కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • అపొస్తలుల కార్యాలు 23
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

అపొస్తలుల కార్యాలు విషయసూచిక

      • పౌలు మహాసభ ముందు మాట్లాడడం (1-10)

      • ప్రభువు పౌలును బలపర్చడం (11)

      • పౌలును చంపడానికి కుట్ర (12-22)

      • పౌలును కైసరయకు పంపించడం (23-35)

అపొస్తలుల కార్యాలు 23:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 24:15, 16; 2కొ 1:12; హెబ్రీ 13:18; 1పే 3:16

అపొస్తలుల కార్యాలు 23:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 187

అపొస్తలుల కార్యాలు 23:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 22:28

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 187

    కావలికోట,

    11/1/2002, పేజీ 5

    2/1/1991, పేజీ 14

అపొస్తలుల కార్యాలు 23:6

అధస్సూచీలు

  • *

    లేదా “మృతుల పునరుత్థానాన్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 26:4, 5; ఫిలి 3:4, 5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీలు 187-188

    కావలికోట,

    4/15/2005, పేజీ 31

అపొస్తలుల కార్యాలు 23:8

అధస్సూచీలు

  • *

    పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

  • *

    లేదా “బహిరంగంగా ప్రకటిస్తారు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 4:1, 2

అపొస్తలుల కార్యాలు 23:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 22:6, 7, 17, 18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 188

అపొస్తలుల కార్యాలు 23:10

అధస్సూచీలు

  • *

    ఇతని కింద 1,000 మంది సైనికులు ఉండేవాళ్లు.

అపొస్తలుల కార్యాలు 23:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 18:9
  • +అపొ 27:23, 24; 28:23, 30, 31

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీలు 189-191

    కావలికోట (అధ్యయన),

    11/2020, పేజీ 13

    కావలికోట,

    2/1/1991, పేజీ 15

అపొస్తలుల కార్యాలు 23:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2019), 1/2019, పేజీ 3

అపొస్తలుల కార్యాలు 23:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    1/2019, పేజీ 3

అపొస్తలుల కార్యాలు 23:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 23:15

అపొస్తలుల కార్యాలు 23:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 23:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీలు 190-191

అపొస్తలుల కార్యాలు 23:23

అధస్సూచీలు

  • *

    అక్ష., “మూడో గంట అప్పుడు.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 191

అపొస్తలుల కార్యాలు 23:25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/2001, పేజీ 22

అపొస్తలుల కార్యాలు 23:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 16:37; 22:25
  • +అపొ 21:31-33

అపొస్తలుల కార్యాలు 23:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 22:30

అపొస్తలుల కార్యాలు 23:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 25:19

అపొస్తలుల కార్యాలు 23:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 23:16

అపొస్తలుల కార్యాలు 23:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 23:23, 24

అపొస్తలుల కార్యాలు 23:34

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 21:39; 22:3

అపొస్తలుల కార్యాలు 23:35

అధస్సూచీలు

  • *

    లేదా “ప్రేతోర్యంలో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 24:1

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

అపొ. 23:1అపొ 24:15, 16; 2కొ 1:12; హెబ్రీ 13:18; 1పే 3:16
అపొ. 23:5నిర్గ 22:28
అపొ. 23:6అపొ 26:4, 5; ఫిలి 3:4, 5
అపొ. 23:8అపొ 4:1, 2
అపొ. 23:9అపొ 22:6, 7, 17, 18
అపొ. 23:11అపొ 18:9
అపొ. 23:11అపొ 27:23, 24; 28:23, 30, 31
అపొ. 23:20అపొ 23:15
అపొ. 23:21అపొ 23:12
అపొ. 23:27అపొ 16:37; 22:25
అపొ. 23:27అపొ 21:31-33
అపొ. 23:28అపొ 22:30
అపొ. 23:29అపొ 25:19
అపొ. 23:30అపొ 23:16
అపొ. 23:31అపొ 23:23, 24
అపొ. 23:34అపొ 21:39; 22:3
అపొ. 23:35అపొ 24:1
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
అపొస్తలుల కార్యాలు 23:1-35

అపొస్తలుల కార్యాలు

23 పౌలు మహాసభలోని వాళ్లవైపు సూటిగా చూస్తూ, “సహోదరులారా, ఈ రోజు వరకు నేను దేవుని ముందు ఏ తప్పూ చేయకుండా నడుచుకున్నానని నా మనస్సాక్షి+ నాకు చెప్తుంది” అని అన్నాడు. 2 అప్పుడు ప్రధానయాజకుడు అననీయ, పౌలును నోటి మీద కొట్టమని పౌలు పక్కన నిలబడివున్న వాళ్లకు ఆజ్ఞాపించాడు. 3 దానికి పౌలు అతనితో, “సున్నం కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొడతాడు. ధర్మశాస్త్రం ప్రకారం నాకు తీర్పు తీర్చడానికి కూర్చున్న నువ్వు, నన్ను కొట్టమని ఆజ్ఞాపించి ధర్మశాస్త్రాన్ని మీరతావా?” అన్నాడు. 4 అప్పుడు అతని పక్కన నిలబడి ఉన్నవాళ్లు, “నువ్వు దేవుని ప్రధానయాజకుణ్ణి అవమానిస్తున్నావా?” అన్నారు. 5 అందుకు పౌలు, “సహోదరులారా, అతను ప్రధానయాజకుడని నాకు తెలీదు. ఎందుకంటే, ‘నీ ప్రజల అధికారి గురించి అవమానకరంగా మాట్లాడకూడదు’ అని రాయబడి ఉంది”+ అన్నాడు.

6 అక్కడున్నవాళ్లలో సగం మంది సద్దూకయ్యులు, సగం మంది పరిసయ్యులు అని తెలిసి పౌలు మహాసభలో బిగ్గరగా ఇలా అన్నాడు: “సహోదరులారా, నేనొక పరిసయ్యుణ్ణి.+ పరిసయ్యుల కుటుంబంలో పుట్టాను. నేను చనిపోయినవాళ్లు తిరిగి బ్రతుకుతారనే బోధను* నమ్ముతాను, అందుకే ఇప్పుడు నాకు తీర్పు జరుగుతోంది.” 7 అతను అలా అనేసరికి పరిసయ్యులకు, సద్దూకయ్యులకు మధ్య గొడవ మొదలైంది. దాంతో వాళ్లు రెండుగా విడిపోయారు. 8 ఎందుకంటే, సద్దూకయ్యులు పునరుత్థానం గానీ, దేవదూతలు గానీ, అదృశ్యప్రాణులు* గానీ లేవని నమ్ముతారు. పరిసయ్యులు మాత్రం అవన్నీ ఉన్నాయని నమ్ముతారు.*+ 9 కాబట్టి అక్కడ పెద్ద అలజడి రేగింది. పరిసయ్యుల తెగకు చెందిన కొంతమంది శాస్త్రులు లేచి చాలా కోపంగా ఇలా వాదించడం మొదలుపెట్టారు: “ఇతనిలో మాకు ఏ తప్పూ కనిపించలేదు. ఒకవేళ అతనితో ఒక అదృశ్యప్రాణి గానీ, దేవదూత గానీ మాట్లాడివుంటే+—.” 10 గొడవ ఇంకా పెద్దదయ్యేసరికి, వాళ్లు పౌలును చంపేస్తారేమోనని సహస్రాధిపతి* భయపడ్డాడు. కాబట్టి వాళ్ల దగ్గరికి వెళ్లి, వాళ్ల మధ్య నుండి పౌలును లాక్కొచ్చి సైనికుల కోటలోకి తీసుకెళ్లమని సహస్రాధిపతి సైనికులకు ఆజ్ఞాపించాడు.

11 అయితే ఆ రాత్రి, ప్రభువు పౌలు పక్కన నిలబడి, “ధైర్యంగా ఉండు!+ నువ్వు నా గురించి యెరూషలేములో పూర్తిస్థాయిలో సాక్ష్యమిచ్చినట్టే రోములో కూడా సాక్ష్యమివ్వాలి”+ అని చెప్పాడు.

12 తెల్లవారినప్పుడు యూదులు పౌలు మీద కుట్రపన్నారు. అతన్ని చంపేంతవరకు తాము ఏమైనా తిన్నా, తాగినా తమ మీదికి శాపం రావాలని ఒట్టు పెట్టుకున్నారు. 13 అలా ఒట్టు పెట్టుకున్నవాళ్లు 40 కన్నా ఎక్కువమంది. 14 వాళ్లు ముఖ్య యాజకుల దగ్గరికి, పెద్దల దగ్గరికి వెళ్లి ఇలా అన్నారు: “పౌలును చంపేంతవరకు మేము ఏమైనా తింటే మా మీదికి శాపం రావాలని ఒట్టు పెట్టుకున్నాం. 15 కాబట్టి ఇప్పుడు మీరూ, మహాసభ వాళ్లూ కలిసి సహస్రాధిపతి దగ్గరికి వెళ్లి పౌలును మీ దగ్గరికి తీసుకురమ్మని అడగండి. మీరు పౌలును ఇంకా పూర్తిస్థాయిలో విచారణ చేయాలని అనుకుంటున్నట్టు చెప్పండి. అయితే అతను మీ దగ్గరికి రాకముందే అతన్ని చంపేయడానికి మేము సిద్ధంగా ఉంటాం.”

16 అయితే వాళ్లు పౌలు కోసం మాటు వేయడానికి పథకం వేస్తున్నారని పౌలు మేనల్లుడు విని, సైనికుల కోటలోకి వెళ్లి దాని గురించి పౌలుకు చెప్పాడు. 17 అప్పుడు పౌలు ఒక సైనికాధికారిని పిలిచి, “ఈ యువకుడు సహస్రాధిపతికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాడు, ఇతన్ని సహస్రాధిపతి దగ్గరికి తీసుకెళ్లు” అని చెప్పాడు. 18 దాంతో సైనికాధికారి ఆ యువకుణ్ణి సహస్రాధిపతి దగ్గరికి తీసుకెళ్లి ఇలా అన్నాడు: “చెరసాలలో ఉన్న పౌలు నన్ను పిలిచి, ఈ యువకుణ్ణి నీ దగ్గరికి తీసుకెళ్లమన్నాడు. ఇతను నీతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు.” 19 సహస్రాధిపతి ఆ యువకుడి చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకెళ్లి, “నువ్వు నాతో ఏమి చెప్పాలనుకుంటున్నావు?” అని అడిగాడు. 20 అప్పుడు ఆ యువకుడు ఇలా చెప్పాడు: “పౌలును ఇంకొన్ని ప్రశ్నలు అడగడం కోసం అన్నట్టు, అతన్ని రేపు మహాసభ దగ్గరికి తీసుకురమ్మని నిన్ను వేడుకోవాలని యూదులు ఒక నిర్ణయానికి వచ్చారు.+ 21 వాళ్లు అడిగే దానికి నువ్వు ఒప్పుకోవద్దు. 40 కన్నా ఎక్కువమంది పౌలు కోసం మాటువేసి ఉన్నారు. పౌలును చంపేంతవరకు తాము ఏమైనా తిన్నా, తాగినా తమ మీదికి శాపం రావాలని వాళ్లు ఒట్టు పెట్టుకున్నారు.+ ఇప్పుడు వాళ్లు సిద్ధంగా ఉన్నారు, నీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు.” 22 దాంతో సహస్రాధిపతి, “దీని గురించి నువ్వు నాతో చెప్పినట్టు ఎవరితో అనకు” అని ఆజ్ఞాపించి ఆ యువకుణ్ణి పంపించేశాడు.

23 తర్వాత, సహస్రాధిపతి ఇద్దరు సైనికాధికారుల్ని పిలిపించి ఇలా చెప్పాడు: “రాత్రి దాదాపు తొమ్మిదింటికి* కైసరయ వరకు వెళ్లడానికి 200 మంది సైనికుల్ని, 70 మంది గుర్రపురౌతుల్ని, 200 మంది ఈటెలు పట్టుకున్న సైనికుల్ని సిద్ధం చేయండి. 24 అలాగే అధిపతైన ఫేలిక్సు దగ్గరికి పౌలు క్షేమంగా చేరుకునేలా, అతన్ని తీసుకెళ్లడానికి గుర్రాల్ని కూడా సిద్ధం చేయండి.” 25 తర్వాత సహస్రాధిపతి ఇలా ఉత్తరం రాశాడు:

26 “గౌరవనీయుడైన అధిపతి ఫేలిక్సుకు క్లౌదియ లూసియ రాస్తున్న ఉత్తరం: నీకు శుభాకాంక్షలు! 27 యూదులు ఈ వ్యక్తిని పట్టుకొని, చంపబోయారు. అయితే ఇతను ఒక రోమా పౌరుడని నాకు తెలిసింది.+ కాబట్టి నేను నా సైనికులతో త్వరగా వెళ్లి ఇతన్ని కాపాడాను.+ 28 వాళ్లు ఇతన్ని నిందించడానికి కారణం ఏమిటో తెలుసుకోవాలని, నేను ఇతన్ని వాళ్ల మహాసభకు+ తీసుకెళ్లాను. 29 వాళ్లు తమ ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాల గురించి+ ఇతన్ని నిందిస్తున్నారని నేను తెలుసుకున్నాను. అయితే మరణశిక్ష విధించడానికి గానీ, చెరసాలలో వేయడానికి గానీ సరిపోయే ఏ ఒక్క నేరం ఇతని మీద మోపబడలేదు. 30 కానీ వాళ్లు ఇతన్ని చంపడానికి కుట్ర చేస్తున్నారని నాకు తెలిసింది+ కాబట్టి ఉన్నపళంగా ఇతన్ని నీ దగ్గరికి పంపిస్తున్నాను. ఇతని మీద ఏమైనా చెప్పాలంటే నీ ముందు చెప్పమని ఇతన్ని నిందిస్తున్నవాళ్లను ఆదేశించాను.”

31 కాబట్టి సైనికులు తమకు ఇవ్వబడిన ఆదేశాల ప్రకారం రాత్రిపూట పౌలును తీసుకొని+ అంతిపత్రికి చేరుకున్నారు. 32 తర్వాతి రోజు గుర్రపురౌతులు పౌలుతోపాటు వెళ్లారు. మిగతా సైనికులు, సైనికుల కోటకు తిరిగెళ్లారు. 33 రౌతులు కైసరయలోకి ప్రవేశించి, అధిపతికి ఆ ఉత్తరాన్ని అందజేశారు. వాళ్లు పౌలును కూడా అతనికి అప్పగించారు. 34 అధిపతి ఆ ఉత్తరం చదివి, పౌలు ఏ ప్రాంతానికి చెందినవాడో అడిగి, అతను కిలికియకు+ చెందినవాడని తెలుసుకున్నాడు. 35 తర్వాత అతను ఇలా అన్నాడు: “నిన్ను నిందిస్తున్నవాళ్లు వచ్చినప్పుడు+ నీ విషయం గురించి పూర్తిగా వింటాను.” పౌలును హేరోదు రాజభవనంలో* కాపలావాళ్ల సంరక్షణలో ఉంచమని అతను ఆజ్ఞాపించాడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి