కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 30
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

నిర్గమకాండం విషయసూచిక

      • ధూపవేదిక (1-10)

      • జనాభా లెక్క, ప్రాయశ్చిత్తం కోసం ఇచ్చే డబ్బు (11-16)

      • కడుక్కోవడం కోసం రాగి గంగాళం (17-21)

      • అభిషేక తైల ప్రత్యేక మిశ్రమం (22-33)

      • పవిత్ర ధూపద్రవ్యాన్ని తయారుచేసే పద్ధతి (34-38)

నిర్గమకాండం 30:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 40:5
  • +నిర్గ 37:25-28

నిర్గమకాండం 30:2

అధస్సూచీలు

  • *

    దాదాపు 44.5 సెంటీమీటర్లు (17.5 అంగుళాలు). అనుబంధం B14 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 27:1, 2; లేవీ 4:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 10/2020, పేజీలు 6-7

నిర్గమకాండం 30:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 26:33; హెబ్రీ 9:3
  • +నిర్గ 25:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 10/2020, పేజీలు 6-7

నిర్గమకాండం 30:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 23:13
  • +నిర్గ 27:20
  • +నిర్గ 30:34, 35
  • +సం 16:39, 40; 1స 2:27, 28; లూకా 1:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/1996, పేజీ 9

నిర్గమకాండం 30:8

అధస్సూచీలు

  • *

    అక్ష., “రెండు సాయంత్రాల మధ్య.” సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి పడడానికి ముందు ఉండే సమయాన్ని సూచిస్తుందని స్పష్టమౌతోంది.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/1996, పేజీ 9

నిర్గమకాండం 30:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 10:1; 2ది 26:18; యెహె 8:11, 12

నిర్గమకాండం 30:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 23:27; హెబ్రీ 9:7
  • +లేవీ 16:5, 6, 18, 19

నిర్గమకాండం 30:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 38:25; సం 1:2; 2స 24:10, 15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 9/2020, పేజీ 7

నిర్గమకాండం 30:13

అధస్సూచీలు

  • *

    లేదా “పవిత్ర షెకెల్‌.”

  • *

    అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.

  • *

    అప్పట్లో ఒక గీరా 0.57 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 27:25
  • +2ది 24:9; మత్త 17:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 9/2020, పేజీ 7

నిర్గమకాండం 30:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 38:26; సం 1:3; 26:1, 2

నిర్గమకాండం 30:15

అధస్సూచీలు

  • *

    అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.

నిర్గమకాండం 30:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 38:8; లేవీ 8:11; 1రా 7:38
  • +నిర్గ 40:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 40

నిర్గమకాండం 30:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 40:30, 31; హెబ్రీ 10:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 40

నిర్గమకాండం 30:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/1996, పేజీ 9

నిర్గమకాండం 30:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 4:6

నిర్గమకాండం 30:23

అధస్సూచీలు

  • *

    లేదా “దాదాపు 6 కిలోల.”

  • *

    లేదా “దాదాపు 3 కిలోల.”

నిర్గమకాండం 30:24

అధస్సూచీలు

  • *

    లేదా “పవిత్ర షెకెల్‌.”

  • *

    అప్పట్లో ఒక హిన్‌ 3.67 లీటర్లతో సమానం. అనుబంధం B14 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 3:47

నిర్గమకాండం 30:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 37:29

నిర్గమకాండం 30:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 40:9; సం 7:1

నిర్గమకాండం 30:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 8:10
  • +నిర్గ 29:37

నిర్గమకాండం 30:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 3:2, 3
  • +లేవీ 8:12
  • +నిర్గ 40:15

నిర్గమకాండం 30:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 37:29; 1రా 1:39; కీర్త 89:20

నిర్గమకాండం 30:33

అధస్సూచీలు

  • *

    లేదా “అపరిచితుల,” అంటే, అహరోను వంశస్థులు కానివాళ్ల.

  • *

    లేదా “చంపేయాలి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 30:37, 38

నిర్గమకాండం 30:34

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 25:3, 6

నిర్గమకాండం 30:35

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 37:29; కీర్త 141:2; ప్రక 5:8
  • +లేవీ 2:13

నిర్గమకాండం 30:37

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 30:31, 32

నిర్గమకాండం 30:38

అధస్సూచీలు

  • *

    లేదా “చంపేయాలి.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 10/2020, పేజీ 7

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

నిర్గ. 30:1నిర్గ 40:5
నిర్గ. 30:1నిర్గ 37:25-28
నిర్గ. 30:2నిర్గ 27:1, 2; లేవీ 4:7
నిర్గ. 30:6నిర్గ 26:33; హెబ్రీ 9:3
నిర్గ. 30:6నిర్గ 25:22
నిర్గ. 30:71ది 23:13
నిర్గ. 30:7నిర్గ 27:20
నిర్గ. 30:7నిర్గ 30:34, 35
నిర్గ. 30:7సం 16:39, 40; 1స 2:27, 28; లూకా 1:9
నిర్గ. 30:9లేవీ 10:1; 2ది 26:18; యెహె 8:11, 12
నిర్గ. 30:10లేవీ 23:27; హెబ్రీ 9:7
నిర్గ. 30:10లేవీ 16:5, 6, 18, 19
నిర్గ. 30:12నిర్గ 38:25; సం 1:2; 2స 24:10, 15
నిర్గ. 30:13లేవీ 27:25
నిర్గ. 30:132ది 24:9; మత్త 17:24
నిర్గ. 30:14నిర్గ 38:26; సం 1:3; 26:1, 2
నిర్గ. 30:18నిర్గ 38:8; లేవీ 8:11; 1రా 7:38
నిర్గ. 30:18నిర్గ 40:7
నిర్గ. 30:19నిర్గ 40:30, 31; హెబ్రీ 10:22
నిర్గ. 30:212ది 4:6
నిర్గ. 30:24సం 3:47
నిర్గ. 30:25నిర్గ 37:29
నిర్గ. 30:26నిర్గ 40:9; సం 7:1
నిర్గ. 30:29లేవీ 8:10
నిర్గ. 30:29నిర్గ 29:37
నిర్గ. 30:30సం 3:2, 3
నిర్గ. 30:30లేవీ 8:12
నిర్గ. 30:30నిర్గ 40:15
నిర్గ. 30:31నిర్గ 37:29; 1రా 1:39; కీర్త 89:20
నిర్గ. 30:33నిర్గ 30:37, 38
నిర్గ. 30:34నిర్గ 25:3, 6
నిర్గ. 30:35నిర్గ 37:29; కీర్త 141:2; ప్రక 5:8
నిర్గ. 30:35లేవీ 2:13
నిర్గ. 30:37నిర్గ 30:31, 32
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
నిర్గమకాండం 30:1-38

నిర్గమకాండం

30 “ధూపం వేయడానికి నువ్వు ఒక వేదిక తయారుచేయాలి;+ దాన్ని తుమ్మ చెక్కతో తయారుచేయాలి.+ 2 అది చతురస్ర ఆకారంలో ఉండాలి; దాని పొడవు ఒక మూర,* వెడల్పు ఒక మూర, ఎత్తు రెండు మూరలు ఉండాలి. దాని కొమ్ములు దానిలో భాగమై ఉండాలి, వాటిని విడిగా చేయకూడదు.+ 3 నువ్వు ఆ వేదిక అంతటికీ, అంటే దాని పైభాగానికి, దాని నాలుగు పక్కలకు, దాని కొమ్ములకు స్వచ్ఛమైన బంగారు రేకు తొడగాలి; అలాగే దాని చుట్టూ బంగారంతో అంచును చేయాలి. 4 ఆ అంచు కింద అటువైపు రెండు, ఇటువైపు రెండు బంగారు ఉంగరాలు చేయాలి; ఈ ఉంగరాలు వేదికను మోయడానికి ఉపయోగించే కర్రల్ని పట్టి ఉంచుతాయి. 5 ఆ కర్రల్ని తుమ్మ చెక్కతో చేసి, వాటికి బంగారు రేకు తొడగాలి. 6 నువ్వు దాన్ని సాక్ష్యపు మందసం దగ్గరున్న తెర ముందు,+ నేను ఎక్కడైతే మిమ్మల్ని కలుసుకుంటానో ఆ సాక్ష్యపు మందసం మీదున్న మూతకు ఎదురుగా పెట్టాలి.+

7 “అహరోను+ ప్రతీ ఉదయం దీపాల్ని+ చక్కబెట్టేటప్పుడు, ఆ వేదిక మీద నుండి పొగ పైకిలేచేలా దానిమీద పరిమళ ధూపద్రవ్యం+ కాలుస్తాడు.+ 8 అలాగే, అహరోను సంధ్య వెలుగు సమయంలో* దీపాల్ని వెలిగించేటప్పుడు కూడా ఆ ధూపం వేస్తాడు. ఇది మీరు తరతరాలపాటు యెహోవా ముందు క్రమంగా అర్పించాల్సిన ధూపార్పణ. 9 నువ్వు దానిమీద వేరే ధూపాన్ని+ గానీ, దహనబలిని గానీ, ధాన్యార్పణను గానీ అర్పించకూడదు; అలాగే దానిమీద పానీయార్పణను పోయకూడదు. 10 అహరోను సంవత్సరానికి ఒకసారి దాని కొమ్ముల మీద ప్రాయశ్చిత్తం చేయాలి.+ ప్రాయశ్చిత్తం కోసం అర్పించే పాపపరిహారార్థ బలి రక్తంలో కొంచెం తీసుకొని+ అతను సంవత్సరానికి ఒకసారి దానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు. మీ తరతరాలపాటు ఇలా జరగాలి. ఇది యెహోవాకు అతి పవిత్రం.”

11 తర్వాత యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: 12 “నువ్వు ఇశ్రాయేలీయుల జనాభా లెక్క సేకరించే ప్రతీసారి,+ వాళ్లలో ప్రతీ ఒక్కరు తన ప్రాణ విమోచన కోసం ఆ సమయంలో యెహోవాకు మూల్యం చెల్లించాలి. వాళ్ల పేర్లు నమోదైనప్పుడు వాళ్ల మీదికి తెగులు రాకుండా ఉండాలంటే వాళ్లు అలా చేయాలి. 13 పేర్లు నమోదైన వాళ్లందరూ, పవిత్ర స్థల షెకెల్‌* కొలమానం ప్రకారం+ అర షెకెల్‌* ఇవ్వాలి. ఒక షెకెల్‌ ఇరవై గీరాలతో* సమానం. అర షెకెల్‌ అనేది యెహోవాకు ఇచ్చే కానుక.+ 14 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉండి తమ పేరు నమోదైన ప్రతీ ఒక్కరు యెహోవాకు ఆ కానుక ఇవ్వాలి.+ 15 తమ ప్రాణాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి యెహోవాకు కానుక ఇస్తున్నప్పుడు, ధనికులు అర షెకెల్‌* కన్నా ఎక్కువ ఇవ్వకూడదు, పేదవాళ్లు అర షెకెల్‌ కన్నా తక్కువ ఇవ్వకూడదు. 16 ఇశ్రాయేలీయులు ప్రాయశ్చిత్తం కోసం ఇచ్చే ఆ వెండి సొమ్మును నువ్వు తీసుకొని, ప్రత్యక్ష గుడారపు సేవకు మద్దతుగా దాన్ని ఇవ్వాలి. తమ ప్రాణాల కోసం ప్రాయశ్చిత్తం చేయాలని గుర్తుచేయడానికి అది యెహోవా ముందు ఇశ్రాయేలీయుల కోసం ఒక జ్ఞాపికగా పనిచేస్తుంది.”

17 యెహోవా మోషేకు ఇంకా ఇలా చెప్పాడు: 18 “నువ్వు ఒక రాగి గంగాళాన్ని, దాని కోసం ఒక పీఠాన్ని తయారుచేయాలి;+ దాన్ని ప్రత్యక్ష గుడారానికి, బలిపీఠానికి మధ్య ఉంచి అందులో నీళ్లు పోయాలి.+ 19 అహరోను, అతని కుమారులు అక్కడ తమ కాళ్లూచేతులు కడుక్కుంటారు.+ 20 ప్రత్యక్ష గుడారంలోకి వెళ్లేటప్పుడు లేదా సేవ చేయడానికి, యెహోవాకు అగ్నితో అర్పణలు అర్పించడానికి బలిపీఠం దగ్గరికి వస్తున్నప్పుడు వాళ్లు చనిపోకుండా ఉండేలా ఆ నీళ్లతో కడుక్కోవాలి. 21 వాళ్లు చనిపోకుండా ఉండేలా తమ కాళ్లూచేతులు కడుక్కోవాలి. ఈ శాసనాన్ని వాళ్లు అంటే అతను, అతని సంతానం తరతరాలపాటు ఎప్పటికీ పాటించాలి.”+

22 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 23 “తర్వాత అతిశ్రేష్ఠమైన ఈ పరిమళ ద్రవ్యాల్ని తీసుకో: 500 షెకెల్‌ల* గడ్డకట్టిన బోళం, దానిలో సగం అంటే 250 షెకెల్‌ల* సుగంధభరిత దాల్చిన చెక్క, 250 షెకెల్‌ల సుగంధభరిత వస, 24 అలాగే 500 షెకెల్‌ల లవంగిపట్ట. పవిత్ర స్థల షెకెల్‌* కొలమానం ప్రకారం+ వాటిని తూచాలి. అలాగే ఒక హిన్‌* ఒలీవ నూనె తీసుకోవాలి. 25 తర్వాత వాటితో పవిత్రమైన అభిషేక తైలాన్ని తయారుచేయాలి; లేపనాలు తయారుచేసే వ్యక్తిలా వాటిని నేర్పుగా కలుపుతూ ఆ తైలాన్ని తయారుచేయాలి.+ అది పవిత్రమైన అభిషేక తైలంగా ఉండాలి.

26 “నువ్వు దానితో ప్రత్యక్ష గుడారాన్ని, సాక్ష్యపు మందసాన్ని అభిషేకించాలి;+ 27 అలాగే బల్లను, దాని పాత్రలన్నిటినీ, దీపస్తంభాన్ని, దాని పాత్రల్ని, ధూపవేదికను, 28 దహనబలులు అర్పించే బలిపీఠాన్ని, దాని పాత్రలన్నిటినీ, గంగాళాన్ని, దాని పీఠాన్ని కూడా అభిషేకించాలి. 29 అవి అతి పవిత్రం అయ్యేలా నువ్వు వాటిని పవిత్రపర్చాలి.+ వాటిని తాకే వాళ్లెవరైనా పవిత్రంగా ఉండాలి.+ 30 నువ్వు అహరోనును, అతని కుమారుల్ని+ అభిషేకించి,+ నాకు యాజకులుగా సేవచేసేలా వాళ్లను పవిత్రపర్చాలి.+

31 “నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పాలి: ‘ఇది మీ తరతరాలపాటు ఎప్పటికీ నాకు పవిత్రమైన అభిషేక తైలంగా ఉండాలి.+ 32 దాన్ని మనిషి శరీరానికి రాయకూడదు, దాని పాళ్లలో అలాంటి మిశ్రమం ఏదీ తయారు చేయకూడదు. అది పవిత్రమైనది. అది ఎప్పటికీ మీకు పవిత్రమైనదిగా ఉండాలి. 33 దానిలాంటి లేపనాన్ని తయారుచేసే ఏ వ్యక్తినైనా, దానిలో కొంచెం తీసుకొని వేరేవాళ్ల* మీద పోసే ఏ వ్యక్తినైనా తన ప్రజల్లో ఉండకుండా కొట్టేయాలి.’ ”*+

34 తర్వాత యెహోవా మోషేకు ఇలా చెప్పాడు: “నువ్వు జటామాంసి, గోపి చందనం, గంధపు చెక్క, స్వచ్ఛమైన సాంబ్రాణి అనే పరిమళ ద్రవ్యాల్ని సమపాళ్లలో తీసుకొని,+ 35 వాటితో ధూపద్రవ్యం తయారుచేయి.+ లేపనాలు తయారుచేసే వ్యక్తిలా వాటిని నేర్పుగా కలుపుతూ సువాసనగల ఆ మిశ్రమాన్ని తయారుచేయాలి. దానిలో ఉప్పు కూడా కలపాలి.+ అది స్వచ్ఛమైన, పవిత్రమైన ధూపద్రవ్యంగా ఉండాలి. 36 నువ్వు దానిలో కొంచెం తీసుకొని, దాన్ని దంచి, మెత్తని పొడిగా చేయాలి. ఆ పొడిలో కొంచెం తీసుకొని ప్రత్యక్ష గుడారంలోని సాక్ష్యపు మందసం ముందు, అంటే నేను నిన్ను కలుసుకునే చోట ఉంచాలి. అది మీకు అతి పవిత్రమైనదిగా ఉండాలి. 37 ఈ పాళ్లలో మీరు తయారుచేసే ధూపద్రవ్యాన్ని మీ సొంత ఉపయోగం కోసం చేసుకోకూడదు.+ దాన్ని మీరు యెహోవాకు పవిత్రమైనదిగా ఎంచాలి. 38 దాని సువాసనను ఆస్వాదించడానికి అలాంటిది చేసే ఏ వ్యక్తినైనా తన ప్రజల్లో ఉండకుండా కొట్టేయాలి.”*

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి