కీర్తనలు
4 ఎందుకంటే యెహోవా తన ప్రజల్ని బట్టి సంతోషిస్తాడు,+
సాత్వికుల్ని రక్షణతో అలంకరిస్తాడు.+
5 విశ్వసనీయులు తమ మహిమను బట్టి సంతోషించాలి;
వాళ్లు తమ పరుపుల మీద సంతోషంతో కేకలు వేయాలి.+
6 వాళ్ల పెదాల మీద దేవుని స్తుతి పాటలు ఉండాలి,
వాళ్ల చేతిలో రెండంచుల ఖడ్గం ఉండాలి;
7 దేశాల మీద ప్రతీకారం చేయడానికి,
దేశదేశాల ప్రజల మీద శిక్ష అమలుచేయడానికి,
8 గొలుసులతో వాళ్ల రాజుల్ని,
ఇనుప సంకెళ్లతో వాళ్ల ప్రముఖుల్ని బంధించడానికి,
9 వాళ్లకు వ్యతిరేకంగా రాయబడిన తీర్పు అమలుచేయడానికి+ అది వాళ్ల చేతిలో ఉండాలి.
ఈ ఘనత ఆయన విశ్వసనీయులందరికీ చెందుతుంది.