కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెహోషువ 2
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యెహోషువ విషయసూచిక

      • యెహోషువ ఇద్దరు గూఢచారుల్ని యెరికోకు పంపించడం (1-3)

      • రాహాబు గూఢచారుల్ని దాచిపెట్టడం (4-7)

      • రాహాబుకు మాటివ్వడం (8-21ఎ)

        • గుర్తుగా ఎర్ర తాడు (18)

      • గూఢచారులు యెహోషువ దగ్గరికి తిరిగిరావడం (21బి-24)

యెహోషువ 2:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 25:1; 33:49
  • +యెహో 6:17; మత్త 1:5; హెబ్రీ 11:31; యాకో 2:25

యెహోషువ 2:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/1/2004, పేజీలు 8-9

    12/15/1993, పేజీలు 22-23, 25

యెహోషువ 2:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 5/2022, పేజీ 1

    కావలికోట,

    12/1/2004, పేజీలు 8-9

    12/15/1993, పేజీలు 22-23, 25

యెహోషువ 2:6

అధస్సూచీలు

  • *

    లేదా “డాబా.”

యెహోషువ 2:7

అధస్సూచీలు

  • *

    అంటే, నదిని నడుస్తూ దాటగలిగేలా లోతు తక్కువ ఉన్న ప్రదేశం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 3:28; 12:5

యెహోషువ 2:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 3:8
  • +నిర్గ 23:27; ద్వితీ 2:25; 11:25
  • +నిర్గ 15:15; యెహో 5:1

యెహోషువ 2:10

అధస్సూచీలు

  • *

    లేదా “ఈజిప్టు.”

  • *

    అంటే, తూర్పు వైపున.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 14:21; 15:13, 14
  • +సం 21:21-24
  • +సం 21:33, 34; ద్వితీ 3:3; యెహో 9:9, 10

యెహోషువ 2:11

అధస్సూచీలు

  • *

    లేదా “మా గుండెలు నీరుగారిపోయాయి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 4:39; 2ది 20:6; దాని 4:35

యెహోషువ 2:12

అధస్సూచీలు

  • *

    లేదా “నమ్మదగిన.”

యెహోషువ 2:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 6:23

యెహోషువ 2:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 11:31

యెహోషువ 2:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 30:2

యెహోషువ 2:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 6:23

యెహోషువ 2:19

అధస్సూచీలు

  • *

    అక్ష., “రక్తానికి.”

యెహోషువ 2:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 2:14

యెహోషువ 2:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 23:31; యెహో 6:2; 21:44
  • +నిర్గ 15:14-16; యెహో 2:9-11; 5:1

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యెహో. 2:1సం 25:1; 33:49
యెహో. 2:1యెహో 6:17; మత్త 1:5; హెబ్రీ 11:31; యాకో 2:25
యెహో. 2:7న్యా 3:28; 12:5
యెహో. 2:9నిర్గ 3:8
యెహో. 2:9నిర్గ 23:27; ద్వితీ 2:25; 11:25
యెహో. 2:9నిర్గ 15:15; యెహో 5:1
యెహో. 2:10నిర్గ 14:21; 15:13, 14
యెహో. 2:10సం 21:21-24
యెహో. 2:10సం 21:33, 34; ద్వితీ 3:3; యెహో 9:9, 10
యెహో. 2:11ద్వితీ 4:39; 2ది 20:6; దాని 4:35
యెహో. 2:13యెహో 6:23
యెహో. 2:15హెబ్రీ 11:31
యెహో. 2:17సం 30:2
యెహో. 2:18యెహో 6:23
యెహో. 2:20యెహో 2:14
యెహో. 2:24నిర్గ 23:31; యెహో 6:2; 21:44
యెహో. 2:24నిర్గ 15:14-16; యెహో 2:9-11; 5:1
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యెహోషువ 2:1-24

యెహోషువ

2 ఆ తర్వాత నూను కుమారుడైన యెహోషువ రహస్యంగా ఇద్దరు మనుషుల్ని షిత్తీము+ నుండి గూఢచారులుగా పంపించాడు. అతను వాళ్లకు ఇలా చెప్పాడు: “మీరు వెళ్లి దేశాన్ని, ముఖ్యంగా యెరికోను పరిశీలించి రండి.” కాబట్టి వాళ్లు యెరికోకు వెళ్లారు. వాళ్లు అక్కడ రాహాబు+ అనే వేశ్య ఇంటికి వెళ్లి ఆమె ఇంట్లో బసచేశారు. 2 యెరికో రాజుకు, “ఇదిగో! మన దేశాన్ని వేగుచూడడానికి రాత్రిపూట ఇశ్రాయేలు మనుషులు వచ్చారు” అనే వార్త అందింది. 3 అప్పుడు యెరికో రాజు రాహాబుకు ఇలా కబురు పంపించాడు: “నీ దగ్గరికి వచ్చి నీ ఇంట్లో ఉంటున్న మనుషుల్ని బయటికి తీసుకురా. వాళ్లు దేశాన్నంతటినీ వేగుచూడడానికి వచ్చారు.”

4 అయితే ఆమె ఆ ఇద్దరు మనుషుల్ని తీసుకెళ్లి దాచిపెట్టింది. ఆ తర్వాత ఆమె రాజు పంపిన మనుషులతో ఇలా అంది: “వాళ్లు నా దగ్గరికి వచ్చిన మాట నిజమే. కానీ వాళ్లు ఎక్కడి నుండి వచ్చారో నాకు తెలీదు. 5 చీకటి పడినప్పుడు, నగర ద్వారం మూసేసే సమయానికి ఆ మనుషులు వెళ్లిపోయారు. వాళ్లు ఎక్కడికి వెళ్లారో నాకు తెలీదు, అయితే మీరు త్వరగా వాళ్ల వెనకాలే వెళ్తే వాళ్లను పట్టుకోగలుగుతారు.” 6 (అయితే ఆమె వాళ్లను మిద్దె* మీదికి తీసుకెళ్లి, వరుసగా పరిచివున్న జనుప కట్టెల మధ్య వాళ్లను దాచిపెట్టింది.) 7 దాంతో రాజు పంపిన మనుషులు వాళ్లను వెతుక్కుంటూ యొర్దాను రేవుల*+ దారిలో వెళ్లారు. వాళ్లు బయటికి వెళ్లగానే నగర ద్వారాన్ని మూసేశారు.

8 ఆ ఇద్దరు మనుషులు పడుకునేముందు, ఆమె మిద్దె మీదున్న వాళ్ల దగ్గరికి వచ్చి, 9 వాళ్లతో ఇలా అంది: “యెహోవా మీకు ఈ దేశాన్ని+ ఇస్తాడని నాకు తెలుసు, మీరంటే మాకు భయం పట్టుకుంది.+ మీ వల్ల మా దేశ ప్రజలందరి గుండెలు జారిపోయాయి.+ 10 ఎందుకంటే మీరు ఐగుప్తు* నుండి వస్తున్నప్పుడు యెహోవా మీ ముందు ఎర్రసముద్రం నీళ్లను ఎలా ఎండిపోయేలా చేశాడో,+ అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనును,+ ఓగును+ మీరు ఏమి చేశారో, యొర్దాను అవతల* మీరు వాళ్లను ఎలా పూర్తిగా నాశనం చేశారో మేము విన్నాం. 11 అది విన్నప్పుడు మేము చాలా భయపడిపోయాం.* మిమ్మల్ని ఎదిరించే ధైర్యం మాలో ఎవ్వరికీ లేదు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా పైన ఆకాశంలో, కింద భూమ్మీద దేవుడు.+ 12 నేను మీ మీద విశ్వసనీయ ప్రేమ చూపించాను కాబట్టి మీరు కూడా నా తండ్రి ఇంటివాళ్లమీద విశ్వసనీయ ప్రేమ చూపిస్తారని యెహోవా పేరున దయచేసి ప్రమాణం చేయండి; అంతేకాదు, నమ్మడానికి* ఒక సూచన ఇవ్వండి. 13 మీరు నా తల్లిదండ్రుల, నా అన్నదమ్ముల, అక్కచెల్లెళ్ల ప్రాణాల్ని, వాళ్ల తరఫు వాళ్లందరి ప్రాణాల్ని కాపాడాలి, మేము చావకుండా మీరు మమ్మల్ని రక్షించాలి.”+

14 అప్పుడు వాళ్లు ఆమెతో ఇలా అన్నారు: “మీ ప్రాణాలకు బదులుగా మా ప్రాణాలు ఇస్తాం! మేము వచ్చిన పని గురించి మీరు చెప్పకుండా ఉంటే, యెహోవా మాకు ఈ దేశాన్ని ఇచ్చినప్పుడు మీ మీద విశ్వసనీయ ప్రేమను, నమ్మకత్వాన్ని చూపిస్తాం.” 15 తర్వాత ఆమె వాళ్లను ఒక తాడుతో కిటికీ నుండి కిందికి దింపింది. ఎందుకంటే ఆమె ఇల్లు నగర ప్రాకారం మీద ఉంది.+ 16 అప్పుడు ఆమె వాళ్లతో, “మిమ్మల్ని వెదికేవాళ్లకు మీరు దొరకకుండా కొండలకు వెళ్లి మూడు రోజులు అక్కడే దాక్కోండి. వాళ్లు వెనక్కి వచ్చిన తర్వాత, మీ దారిన మీరు వెళ్లొచ్చు” అని అంది.

17 ఆ మనుషులు ఆమెతో ఇలా అన్నారు: “నువ్వు మాతో చేయించిన ప్రమాణానికి+ మేము కట్టుబడి ఉండాలంటే 18 మేము ఈ దేశానికి వచ్చినప్పుడు, నువ్వు మమ్మల్ని దింపిన కిటికీకి ఈ ఎర్ర తాడు కట్టాలి. నువ్వు నీ తల్లిదండ్రుల్ని, నీ అన్నదమ్ముల్ని, నీ తండ్రి ఇంటివాళ్లందర్నీ నీ ఇంట్లోకి తెచ్చుకోవాలి.+ 19 నీ ఇంట్లో నుండి ఎవరైనా బయటికి వెళ్తే వాళ్ల చావుకు* వాళ్లే బాధ్యులౌతారు, మా మీద అపరాధం ఉండదు. అయితే నీతోపాటు నీ ఇంట్లో ఉన్న ఎవరికైనా హాని జరిగితే, వాళ్ల చావుకు మేము బాధ్యులమౌతాం. 20 కానీ మేము వచ్చిన పని గురించి నువ్వు ఎవరికైనా చెప్తే,+ నువ్వు మాతో చేయించిన ప్రమాణానికి మేము కట్టుబడి ఉండం.” 21 దానికి ఆమె, “మీరు చెప్పినట్టే జరగాలి” అని అంది.

ఆమె ఆ మాట చెప్పి వాళ్లను పంపించేసింది, వాళ్లు తమ దారిన వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆమె కిటికీకి ఎర్ర తాడు కట్టింది. 22 అప్పుడు వాళ్లు అక్కడి నుండి కొండలకు వెళ్లి తమను వెదుకుతున్నవాళ్లు తిరిగొచ్చే వరకు మూడు రోజులు అక్కడే ఉన్నారు. వెదుకుతున్నవాళ్లు ఈ ఇద్దరి కోసం అన్ని దారులు వెదికారు కానీ వాళ్లు దొరకలేదు. 23 తర్వాత ఆ ఇద్దరు మనుషులు కొండల నుండి కిందికి దిగి, నది దాటి నూను కుమారుడైన యెహోషువ దగ్గరికి వచ్చారు. వాళ్లు తమకు జరిగినవన్నీ అతనికి చెప్పారు. 24 వాళ్లు యెహోషువతో ఇలా అన్నారు: “యెహోవా ఆ దేశాన్నంతా మనకు అప్పగించాడు.+ నిజానికి, మనల్ని బట్టి ఆ దేశంలో ఉన్న వాళ్లందరి గుండెలు జారిపోయాయి.”+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి