కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఆదికాండం 46
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ఆదికాండం విషయసూచిక

      • యాకోబు, అతని ఇంటివాళ్లు ఐగుప్తుకు తరలివెళ్లడం (1-7)

      • ఐగుప్తుకు తరలివెళ్లిన వాళ్ల పేర్లు (8-27)

      • గోషెనులో యోసేపు యాకోబును ​కలవడం (28-34)

ఆదికాండం 46:1

అధస్సూచీలు

  • *

    లేదా “తన వాళ్లందర్నీ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 21:31
  • +ఆది 31:42; నిర్గ 3:6

ఆదికాండం 46:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 28:13
  • +ఆది 12:1, 2; నిర్గ 1:7; ద్వితీ 26:5

ఆదికాండం 46:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 15:16; 28:15; 47:29, 30; 50:13
  • +ఆది 50:1

ఆదికాండం 46:5

అధస్సూచీలు

  • *

    అక్ష., “ఇశ్రాయేలును.”

ఆదికాండం 46:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 5:1

ఆదికాండం 46:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 26:5, 6

ఆదికాండం 46:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 29:33
  • +సం 26:12, 13

ఆదికాండం 46:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 29:34

ఆదికాండం 46:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 29:35; ప్రక 5:5
  • +ఆది 38:2-5
  • +లూకా 3:23, 33
  • +ఆది 38:30
  • +ఆది 38:7, 9, 10
  • +సం 26:21

ఆదికాండం 46:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 26:23, 24

ఆదికాండం 46:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 30:20
  • +సం 26:26

ఆదికాండం 46:15

అధస్సూచీలు

  • *

    అక్ష., “కుమారులు.”

ఆదికాండం 46:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 30:11
  • +సం 26:15-17

ఆదికాండం 46:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 30:13
  • +సం 26:44, 45

ఆదికాండం 46:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 30:24
  • +ఆది 35:18

ఆదికాండం 46:20

అధస్సూచీలు

  • *

    అంటే, హీలియోపొలిస్‌.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 41:51
  • +ఆది 41:52
  • +ఆది 41:50

ఆదికాండం 46:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 7:6
  • +1ది 8:1, 3
  • +1ది 7:12
  • +సం 26:38-40

ఆదికాండం 46:23

అధస్సూచీలు

  • *

    అక్ష., “కుమారులు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 30:6
  • +సం 26:42

ఆదికాండం 46:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 30:8
  • +సం 26:48, 49

ఆదికాండం 46:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 35:10, 11

ఆదికాండం 46:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 1:5; ద్వితీ 10:22; అపొ 7:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2002, పేజీ 27

ఆదికాండం 46:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 43:8; 44:18
  • +ఆది 45:10; 47:1

ఆదికాండం 46:29

అధస్సూచీలు

  • *

    అక్ష., “అతని మెడ మీద పడి.”

ఆదికాండం 46:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 41:39, 40
  • +ఆది 45:19; అపొ 7:13

ఆదికాండం 46:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 31:17, 18, 38; 47:3
  • +ఆది 46:6

ఆదికాండం 46:34

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 30:35, 36
  • +ఆది 45:17, 18; 47:27
  • +ఆది 43:32

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ఆది. 46:1ఆది 21:31
ఆది. 46:1ఆది 31:42; నిర్గ 3:6
ఆది. 46:3ఆది 28:13
ఆది. 46:3ఆది 12:1, 2; నిర్గ 1:7; ద్వితీ 26:5
ఆది. 46:4ఆది 15:16; 28:15; 47:29, 30; 50:13
ఆది. 46:4ఆది 50:1
ఆది. 46:81ది 5:1
ఆది. 46:9సం 26:5, 6
ఆది. 46:10ఆది 29:33
ఆది. 46:10సం 26:12, 13
ఆది. 46:11ఆది 29:34
ఆది. 46:12ఆది 29:35; ప్రక 5:5
ఆది. 46:12ఆది 38:2-5
ఆది. 46:12లూకా 3:23, 33
ఆది. 46:12ఆది 38:30
ఆది. 46:12ఆది 38:7, 9, 10
ఆది. 46:12సం 26:21
ఆది. 46:13సం 26:23, 24
ఆది. 46:14ఆది 30:20
ఆది. 46:14సం 26:26
ఆది. 46:16ఆది 30:11
ఆది. 46:16సం 26:15-17
ఆది. 46:17ఆది 30:13
ఆది. 46:17సం 26:44, 45
ఆది. 46:19ఆది 30:24
ఆది. 46:19ఆది 35:18
ఆది. 46:20ఆది 41:51
ఆది. 46:20ఆది 41:52
ఆది. 46:20ఆది 41:50
ఆది. 46:211ది 7:6
ఆది. 46:211ది 8:1, 3
ఆది. 46:211ది 7:12
ఆది. 46:21సం 26:38-40
ఆది. 46:23ఆది 30:6
ఆది. 46:23సం 26:42
ఆది. 46:24ఆది 30:8
ఆది. 46:24సం 26:48, 49
ఆది. 46:26ఆది 35:10, 11
ఆది. 46:27నిర్గ 1:5; ద్వితీ 10:22; అపొ 7:14
ఆది. 46:28ఆది 43:8; 44:18
ఆది. 46:28ఆది 45:10; 47:1
ఆది. 46:31ఆది 41:39, 40
ఆది. 46:31ఆది 45:19; అపొ 7:13
ఆది. 46:32ఆది 31:17, 18, 38; 47:3
ఆది. 46:32ఆది 46:6
ఆది. 46:34ఆది 30:35, 36
ఆది. 46:34ఆది 45:17, 18; 47:27
ఆది. 46:34ఆది 43:32
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ఆదికాండం 46:1-34

ఆదికాండం

46 ఇశ్రాయేలు తనకున్న వాటన్నిటినీ* తీసుకొని బయల్దేరాడు. అతను బెయేర్షెబాకు+ చేరుకున్నప్పుడు, తన తండ్రి ఇస్సాకు ఆరాధించిన దేవునికి+ బలులు అర్పించాడు. 2 రాత్రిపూట దేవుడు ఒక దర్శనంలో ఇశ్రాయేలుతో మాట్లాడుతూ, “యాకోబూ, యాకోబూ!” అని పిలిచాడు. దానికి అతను, “చెప్పు ప్రభువా!” అన్నాడు. 3 అప్పుడు దేవుడు ఇలా అన్నాడు: “నేను సత్యదేవుణ్ణి, నీ తండ్రికి దేవుణ్ణి.+ ఐగుప్తుకు వెళ్లడానికి భయపడకు, ఎందుకంటే అక్కడ నువ్వు ఒక గొప్ప జనం అయ్యేలా నేను చేస్తాను.+ 4 నేను కూడా నీతోపాటు ఐగుప్తుకు వస్తాను, నేనే నిన్ను మళ్లీ ఐగుప్తు నుండి తీసుకొస్తాను.+ నువ్వు చనిపోయినప్పుడు యోసేపు తన చేతితో నీ కళ్లు మూస్తాడు.”+

5 తర్వాత యాకోబు బెయేర్షెబా నుండి బయల్దేరాడు. అతని కుమారులు అతన్ని,* తమ పిల్లల్ని, తమ భార్యల్ని ఫరో పంపించిన బండ్లలోకి ఎక్కించి ఐగుప్తుకు ప్రయాణమయ్యారు. 6 కనాను దేశంలో తాము సంపాదించుకున్న పశువుల మందల్ని, వస్తువుల్ని కూడా తమతోపాటు తీసుకెళ్లారు. అలా యాకోబు, అతనితోపాటు అతని పిల్లలందరూ ఐగుప్తుకు చేరుకున్నారు. 7 యాకోబు తనతోపాటు తన కుటుంబమంతటినీ అంటే కుమారుల్ని, మనవళ్లను, కూతుళ్లను, మనవరాళ్లను ఐగుప్తుకు తీసుకొచ్చాడు.

8 ఐగుప్తుకు వచ్చిన ఇశ్రాయేలు కుమారుల పేర్లు, అంటే యాకోబు కుమారుల పేర్లు ఇవి: యాకోబు పెద్ద కుమారుడు రూబేను.+

9 రూబేను కుమారులు: హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.+

10 షిమ్యోను+ కుమారులు: యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, షావూలు.+ ఈ షావూలు ఒక కనానీయురాలి కుమారుడు.

11 లేవి+ కుమారులు: గెర్షోను, కహాతు, మెరారి.

12 యూదా+ కుమారులు: ఏరు, ఓనాను, షేలహు,+ పెరెసు,+ జెరహు.+ అయితే ఏరు, ఓనాను ఇద్దరూ కనాను దేశంలో చనిపోయారు.+

పెరెసు కుమారులు: ఎస్రోను, హామూలు.+

13 ఇశ్శాఖారు కుమారులు: తోలా, పువ్వా, యోబు, షిమ్రోను.+

14 జెబూలూను+ కుమారులు: సెరెదు, ఏలోను, యహలేలు.+

15 వీళ్లు లేయా నుండి వచ్చినవాళ్లు.* ఆమె పద్దనరాములో యాకోబుకు వీళ్లను, అతని కూతురు దీనాను కన్నది. యాకోబు వంశస్థులైన వీళ్లంతా 33 మంది.

16 గాదు+ కుమారులు: సిప్యోను, హగ్గీ, షూనీ, ఎస్బోను, ఏరీ, ఆరోదు, అరేలీ.+

17 ఆషేరు+ కుమారులు: ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. వాళ్ల సహోదరి శెరహు.

బెరీయా కుమారులు: హెబెరు, మల్కీయేలు.+

18 వీళ్లంతా లాబాను తన కూతురు లేయాకు సేవకురాలిగా ఇచ్చిన జిల్పా కుమారులు. వీళ్లను ఆమె యాకోబుకు కన్నది, వీళ్లు మొత్తం 16 మంది.

19 యాకోబు భార్య రాహేలుకు పుట్టిన కుమారులు: యోసేపు,+ బెన్యామీను.+

20 ఐగుప్తులో యోసేపుకు పుట్టిన కుమారులు: మనష్షే,+ ఎఫ్రాయిము.+ వీళ్లను ఓను* పూజారైన పోతీఫెర కూతురు ఆసెనతు+ యోసేపుకు కన్నది.

21 బెన్యామీను కుమారులు:+ బెల, బేకెరు, అష్బేలు, గెరా,+ నయమాను, ఏహీ, రోషు, ముప్పీము, హుప్పీము,+ ఆర్దు.+

22 వీళ్లంతా రాహేలు ద్వారా యాకోబుకు పుట్టిన కుమారులు, మొత్తం 14 మంది.

23 దాను+ కుమారుడు* హుషీము.+

24 నఫ్తాలి+ కుమారులు: యహసేలు, గూనీ, యేసెరు, షిల్లేము.+

25 వీళ్లంతా లాబాను తన కూతురు రాహేలుకు సేవకురాలిగా ఇచ్చిన బిల్హా కుమారులు. వీళ్లను ఆమె యాకోబుకు కన్నది, వీళ్లు మొత్తం ఏడుగురు.

26 యాకోబు కోడళ్లు కాకుండా అతనితో పాటు ఐగుప్తుకు వెళ్లిన అతని వంశస్థులందరు 66 మంది.+ 27 యోసేపుకు ఐగుప్తులో పుట్టిన కుమారులు ఇద్దరు. అలా ఐగుప్తుకు వచ్చిన యాకోబు ఇంటివాళ్లందరు మొత్తం 70 మంది.+

28 తాను గోషెనుకు వచ్చే దారిలో ఉన్నానని యోసేపుకు చెప్పడానికి యాకోబు యూదాను+ ముందుగా పంపించాడు. వాళ్లు గోషెను ప్రాంతానికి+ వచ్చినప్పుడు, 29 యోసేపు తన రథాన్ని సిద్ధం చేయించుకొని తన తండ్రి ఇశ్రాయేలును కలవడానికి గోషెనుకు వెళ్లాడు. తన తండ్రి కనబడగానే యోసేపు అతన్ని కౌగిలించుకొని* చాలాసేపు ఏడ్చాడు. 30 తర్వాత ఇశ్రాయేలు యోసేపుతో ఇలా అన్నాడు: “నేను నీ ముఖం చూశాను, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు. కాబట్టి ఇక నేను చనిపోయినా ఫర్వాలేదు.”

31 తర్వాత యోసేపు తన సహోదరులతో, తన తండ్రి ఇంటివాళ్లతో ఇలా అన్నాడు: “నేను ఫరో దగ్గరికి వెళ్లి ఇలా చెప్తాను,+ ‘కనాను దేశం నుండి నా సహోదరులు, నా తండ్రి ఇంటివాళ్లు ఇక్కడికి వచ్చారు.+ 32 వాళ్లు గొర్రెల్ని, పశువుల్ని కాస్తారు.+ వాళ్లు తమ మందల్ని, పశువుల్ని, తమకున్న వాటన్నిటినీ తీసుకొని ఇక్కడికి వచ్చారు.’+ 33 ఫరో మిమ్మల్ని పిలిచి, ‘మీరేం పని చేస్తుంటారు?’ అని అడిగినప్పుడు 34 మీరు, ‘నీ సేవకులమైన మేము చిన్నప్పటి నుండి ఇప్పటివరకు పశువుల కాపరులం. మేమే కాదు మా పూర్వీకులు కూడా ఇదే పని చేసేవాళ్లు’+ అని చెప్పాలి. అప్పుడు మీరు గోషెను ప్రాంతంలో నివసించవచ్చు.+ ఎందుకంటే గొర్రెల కాపరులంటే ఐగుప్తీయులకు అసహ్యం.”+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి