరాలు పాటించాల్సిన శాశ్వత శాసనం ఇది.

15 “ ‘విశ్రాంతి రోజు తర్వాతి రోజు నుండి, అంటే అల్లాడించే అర్పణ కోసం మీరు పనను తీసుకొచ్చిన రోజు నుండి ఏడు విశ్రాంతి రోజుల్ని లెక్కించాలి.+ ఏడు పూర్తి వారాల్ని లెక్కించాలి. 16 ఏడో విశ్రాంతి రోజు తర్వాతి రోజు వరకు మొత్తం 50 రోజుల్ని+ మీరు లెక్కించాలి, తర్వాత మీరు యెహోవాకు కొత్త ధాన్యార్పణను తీసుకురావాలి.+ 17 మీరు మీ నివాస స్థలాల నుండి రెండు రొట్టెల్ని అల్లాడించే అర్పణగా తీసుకురావాలి. ఈఫాలో రెండు పదోవంతుల* మెత్తని పిండితో ఆ రొట్టెల్ని చేయాలి. మీరు వాటిని పులుపు కలిపి తయారుచేయాలి,+ అది మొదట పండిన పంట నుండి యెహోవాకు ఇచ్చే అర్పణగా ఉంటుంది.+ 18 ఆ రొట్టెలతో పాటు ఏ లోపంలేని ఏడు ఏడాది మగ గొర్రెపిల్లల్ని, ఒక కోడెదూడను, రెండు పొట్టేళ్లను మీరు తీసుకురావాలి.+ ధాన్యార్పణ, పానీయార్పణలతో పాటు అవి యెహోవాకు దహనబలిగా ఉంటాయి, అది యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణ, ఇంపైన* సువాసన. 19 మీరు పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను,+ సమాధాన బలిగా+ రెండు ఏడాది మగ గొర్రెపిల్లల్ని అర్పించాలి. 20 మొదట పండిన పంటతో తయారుచేసిన రొట్టెలతో పాటు యాజకుడు ఆ రెండు మగ గొర్రెపిల్లల్ని యెహోవాకు అల్లాడించే అర్పణగా ముందుకు, వెనుకకు కదిలిస్తాడు. అవి యెహోవాకు అతి పవిత్రమైనవిగా ఉంటాయి, అవి యాజకునికి చెందుతాయి.+ 21 ఆ రోజున ఒక పవిత్రమైన సమావేశం జరుగుతుందని మీరు చాటింపు వేస్తారు.+ ఆ రోజు మీరు ఏ కష్టమైన పనీ చేయకూడదు. మీరు ఎక్కడ నివసించినా, తరతరాలు పాటించాల్సిన శాశ్వత శాసనం ఇది.

22 “ ‘మీరు మీ పంటను కోస్తున్నప్పుడు, మీ పొలాల్ని గట్టుదాకా కోయకూడదు, అంతేకాదు మీరు మీ పంటలో పరిగెను ఏరుకోకూడదు.+ పేదవాళ్ల* కోసం, పరదేశుల+ కోసం వాటిని వదిలేయాలి.+ నేను మీ దేవుడైన యెహోవాను.’ ”

23 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 24 “నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఏడో నెల, మొదటి రోజున మీరు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి; అది పవిత్రమైన సమావేశ రోజని మీరు గుర్తుచేసుకోవడానికి ఆ రోజున బాకా శబ్దంతో చాటింపు వేయబడుతుంది.+ 25 మీరు ఆ రోజు కష్టమైన ఏ పనీ చేయకూడదు; ఆ రోజు మీరు యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణను తీసుకొస్తారు.’ ”

26 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 27 “ఏడో నెల, పదో రోజు ప్రాయశ్చిత్త రోజుగా ఉంటుంది.+ ఆ రోజు మీరు పవిత్రమైన సమావేశం జరుపుకోవాలి, మీ పాపాల విషయంలో దుఃఖాన్ని వ్యక్తం చేయాలి,*+ అలాగే యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణను తీసుకురావాలి. 28 ఆ రోజు మీరు ఎలాంటి పనీ చేయకూడదు, ఎందుకంటే అది ప్రాయశ్చిత్త రోజు, ఆ రోజున మీ దేవుడైన యెహోవా ముందు మీకోసం ప్రాయశ్చిత్తం చేయబడుతుంది.+ 29 ఆ రోజు ఎవరైనా తన పాపాల విషయంలో దుఃఖాన్ని వ్యక్తం చేయకపోతే,* అతను తన ప్రజల్లో నుండి కొట్టివేయబడతాడు.*+ 30 ఆ రోజు ఏ పనైనా చేసే ప్రతీ వ్యక్తిని తన ప్రజల్లో ఉండకుండా నాశనం చేస్తాను. 31 ఆ రోజు మీరు ఏ పనీ చేయకూడదు. మీరు ఎక్కడ నివసించినా, తరతరాలు పాటించాల్సిన శాశ్వత శాసనం ఇది. 32 అది మీకు పూర్తి విశ్రాంతి రోజుగా ఉంటుంది. ఆ నెల తొమ్మిదో రోజు సాయంత్రం మీరు మీ పాపాల విషయంలో దుఃఖాన్ని వ్యక్తం చేస్తారు.+ ఆ రోజు సాయంత్రం నుండి మరుసటి రోజు సాయంత్రం వరకు మీరు విశ్రాంతి రోజును ఆచరించాలి.”

33 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 34 “నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఏడో నెల, 15వ రోజు నుండి ఏడురోజుల పాటు మీరు యెహోవాకు పర్ణశాలల* పండుగను ఆచరించాలి.+ 35 మొదటి రోజున మీరు పవిత్రమైన సమావేశం జరుపుకోవాలి; ఆ రోజు మీరు కష్టమైన ఏ పనీ చేయకూడదు. 36 ఏడురోజులు మీరు యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణను తీసుకురావాలి. ఎనిమిదో రోజు మీరు పవిత్రమైన సమావేశం జరుపుకోవాలి,+ యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణను తీసుకురావాలి. అది ప్రత్యేక సమావేశ రోజు. ఆ రోజు మీరు కష్టమైన ఏ పనీ చేయకూడదు.

37 “ ‘ఇవి ఆయా కాలాల్లో పవిత్రమైన సమావేశాలుగా+ మీరు చాటించాల్సిన యెహోవా పండుగలు.+ ఆ పండుగల్లో మీరు యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణగా వీటిని తీసుకురావాలి: ఏ రోజుకు కావాల్సిన విధంగా ఆ రోజుకు దహనబలి,+ దానితోపాటు ఇచ్చే ధాన్యార్పణ,+ పానీయార్పణ.+ 38 యెహోవా విశ్రాంతి రోజుల్లో+ మీరు అర్పించే అర్పణలకు, అలాగే మీ కానుకలకు,+ మొక్కుబడి అర్పణలకు,+ మీ స్వేచ్ఛార్పణలకు+ అదనంగా వాటిని యెహోవాకు అర్పించాలి. 39 అయితే ఏడో నెల, 15వ రోజున పంటను సమకూర్చుకున్నప్పుడు మీరు ఏడురోజులు యెహోవాకు పండుగ జరుపుకోవాలి.+ మొదటి రోజున, ఎనిమిదో రోజున పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి.+ 40 మొదటి రోజున మీరు శ్రేష్ఠమైన ఫలాల్ని, ఖర్జూర మట్టల్ని,+ ఆకులున్న కొమ్మల్ని, లోయలోని* నిరవంజి చెట్ల కొమ్మల్ని తీసుకురావాలి. మీరు ఏడురోజుల పాటు+ మీ దేవుడైన యెహోవా ముందు సంతోషిస్తారు.+ 41 ప్రతీ సంవత్సరం ఏడురోజుల పాటు మీరు దాన్ని యెహోవాకు పండుగగా జరుపుకుంటారు.+ మీరు దాన్ని ఏడో నెలలో జరుపుకోవాలి, ఇది మీరు తరతరాలు పాటించాల్సిన శాశ్వత శాసనం. 42 మీరు ఏడురోజుల పాటు పర్ణశాలల్లో నివసించాలి.+ ఇశ్రాయేలీయులందరూ పర్ణశాలల్లో నివసించాలి. 43 దానివల్ల, ఐగుప్తు దేశం నుండి నేను ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకొస్తున్నప్పుడు వాళ్లను పర్ణశాలల్లో నివసింపజేశానని+ మీ భావి తరాలవాళ్లు తెలుసుకోగలుగుతారు.+ నేను మీ దేవుడైన యెహోవాను.’ ”

44 కాబట్టి మోషే, ఆయా కాలాల్లో యెహోవా కోసం జరుపుకోవాల్సిన పండుగల గురించి ఇశ్రాయేలీయులకు చెప్పాడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి