కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 దినవృత్తాంతాలు 24
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

2 దినవృత్తాంతాలు విషయసూచిక

      • యెహోయాషు పరిపాలన (1-3)

      • యెహోయాషు ఆలయాన్ని బాగు ​చేయించడం (4-14)

      • యెహోయాషు మతభ్రష్టత్వం (15-22)

      • యెహోయాషు హత్య (23-27)

2 దినవృత్తాంతాలు 24:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 11:21
  • +ఆది 21:14; 2స 3:10; 2రా 12:1

2 దినవృత్తాంతాలు 24:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 12:2

2 దినవృత్తాంతాలు 24:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 22:3-5

2 దినవృత్తాంతాలు 24:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 12:4, 5; 2ది 29:1, 3; 34:9, 10
  • +2రా 12:6

2 దినవృత్తాంతాలు 24:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 12:7
  • +సం 1:50
  • +నిర్గ 30:12-16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 9/2020, పేజీ 7

2 దినవృత్తాంతాలు 24:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 22:2, 3
  • +2ది 28:24

2 దినవృత్తాంతాలు 24:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మార్కు 12:41
  • +2రా 12:9

2 దినవృత్తాంతాలు 24:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 30:12-16; నెహె 10:32; మత్త 17:24

2 దినవృత్తాంతాలు 24:10

అధస్సూచీలు

  • *

    లేదా “వాళ్లందరూ ఇచ్చేంతవరకు” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 29:9

2 దినవృత్తాంతాలు 24:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 12:10

2 దినవృత్తాంతాలు 24:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 12:11, 12; 2ది 34:10, 11

2 దినవృత్తాంతాలు 24:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 37:16; సం 7:84
  • +సం 28:3

2 దినవృత్తాంతాలు 24:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 23:1
  • +1రా 2:10

2 దినవృత్తాంతాలు 24:18

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

2 దినవృత్తాంతాలు 24:19

అధస్సూచీలు

  • *

    లేదా “వాళ్లకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తూ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 17:13, 14; 2ది 36:15, 16; యిర్మీ 7:25, 26

2 దినవృత్తాంతాలు 24:20

అధస్సూచీలు

  • *

    అక్ష., “కమ్ముకుంది.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 23:11
  • +ద్వితీ 29:24, 25; 1ది 28:9; 2ది 15:2

2 దినవృత్తాంతాలు 24:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 11:19
  • +మత్త 23:35; లూకా 11:51

2 దినవృత్తాంతాలు 24:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 9:5; కీర్త 94:1; యిర్మీ 11:20; హెబ్రీ 10:30

2 దినవృత్తాంతాలు 24:23

అధస్సూచీలు

  • *

    అక్ష., “సంవత్సరం మారుతున్నప్పుడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 12:17
  • +2ది 24:17, 18

2 దినవృత్తాంతాలు 24:24

అధస్సూచీలు

  • *

    అంటే, సిరియన్లు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 26:17, 37; ద్వితీ 32:30

2 దినవృత్తాంతాలు 24:25

అధస్సూచీలు

  • *

    లేదా “అతను చాలా జబ్బులతో ఉన్నాడు.”

  • *

    లేదా “కుమారుడి.” గౌరవం చూపించడానికి బహువచనం ఉపయోగించి ఉండవచ్చు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 24:20, 21
  • +2రా 12:20
  • +2స 5:9; 1రా 2:10
  • +2ది 21:16, 20; 28:27

2 దినవృత్తాంతాలు 24:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 12:21

2 దినవృత్తాంతాలు 24:27

అధస్సూచీలు

  • *

    లేదా “కథనంలో; వ్యాఖ్యానంలో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 24:20
  • +2ది 24:13

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

2 దిన. 24:12రా 11:21
2 దిన. 24:1ఆది 21:14; 2స 3:10; 2రా 12:1
2 దిన. 24:22రా 12:2
2 దిన. 24:42రా 22:3-5
2 దిన. 24:52రా 12:4, 5; 2ది 29:1, 3; 34:9, 10
2 దిన. 24:52రా 12:6
2 దిన. 24:62రా 12:7
2 దిన. 24:6సం 1:50
2 దిన. 24:6నిర్గ 30:12-16
2 దిన. 24:72ది 22:2, 3
2 దిన. 24:72ది 28:24
2 దిన. 24:8మార్కు 12:41
2 దిన. 24:82రా 12:9
2 దిన. 24:9నిర్గ 30:12-16; నెహె 10:32; మత్త 17:24
2 దిన. 24:101ది 29:9
2 దిన. 24:112రా 12:10
2 దిన. 24:122రా 12:11, 12; 2ది 34:10, 11
2 దిన. 24:14నిర్గ 37:16; సం 7:84
2 దిన. 24:14సం 28:3
2 దిన. 24:162ది 23:1
2 దిన. 24:161రా 2:10
2 దిన. 24:192రా 17:13, 14; 2ది 36:15, 16; యిర్మీ 7:25, 26
2 దిన. 24:202ది 23:11
2 దిన. 24:20ద్వితీ 29:24, 25; 1ది 28:9; 2ది 15:2
2 దిన. 24:21యిర్మీ 11:19
2 దిన. 24:21మత్త 23:35; లూకా 11:51
2 దిన. 24:22ఆది 9:5; కీర్త 94:1; యిర్మీ 11:20; హెబ్రీ 10:30
2 దిన. 24:232రా 12:17
2 దిన. 24:232ది 24:17, 18
2 దిన. 24:24లేవీ 26:17, 37; ద్వితీ 32:30
2 దిన. 24:252ది 24:20, 21
2 దిన. 24:252రా 12:20
2 దిన. 24:252స 5:9; 1రా 2:10
2 దిన. 24:252ది 21:16, 20; 28:27
2 దిన. 24:262రా 12:21
2 దిన. 24:272ది 24:20
2 దిన. 24:272ది 24:13
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
2 దినవృత్తాంతాలు 24:1-27

దినవృత్తాంతాలు రెండో గ్రంథం

24 యెహోయాషు రాజైనప్పుడు అతనికి ఏడేళ్లు.+ అతను యెరూషలేములో 40 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి బెయేర్షెబాకు+ చెందిన జిబ్యా. 2 అతను యాజకుడైన యెహోయాదా బ్రతికున్నంత కాలం యెహోవా దృష్టిలో సరైనది చేస్తూ ఉన్నాడు.+ 3 యెహోయాదా అతనికి ఇద్దరు స్త్రీలతో పెళ్లి చేశాడు. అతనికి కుమారులు, కూతుళ్లు పుట్టారు.

4 కొంతకాలం తర్వాత యెహోయాషు, యెహోవా మందిరాన్ని బాగుచేయాలని+ తన హృదయంలో కోరుకున్నాడు. 5 అప్పుడు అతను యాజకుల్ని, లేవీయుల్ని పిలిపించి, వాళ్లతో ఇలా అన్నాడు: “ప్రతీ సంవత్సరం మీ దేవుని మందిరాన్ని బాగుచేయడానికి, మీరు యూదా నగరాలకు వెళ్లి ఇశ్రాయేలీయులందరి దగ్గర డబ్బులు సేకరించండి;+ మీరు ఈ పనిని వెంటనే చేయండి.” కానీ లేవీయులు ఆ పనిని వెంటనే చేయలేదు.+ 6 కాబట్టి యెహోయాషు రాజు ముఖ్య యాజకుడైన యెహోయాదాను పిలిచి అతనితో ఇలా అన్నాడు:+ “సాక్ష్యపు గుడారం+ కోసం యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన పవిత్రమైన పన్నును+ అంటే ఇశ్రాయేలు సమాజం ఇవ్వాల్సిన పవిత్రమైన పన్నును యూదా, యెరూషలేముల నుండి తీసుకురమ్మని నువ్వు లేవీయుల్ని ఎందుకు అడగలేదు? 7 ఆ దుష్టురాలైన అతల్యా+ కుమారులు సత్యదేవుని మందిరంలోకి చొరబడి,+ యెహోవా మందిరంలోని పవిత్రమైన వస్తువులన్నిటినీ బయలు దేవుళ్ల కోసం ఉపయోగించారు.” 8 రాజు ఆజ్ఞాపించినట్టు వాళ్లు ఒక పెట్టెను+ చేయించి, దాన్ని బయట యెహోవా మందిర ద్వారం దగ్గర ఉంచారు.+ 9 తర్వాత, ఎడారిలో సత్యదేవుని సేవకుడైన మోషే ఇశ్రాయేలీయులకు విధించిన పవిత్రమైన పన్నును+ యెహోవా దగ్గరికి తీసుకురమ్మని యూదా, యెరూషలేము అంతటా చాటించారు. 10 అధిపతులందరూ, ప్రజలందరూ సంతోషంగా+ విరాళాలు తెస్తూ పెట్టె నిండేంతవరకు* దానిలో వేస్తూ వచ్చారు.

11 లేవీయులకు ఆ పెట్టెలో చాలా డబ్బులు కనిపించినప్పుడల్లా వాళ్లు దాన్ని రాజు దగ్గరికి తెచ్చేవాళ్లు. అప్పుడు రాజు కార్యదర్శి, ముఖ్య యాజకుని అధికారి వచ్చి ఆ పెట్టెను ఖాళీ చేసేవాళ్లు.+ తర్వాత దాన్ని దాని స్థానంలో పెట్టేవాళ్లు. వాళ్లు ప్రతీరోజు అలా చేసేవాళ్లు. అలా వాళ్లు విస్తారంగా డబ్బు సమకూర్చారు. 12 రాజు, యెహోయాదా ఆ డబ్బును యెహోవా మందిర పనిని పర్యవేక్షిస్తున్నవాళ్లకు ఇచ్చేవాళ్లు. వాళ్లు ఆ డబ్బుతో యెహోవా మందిరాన్ని బాగుచేయడానికి రాళ్లు చెక్కేవాళ్లను, నైపుణ్యంగల పనివాళ్లను, అలాగే యెహోవా మందిరాన్ని బాగుచేయడానికి+ ఇనుము, రాగి పనివాళ్లను కూలికి తెచ్చేవాళ్లు. 13 పర్యవేక్షకులు పనిని ప్రారంభించారు, వాళ్ల పర్యవేక్షణలో మరమ్మతు పని కొనసాగింది. వాళ్లు సత్యదేవుని మందిరాన్ని మునుపటి స్థితికి తీసుకొచ్చి దాన్ని పటిష్ఠం చేశారు. 14 వాళ్లు ఆ పని పూర్తిచేయగానే, మిగిలిన డబ్బును రాజు దగ్గరికి, యెహోయాదా దగ్గరికి తీసుకొచ్చారు. వాళ్లు ఆ డబ్బును యెహోవా మందిరం కోసం పాత్రల్ని, పరిచారం కోసం, అర్పణల కోసం ఉపయోగించే పాత్రల్ని, వెండి-బంగారు గిన్నెల్ని, పాత్రల్ని+ చేయించడానికి ఉపయోగించారు. యెహోయాదా బ్రతికున్నంత కాలం యెహోవా మందిరంలో ప్రతీరోజు దహనబలులు+ అర్పించబడుతూ ఉండేవి.

15 యెహోయాదా చాలాకాలం జీవించి ముసలివాడై తృప్తిగా చనిపోయాడు; చనిపోయినప్పుడు అతని వయసు 130 ఏళ్లు. 16 అతను సత్యదేవునికి, ఆయన మందిరానికి సంబంధించి ఇశ్రాయేలులో మంచిపనులు చేశాడు+ కాబట్టి అతన్ని దావీదు నగరంలో రాజులతోపాటు పాతిపెట్టారు.+

17 యెహోయాదా చనిపోయిన తర్వాత యూదా అధిపతులు రాజు దగ్గరికి వచ్చి అతనికి సాష్టాంగపడ్డారు, రాజు వాళ్ల మాట విన్నాడు. 18 ప్రజలు తమ పూర్వీకుల దేవుడైన యెహోవా మందిరాన్ని విడిచిపెట్టి పూజా కర్రల్ని,* విగ్రహాల్ని పూజించడం మొదలుపెట్టారు. దాంతో వాళ్ల అపరాధం కారణంగా యూదా మీదికి, యెరూషలేము మీదికి దేవుని కోపం వచ్చింది. 19 యెహోవా వాళ్లను మళ్లీ తన దగ్గరికి తీసుకురావడానికి ప్రవక్తల్ని పంపిస్తూ ఉన్నాడు. ఆ ప్రవక్తలు వాళ్లను హెచ్చరిస్తూ* ఉన్నా వాళ్లు వినడానికి ఇష్టపడలేదు.+

20 యాజకుడైన యెహోయాదా కుమారుడు+ జెకర్యా మీదికి దేవుని పవిత్రశక్తి వచ్చింది.* అప్పుడు అతను ప్రజల కన్నా కాస్త ఎత్తులో నిలబడి వాళ్లతో ఇలా అన్నాడు: “సత్యదేవుడు చెప్తున్నదేమిటంటే, ‘మీరు యెహోవా ఆజ్ఞల్ని ఎందుకు మీరుతున్నారు? మీరు వర్ధిల్లరు! మీరు యెహోవాను విడిచిపెట్టారు కాబట్టి ఆయన కూడా మిమ్మల్ని విడిచిపెడతాడు.’ ”+ 21 అప్పుడు వాళ్లు అతని మీద కుట్రపన్ని,+ రాజాజ్ఞ ప్రకారం అతన్ని యెహోవా మందిరంలోని ప్రాంగణంలో రాళ్లతో కొట్టి చంపారు.+ 22 అలా యెహోయాషు రాజు, జెకర్యా తండ్రైన యెహోయాదా తనమీద చూపించిన విశ్వసనీయ ప్రేమను మర్చిపోయి, అతని కుమారుణ్ణి చంపాడు. జెకర్యా చనిపోతూ ఇలా అన్నాడు: “యెహోవా దీన్ని చూసి, నిన్ను లెక్క అడగాలి.”+

23 సంవత్సరం ప్రారంభంలో* సిరియా సైన్యం యెహోయాషు మీదికి వచ్చింది. వాళ్లు యూదా మీద, యెరూషలేము మీద దాడిచేశారు.+ వాళ్లు ప్రజల అధిపతులందర్నీ చంపారు,+ వాళ్లు తమ దోపుడుసొమ్ము అంతటినీ దమస్కు రాజుకు పంపించారు. 24 దండెత్తిన సిరియా సైన్యంలో కొంతమందే ఉన్నా, యెహోవా వాళ్ల చేతికి చాలా పెద్ద సైన్యాన్ని అప్పగించాడు.+ ఎందుకంటే ప్రజలు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టారు; కాబట్టి వాళ్లు* యెహోయాషును శిక్షించారు. 25 వాళ్లు అతని దగ్గర నుండి వెళ్లినప్పుడు (ఎందుకంటే వాళ్లు అతన్ని తీవ్రంగా గాయపర్చారు*), అతని సేవకులు అతని మీద కుట్రపన్నారు. ఎందుకంటే అతను యాజకుడైన యెహోయాదా కుమారుల* రక్తాన్ని చిందించాడు.+ వాళ్లు అతన్ని అతని మంచం మీదే చంపారు.+ వాళ్లు అతన్ని దావీదు నగరంలో+ పాతిపెట్టారు కానీ రాజుల సమాధుల్లో పాతిపెట్టలేదు.+

26 అతని మీద కుట్రపన్నినవాళ్లు+ ఎవరంటే: అమ్మోనీయురాలైన షిమాతు కుమారుడు జాబాదు, మోయాబీయురాలైన షిమ్రీతు కుమారుడు యెహోజాబాదు. 27 అతని కుమారుల్ని గురించిన, అతనికి వ్యతిరేకంగా చెప్పబడిన తీర్పుల గురించిన,+ సత్యదేవుని మందిరం బాగుచేయడం+ గురించిన విషయాలన్నీ రాజుల గ్రంథంలోని రాతల్లో* నమోదు చేయబడ్డాయి. అతని స్థానంలో అతని కుమారుడు అమజ్యా రాజయ్యాడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి