నహూము
2 చెదరగొట్టే వ్యక్తి నీ* మీదికి వస్తున్నాడు.+
ప్రాకారాల్ని కాపాడుకో.
దారిని కనిపెట్టుకో.
నడుం కట్టుకొని బలమంతా కూడదీసుకో.
2 యెహోవా యాకోబు వైభవాన్ని,
ఇశ్రాయేలు వైభవమంత చేస్తాడు.
ఎందుకంటే, నాశకులు వాళ్లను నాశనం చేశారు;+
వాళ్ల కొమ్మల్ని పాడుచేశారు.
3 అతని శూరుల డాళ్లు ఎర్రగా ఉన్నాయి,
అతని యోధులు ముదురు ఎరుపు బట్టలు వేసుకున్నారు.
అతను యుద్ధానికి సన్నద్ధమైన రోజున
అతని యుద్ధ రథాల ఇనుప భాగాలు అగ్నిలా మెరుస్తున్నాయి,
సరళవృక్షాల* చెక్కతో చేసిన ఈటెలు ఆడుతున్నాయి.
4 యుద్ధ రథాలు వీధుల్లో వెర్రిగా పరుగులు తీస్తున్నాయి.
అవి సంతవీధుల్లో అటూఇటూ పరుగులు పెడుతున్నాయి.
అవి మండుతున్న కాగడాల్లా వెలుగుతున్నాయి, మెరుపుల్లా ప్రకాశిస్తున్నాయి.
5 అతను తన అధికారుల్ని పిలిపిస్తాడు.
వాళ్లు తడబడుతూ నడుస్తారు.
వాళ్లు ఆమె ప్రాకారాల వైపు దూసుకొస్తారు;
అడ్డుగోడలు నిలబెడతారు.
7 ఈ సంగతి నిర్ణయించబడింది: ఆమె సంగతి బట్టబయలౌతుంది,
ఆమెను మోసుకెళ్తారు,
ఆమె సేవకురాళ్లు బాధతో గుండెలు బాదుకుంటూ పావురాల్లా మూల్గుతారు.
8 తన రోజులన్నిట్లో నీనెవె+ నీటి మడుగులా ఉంది,
కానీ ఇప్పుడు వాళ్లు పారిపోతున్నారు.
“ఆగండి! ఆగండి!” అని పిలుస్తున్నా
ఎవ్వరూ వెనక్కి తిరగట్లేదు.+
9 వెండిని, బంగారాన్ని కొల్లగొట్టండి!
సంపదలకు అంతే లేదు.
అక్కడ అన్నిరకాల ప్రశస్త వస్తువులు ఉన్నాయి.
10 నగరం ఖాళీగా, నిర్మానుష్యంగా ఉంది; అది పాడైపోయింది!+
భయంతో వాళ్ల గుండెలు కరిగిపోయాయి, వాళ్ల మోకాళ్లు అదురుతున్నాయి, వాళ్ల తుంట్లు వణుకుతున్నాయి;
వాళ్ల ముఖాలన్నీ పాలిపోయాయి.
11 సింహాలు+ విశ్రమించే చోటు ఎక్కడ? కొదమ సింహాలు తినే చోటు ఎక్కడ?
సింహం ఎవరికీ భయపడకుండా
తన పిల్లల్ని తీసుకెళ్లే చోటు ఎక్కడ?
12 సింహం తన పిల్లల కోసం చాలినంత ఎరను చీల్చింది,
తన ఆడ సింహాల కోసం జంతువుల గొంతును నొక్కిపట్టింది.
అది వేటాడిన జంతువులతో తన గుహను,
చీల్చేసిన జంతువులతో తన విశ్రాంతి స్థలాల్ని నింపేసింది.
13 సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఇదిగో! నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను,+
నేను ఆమె యుద్ధ రథాల్ని కాల్చేస్తాను, వాటి పొగ పైకి లేస్తుంది,+
ఖడ్గం నీ కొదమ సింహాల్ని మింగేస్తుంది.
నేను నీ ఎరను భూమ్మీద లేకుండా చేస్తాను,
నీ సందేశకుల శబ్దం ఎప్పటికీ వినిపించదు.”+