కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • జెకర్యా 13
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

జెకర్యా విషయసూచిక

      • విగ్రహాల్ని, అబద్ధ ప్రవక్తల్ని తొలగించడం (1-6)

        • అబద్ధ ప్రవక్తలు అవమానాల​పాలౌతారు (4-6)

      • కాపరి కొట్టబడతాడు (7-9)

        • మూడింట ఒక వంతు మంది శుద్ధిచేయబడతారు (9)

జెకర్యా 13:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 36:25, 29

జెకర్యా 13:2

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 23:13
  • +ద్వితీ 13:5

జెకర్యా 13:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 13:6-9; 18:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/1/2007, పేజీ 11

జెకర్యా 13:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 1:8; మత్త 3:4

జెకర్యా 13:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2015, పేజీలు 15-16

జెకర్యా 13:6

అధస్సూచీలు

  • *

    అంటే, ఛాతిమీద లేదా వీపుమీద.

  • *

    లేదా “నన్ను ప్రేమించేవాళ్ల.”

జెకర్యా 13:7

అధస్సూచీలు

  • *

    లేదా “గొర్రెల్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 34:23; మీకా 5:4; యోహా 10:11; హెబ్రీ 13:20
  • +యెష 53:8; దాని 9:26; అపొ 3:18
  • +మత్త 26:31, 55, 56; మార్కు 14:27, 50; యోహా 16:32

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 146

    కావలికోట,

    8/15/2011, పేజీలు 13-14

    యెహోవా మహా దినం, పేజీ 55

జెకర్యా 13:8

అధస్సూచీలు

  • *

    లేదా “చనిపోతారు.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/1/2007, పేజీ 11

జెకర్యా 13:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మలా 3:2, 3
  • +యిర్మీ 30:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/1/2007, పేజీ 11

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

జెక. 13:1యెహె 36:25, 29
జెక. 13:2నిర్గ 23:13
జెక. 13:2ద్వితీ 13:5
జెక. 13:3ద్వితీ 13:6-9; 18:20
జెక. 13:42రా 1:8; మత్త 3:4
జెక. 13:7యెహె 34:23; మీకా 5:4; యోహా 10:11; హెబ్రీ 13:20
జెక. 13:7యెష 53:8; దాని 9:26; అపొ 3:18
జెక. 13:7మత్త 26:31, 55, 56; మార్కు 14:27, 50; యోహా 16:32
జెక. 13:9మలా 3:2, 3
జెక. 13:9యిర్మీ 30:22
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
జెకర్యా 13:1-9

జెకర్యా

13 “ఆ రోజున దావీదు ఇంటివాళ్లు, యెరూషలేము నివాసులు తమ పాపాన్ని, మలినాన్ని కడిగేసుకునేలా ఒక బావి తవ్వబడుతుంది.”+

2 సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “ఆ రోజున, నేను దేశంలో నుండి విగ్రహాల పేర్లను తుడిచేస్తాను,+ ప్రజలు వాటిని ఇంకెప్పుడూ గుర్తుచేసుకోరు; నేను దేశంలో నుండి ప్రవక్తల్ని, చెడ్డదూతల* శక్తిని తీసేస్తాను.+ 3 ఒకవేళ ఎవరైనా మళ్లీ ప్రవచిస్తే, అతన్ని కన్న తల్లిదండ్రులు అతనితో ఇలా అంటారు: ‘నువ్వు ప్రాణాలతో ఉండవు. ఎందుకంటే, నువ్వు యెహోవా పేరున అబద్ధాలు చెప్పావు.’ అతనలా ప్రవచించినందుకు అతన్ని కన్న తల్లిదండ్రులే అతన్ని పొడుస్తారు.+

4 “ఆ రోజున, ప్రవక్తల్లో ప్రతీ ఒక్కరు ప్రవచించేటప్పుడు తాము చూసిన దర్శనాన్ని బట్టి అవమానం పాలౌతారు; ప్రజల్ని మోసం చేయడం కోసం, వెంట్రుకలతో చేయబడిన అధికారిక వస్త్రాన్ని+ వాళ్లు ధరించరు. 5 వాళ్లలో ప్రతీ ఒక్కరు, ‘నేను ప్రవక్తను కాదు, నేను వ్యవసాయం చేసే రైతును, చిన్నప్పుడే నన్ను ఒక వ్యక్తి దాసునిగా కొనుక్కున్నాడు’ అంటారు. 6 ఎవరైనా అతన్ని, ‘నీ భుజాల మధ్య* ఈ గాయాలేంటి?’ అని అడిగితే, అతను ‘ఇవి నా స్నేహితుల* ఇంట్లో అయిన గాయాలు’ అంటాడు.”

 7 “ఖడ్గమా, నా కాపరి+ మీదికి లే!

నా సహవాసి మీదికి లే!

కాపరిని కొట్టు,+ మందను* చెదిరిపోనివ్వు;+

నేను నా చేతిని అల్పులైన వాళ్లమీదికి లేపుతాను” అని సైన్యాలకు అధిపతైన యెహోవా ప్రకటిస్తున్నాడు.

 8 సైన్యాలకు అధిపతైన యెహోవా ఇంకా ఇలా ప్రకటిస్తున్నాడు: “దేశమంతట్లో

మూడింట రెండు వంతుల మంది నరికేయబడి, నాశనమౌతారు;*

ఒక వంతు మంది విడిచిపెట్టబడతారు.

 9 నేను ఆ ఒక్క వంతు మందిని అగ్ని గుండా దాటించి

వెండిని శుద్ధి చేసినట్టు శుద్ధిచేస్తాను,

బంగారాన్ని పరీక్షించినట్టు పరీక్షిస్తాను.+

వాళ్లు నా పేరున ప్రార్థిస్తారు,

నేను వాళ్లకు జవాబిస్తాను.

‘వాళ్లు నా ప్రజలు’ అని నేను అంటాను,+

‘యెహోవా మా దేవుడు’ అని వాళ్లు అంటారు.”

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి