కీర్తనలు
118 యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన మంచివాడు;+
ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.
2 ఇశ్రాయేలు ఇలా అనాలి:
“ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.”
3 అహరోను ఇంటివాళ్లు ఇలా అనాలి:
“ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.”
4 యెహోవాకు భయపడేవాళ్లు ఇలా అనాలి:
“ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.”
5 కష్టకాలంలో నేను యెహోవాకు* మొరపెట్టాను;
యెహోవా* నాకు జవాబిచ్చాడు, సురక్షితమైన* స్థలంలోకి నన్ను తీసుకొచ్చాడు.+
6 యెహోవా నా పక్షాన ఉన్నాడు; నేను భయపడను.+
మనుషులు నన్నేమి చేయగలరు?+
8 మనుషుల్ని నమ్ముకోవడం కన్నా
యెహోవాను ఆశ్రయించడం మంచిది.+
9 అధిపతుల్ని నమ్ముకోవడం కన్నా+
యెహోవాను ఆశ్రయించడం మంచిది.
10 దేశాలన్నీ నన్ను చుట్టుముట్టాయి,
అయితే యెహోవా పేరున
నేను వాటిని తరిమికొట్టాను.+
11 వాళ్లు నన్ను చుట్టుముట్టారు,
అవును, అన్నివైపులా నన్ను చుట్టుముట్టారు,
అయితే నేను యెహోవా పేరున వాళ్లను తరిమికొట్టాను.
12 వాళ్లు కందిరీగల్లా నన్ను చుట్టుముట్టారు,
కానీ ముళ్లకంపలకు అంటుకున్న నిప్పులా వాళ్లు ఇట్టే ఆరిపోయారు.
యెహోవా పేరున
నేను వాళ్లను తరిమికొట్టాను.+
13 నేను పడిపోయేలా వాళ్లు* నన్ను గట్టిగా నెట్టారు,
అయితే యెహోవా నాకు సహాయం చేశాడు.
15 నీతిమంతుల డేరాల్లో
ఉత్సాహ ధ్వనులు, రక్షణ* ధ్వనులు వినిపిస్తాయి.
యెహోవా కుడిచెయ్యి తన శక్తిని ప్రదర్శిస్తోంది.+
16 యెహోవా కుడిచెయ్యి విజయంతో పైకెత్తబడింది;
యెహోవా కుడిచెయ్యి తన శక్తిని ప్రదర్శిస్తోంది.+
20 ఇది యెహోవా గుమ్మం.
నీతిమంతులు దీని గుండా ప్రవేశిస్తారు.+
21 నేను నిన్ను స్తుతిస్తాను, ఎందుకంటే నువ్వు నాకు జవాబిచ్చావు,+
నాకు రక్షణ అయ్యావు.
24 ఇది యెహోవా చేసిన రోజు;
ఈ రోజు మనం సంతోషించి, ఉల్లసిద్దాం.
25 యెహోవా, నిన్ను వేడుకుంటున్నాం, దయచేసి మమ్మల్ని రక్షించు!
యెహోవా, దయచేసి మాకు విజయాన్ని అనుగ్రహించు!
27 యెహోవాయే దేవుడు;
ఆయనే మనకు వెలుగు ఇస్తున్నాడు.+
28 నువ్వే నా దేవుడివి, నేను నిన్ను స్తుతిస్తాను;
నా దేవా, నేను నిన్ను ఘనపరుస్తాను.+