కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెహెజ్కేలు 34
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యెహెజ్కేలు విషయసూచిక

      • ఇశ్రాయేలు కాపరులకు వ్యతిరేకంగా ప్రవచనం (1-10)

      • తన గొర్రెల మీద యెహోవాకున్న శ్రద్ధ (11-31)

        • “నా సేవకుడైన దావీదు” వాటిని కాస్తాడు (23)

        • “ఒక శాంతి ఒప్పందం” (25)

యెహెజ్కేలు 34:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 23:1; మీకా 3:1, 11; జెఫ 3:3; జెక 11:17; మత్త 23:13
  • +యెష 40:11; యోహా 21:15

యెహెజ్కేలు 34:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 21:16; యిర్మీ 22:17; మీకా 3:3; జెక 11:4, 5
  • +యెష 56:11

యెహెజ్కేలు 34:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లూకా 15:4
  • +యిర్మీ 22:13

యెహెజ్కేలు 34:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 23:2; 50:6; మత్త 9:36

యెహెజ్కేలు 34:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 52:24-27

యెహెజ్కేలు 34:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 17:34, 35; యెష 56:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    యెహోవా దగ్గరకు తిరిగి రండి, పేజీ 4

యెహెజ్కేలు 34:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 40:11
  • +యోవే 2:1, 2; జెఫ 1:14, 15

యెహెజ్కేలు 34:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 11:17; ఆమో 9:14; మీకా 7:14

యెహెజ్కేలు 34:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 25:6; యిర్మీ 31:12
  • +యిర్మీ 33:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    యెహోవా దగ్గరకు తిరిగి రండి, పేజీ 5

యెహెజ్కేలు 34:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 3:15
  • +జెఫ 3:13

యెహెజ్కేలు 34:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మీకా 4:6; మత్త 15:24; లూకా 15:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    యెహోవా దగ్గరకు తిరిగి రండి, పేజీ 5

    కావలికోట,

    3/15/1996, పేజీ 25

యెహెజ్కేలు 34:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +జెక 10:3

యెహెజ్కేలు 34:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 40:11; యిర్మీ 23:3

యెహెజ్కేలు 34:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 10:11; హెబ్రీ 13:20; 1పే 5:4; ప్రక 7:17
  • +యెష 11:1
  • +యెహె 37:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/1/2007, పేజీ 26

    1/1/1993, పేజీ 19

యెహెజ్కేలు 34:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 31:1
  • +యెష 9:6; యిర్మీ 23:5; మీకా 5:2; లూకా 1:32; అపొ 5:31

యెహెజ్కేలు 34:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 23:6
  • +లేవీ 26:6; యెష 11:6-9; హోషే 2:18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    తేజరిల్లు!,

    3/8/1992, పేజీ 11

యెహెజ్కేలు 34:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 56:7; మీకా 4:1
  • +ఆది 12:2, 3; జెక 8:13

యెహెజ్కేలు 34:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 26:4; యెష 35:2
  • +లేవీ 26:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1993, పేజీ 20

యెహెజ్కేలు 34:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 30:10

యెహెజ్కేలు 34:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 36:29

యెహెజ్కేలు 34:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 37:27

యెహెజ్కేలు 34:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 78:52; యెష 40:11

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యెహె. 34:2యిర్మీ 23:1; మీకా 3:1, 11; జెఫ 3:3; జెక 11:17; మత్త 23:13
యెహె. 34:2యెష 40:11; యోహా 21:15
యెహె. 34:32రా 21:16; యిర్మీ 22:17; మీకా 3:3; జెక 11:4, 5
యెహె. 34:3యెష 56:11
యెహె. 34:4లూకా 15:4
యెహె. 34:4యిర్మీ 22:13
యెహె. 34:5యిర్మీ 23:2; 50:6; మత్త 9:36
యెహె. 34:10యిర్మీ 52:24-27
యెహె. 34:111స 17:34, 35; యెష 56:8
యెహె. 34:12యెష 40:11
యెహె. 34:12యోవే 2:1, 2; జెఫ 1:14, 15
యెహె. 34:13యెహె 11:17; ఆమో 9:14; మీకా 7:14
యెహె. 34:14యెష 25:6; యిర్మీ 31:12
యెహె. 34:14యిర్మీ 33:12
యెహె. 34:15యిర్మీ 3:15
యెహె. 34:15జెఫ 3:13
యెహె. 34:16మీకా 4:6; మత్త 15:24; లూకా 15:4
యెహె. 34:17జెక 10:3
యెహె. 34:22యెష 40:11; యిర్మీ 23:3
యెహె. 34:23యోహా 10:11; హెబ్రీ 13:20; 1పే 5:4; ప్రక 7:17
యెహె. 34:23యెష 11:1
యెహె. 34:23యెహె 37:24
యెహె. 34:24యిర్మీ 31:1
యెహె. 34:24యెష 9:6; యిర్మీ 23:5; మీకా 5:2; లూకా 1:32; అపొ 5:31
యెహె. 34:25యిర్మీ 23:6
యెహె. 34:25లేవీ 26:6; యెష 11:6-9; హోషే 2:18
యెహె. 34:26యెష 56:7; మీకా 4:1
యెహె. 34:26ఆది 12:2, 3; జెక 8:13
యెహె. 34:27లేవీ 26:13
యెహె. 34:27లేవీ 26:4; యెష 35:2
యెహె. 34:28యిర్మీ 30:10
యెహె. 34:29యెహె 36:29
యెహె. 34:30యెహె 37:27
యెహె. 34:31కీర్త 78:52; యెష 40:11
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యెహెజ్కేలు 34:1-31

యెహెజ్కేలు

34 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “మానవ కుమారుడా, ఇశ్రాయేలు కాపరులకు వ్యతిరేకంగా ప్రవచించు. వాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “తమ కడుపు నింపుకుంటున్న ఇశ్రాయేలు కాపరులకు శ్రమ!+ కాపరులు మేపాల్సింది మందను కాదా?+ 3 మీరు కొవ్వును తింటారు, ఉన్నితో చేసిన వస్త్రాలు వేసుకుంటారు, కొవ్విన జంతువుల్ని వధిస్తారు,+ కానీ మందను మాత్రం మేపరు.+ 4 మీరు బలహీనంగా ఉన్నవాటిని బలపర్చలేదు, జబ్బుపడిన వాటిని బాగుచేయలేదు, గాయపడిన వాటికి కట్టుకట్టలేదు, దారితప్పిన వాటిని తిరిగి తీసుకురాలేదు, తప్పిపోయిన వాటిని వెదకలేదు;+ బదులుగా కఠినంగా, క్రూరంగా వాటిమీద పెత్తనం చెలాయించారు.+ 5 కాబట్టి కాపరి లేక అవి చెల్లాచెదురైపోయాయి;+ అవి చెదిరిపోయి అడవి జంతువులన్నిటికీ ఆహారమయ్యాయి. 6 నా గొర్రెలు దారితప్పి ప్రతీ పర్వతం మీద, ఎత్తైన ప్రతీ కొండ మీద తిరిగాయి; నా గొర్రెలు భూమంతటా చెదిరిపోయాయి, వాటి కోసం వెదికేవాళ్లు గానీ, వాటిని కనుగొనాలని ప్రయత్నించేవాళ్లు గానీ ఎవరూ లేరు.

7 “ ‘ “కాబట్టి కాపరులారా, యెహోవా చెప్పేది వినండి: 8 ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “కాపరి లేకపోవడం వల్ల, నా కాపరులు నా గొర్రెల కోసం వెదకనందువల్ల అవి అడవి జంతువులన్నిటికీ ఆహారమయ్యాయి; ఆ కాపరులు నా గొర్రెల్ని మేపకుండా తమ కడుపు నింపుకుంటూ ఉన్నారు, కాబట్టి నా జీవం తోడు నేను తప్పకుండా చర్య తీసుకుంటాను.” ’ 9 కాపరులారా, యెహోవా చెప్పేది వినండి. 10 సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను ఆ కాపరులకు వ్యతిరేకంగా ఉన్నాను, నా గొర్రెల గురించి నేను వాళ్లను లెక్క అడుగుతాను, వాళ్లు ఇక నా గొర్రెల్ని కాయకుండా, తమ కడుపు నింపుకోకుండా చేస్తాను.+ నేను వాళ్ల నోళ్ల నుండి నా గొర్రెల్ని రక్షిస్తాను, అవి ఇక వాళ్లకు ఆహారం అవ్వవు.’ ”

11 “ ‘ఎందుకంటే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఇదిగో, నేనే స్వయంగా నా గొర్రెల కోసం వెదికి, వాటి బాగోగులు చూసుకుంటాను.+ 12 చెదిరిపోయిన తన గొర్రెల్ని వెదికి, వాటికి మేత పెట్టే కాపరిలా నేను నా గొర్రెల బాగోగులు చూసుకుంటాను.+ కారుమబ్బులు, కటిక చీకటి కమ్ముకునే రోజున+ అవి ఎక్కడెక్కడికి చెదిరిపోయాయో ఆ స్థలాలన్నిటి నుండి నేను వాటిని రక్షిస్తాను. 13 నేను వాటిని జనాల నుండి తీసుకొచ్చి, దేశాల నుండి వాటిని సమకూరుస్తాను; వాటి స్వదేశానికి వాటిని తోలుకొచ్చి, ఇశ్రాయేలు పర్వతాల మీద వాగుల పక్కన, దేశంలో ప్రజలు నివసించే ప్రాంతాలన్నిటి దగ్గర వాటిని మేపుతాను.+ 14 మంచి మేత స్థలంలో నేను వాటిని మేపుతాను, ఇశ్రాయేలు ఎత్తైన పర్వత ప్రాంతాలు వాటికి మేత స్థలాలు అవుతాయి.+ అవి అక్కడ మంచి పచ్చిక మైదానంలో పడుకుంటాయి,+ ఇశ్రాయేలు పర్వతాల మీదున్న శ్రేష్ఠమైన మేత స్థలాల్లో మేస్తాయి.”

15 “ ‘ “నేనే స్వయంగా నా గొర్రెల్ని మేపుతాను,+ నేనే వాటిని పడుకోబెడతాను”+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు. 16 “నేను తప్పిపోయిన దాన్ని వెదుకుతాను,+ దారితప్పిన దాన్ని వెనక్కి తీసుకొస్తాను, గాయపడిన దానికి కట్టుకడతాను, బలహీనంగా ఉన్నదాన్ని బలపరుస్తాను; అయితే కొవ్వినదాన్ని, బలంగా ఉన్నదాన్ని నేను నాశనం చేస్తాను. దానికి శిక్ష అనే మేత పెడతాను.”

17 “ ‘అయితే నా గొర్రెలారా, మీ గురించి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “నేను గొర్రెకూ గొర్రెకూ మధ్య, పొట్టేళ్లకూ మేకపోతులకూ మధ్య తీర్పు తీర్చబోతున్నాను.+ 18 మీరు శ్రేష్ఠమైన మేత స్థలాల్లో మేస్తున్నారు, అది చాలదా? మిగతా మేత స్థలాల్ని కూడా కాళ్లతో తొక్కేస్తారా? మీరు స్వచ్ఛమైన నీళ్లు తాగి, తర్వాత మీ కాళ్లతో వాటిని మురికి చేస్తారా? 19 ఇప్పుడు నా గొర్రెలు మీరు కాళ్లతో తొక్కేసిన మేత స్థలాల్లో మేయాలా? మీరు మురికి చేసిన నీళ్లను తాగాలా?”

20 “ ‘కాబట్టి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఇదిగో, నేనే స్వయంగా కొవ్విన గొర్రెకూ, బక్కచిక్కిన గొర్రెకూ మధ్య తీర్పు తీరుస్తాను, 21 ఎందుకంటే జబ్బుపడ్డ వాటన్నిటినీ మీరు మీ డొక్కతో, భుజంతో నెట్టేస్తూ, మీ కొమ్ములతో పొడుస్తూ వాటిని దూరంగా చెదరగొట్టారు. 22 నేను నా గొర్రెల్ని రక్షిస్తాను, అవి ఇక వేటికీ ఆహారం అవ్వవు;+ నేను గొర్రెకూ గొర్రెకూ మధ్య తీర్పు తీరుస్తాను. 23 వాటిమీద ఒక్క కాపరిని,+ అంటే నా సేవకుడైన దావీదును నియమిస్తాను,+ అతను వాటిని మేపుతాడు. అతనే స్వయంగా వాటిని మేపి, వాటికి కాపరిగా ఉంటాడు.+ 24 యెహోవానైన నేను వాళ్లకు దేవుడిగా ఉంటాను,+ నా సేవకుడైన దావీదు వాళ్ల మధ్య ప్రధానుడిగా ఉంటాడు.+ యెహోవానైన నేనే ఈ మాట చెప్పాను.

25 “ ‘ “అవి నిర్భయంగా ఎడారిలో నివసించేలా, అడవుల్లో పడుకునేలా+ నేను వాటితో ఒక శాంతి ఒప్పందం చేసి, దేశంలో క్రూరమృగాలే లేకుండా చేస్తాను.+ 26 నేను వాటినీ, నా కొండ చుట్టూ ఉన్న ప్రాంతాన్నీ దీవెనగా చేస్తాను,+ సకాలంలో వర్షాలు పడేలా చేస్తాను. దీవెనలు వర్షంలా కురుస్తాయి.+ 27 మైదానంలోని చెట్లు పండ్లను ఇస్తాయి, నేల పంటను ఇస్తుంది,+ నా ప్రజలు దేశంలో సురక్షితంగా నివసిస్తారు. నేను వాళ్ల కాడిని విరగ్గొట్టి,+ తమను బానిసలుగా చేసుకున్నవాళ్ల నుండి వాళ్లను విడిపించినప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు. 28 వాళ్లు ఇక జనాలకు దోపుడుసొమ్ముగా ఉండరు, భూమ్మీది అడవి జంతువులు వాళ్లను మింగేయవు, వాళ్లు ఎవరి భయం లేకుండా సురక్షితంగా నివసిస్తారు.+

29 “ ‘ “నేను పేరుపొందిన ఒక తోటను వాళ్లకు ఇస్తాను, వాళ్లు ఇక దేశంలో కరువు వల్ల చనిపోరు,+ జనాల చేతిలో అవమానాలపాలు అవ్వరు. 30 ‘అప్పుడు నేను అంటే వాళ్ల దేవుడైన యెహోవాను వాళ్లతో ఉన్నాననీ, వాళ్లు అంటే ఇశ్రాయేలు ఇంటివాళ్లు నా ప్రజలనీ+ వాళ్లు తెలుసుకుంటారు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నాడు.” ’

31 “ ‘నేను కాసే నా గొర్రెలారా,+ మీరు కేవలం మనుషులు, నేను మీ దేవుణ్ణి’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.”

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి